E-Paper
Advertisement

Bigg Boss: బిగ్ బాస్ పై పిచ్చితో కెరీర్ ను ఇరకాటంలో పెట్టిన రోహిణి..!

Bigg Boss: బిగ్ బాస్ పై పిచ్చితో కెరీర్ ను ఇరకాటంలో పెట్టిన రోహిణి..!
Advertisement

Bigg Boss.. అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న రోహిణి (Rohini) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతంలో ప్రముఖ ఛానెల్ లో ప్రసారమైన కొంచెం ఇష్టం కొంచెం కష్టం అనే టీవీ సీరియల్ లో నెల్లూరు యాసలో అద్భుతంగా ఆకట్టుకున్న రోహిణి.. ఈ సీరియల్ తోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈ సీరియల్ తీసుకొచ్చిన క్రేజ్ కి ఈమెకు పలు సీరియల్స్ లో అవకాశాలు తలుపు తట్టాయి. అలా చిన్నగా పాపులారిటీ సంపాదించుకున్న రోహిణి బిగ్ బాస్ సీజన్ 3 లోకి వైల్డ్ కార్డు ద్వారా అడుగు పెట్టింది.

కాలు విరిగి ఏడాది పాటు మంచానికే పరిమితం..

Advertisement

ముఖ్యంగా హౌస్ లోకి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చినప్పటికీ టాస్కులు, ఎంటర్టైన్మెంట్, పంచులతో కంటెస్టెంట్స్ కే కాదు ఇటు ఆడియన్స్ కి కూడా మంచి వినోదాన్ని పంచేది. అయితే హౌస్ లో ఎక్కువగా వెనుక చేరి మాట్లాడుతుండడంతో నెగిటివిటీ వచ్చి పడింది.. ఫలితంగా ఏడు వారాల్లోని ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది రోహిణి. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈమె కెరియర్ అమాంతం మారిపోయింది. పైగా వరుస అవకాశాలు క్యూ కట్టాయి. అలా కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే యాక్సిడెంట్ అవ్వడంతో కాళ్లు కాస్త విరిగాయి. చాలా రోజులు ట్రీట్మెంట్ తీసుకున్న ఈమె కొంతకాలం వీల్ చైర్ కే పరిమితమైంది.

సూపర్ హిట్ సినిమాలే కాదు.. వెబ్ సిరీస్ లు కూడా..

Advertisement

అలా ఏడాది పాటు బుల్లితెర ఇండస్ట్రీకి దూరమైన రోహిణి మళ్లీ సీరియల్స్ లోకి ఎంట్రీ ఇచ్చి ఎంటర్టైన్మెంట్ షో లతో ఆకట్టుకుంది. ముఖ్యంగా రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈమెకు అదృష్టం బాగా కలిసి వచ్చిందని చెప్పాలి. వరుస అవకాశాలు ఈమె కోసం క్యూ కట్టాయి. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో కూడా మంచి మంచి కామెడీ పాత్రలు చేస్తూ ఆకట్టుకుంది. ఏడాది కూడా డబుల్ ఇస్మార్ట్ , మత్తు వదలరా -2 వంటి చిత్రాలలో కనిపించిన ఈమె గతంలో సేవ్ ద టైగర్స్ వెబ్ సిరీస్ చేసి మరింత పేరు సొంతం చేసుకుంది.. ఇక జబర్దస్త్ లో ఆటో రాంప్రసాద్ టీం లో కొనసాగుతున్న ఈమె , స్టార్ మా చానల్లో ప్రసారమయ్యే ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో కూడా ఆకట్టుకుంటుంది.

కెరియర్ ను ఇరకాటంలో పెట్టుకున్న రోహిణి..

ఇకపోతే మళ్లీ బిగ్ బాస్ సీజన్ 8 లోకి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈమె భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఒక్క వారానికి రూ .4లక్షలు తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే ఈ బిగ్ బాస్ పై ఉన్న పిచ్చి కారణంగా కెరియర్ నీ ఇరకాటంలో పెట్టుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అసలు విషయంలోకెళితే ప్రస్తుతం సినిమాలలో జోరుగా దూసుకుపోతున్న రోహిణికి చాలా పెద్ద సినిమాలలో అవకాశాలు కూడా వచ్చాయట. అయితే బిగ్ బాస్ లోకి రావాలన్న కోరికతో ఆ సినిమాలన్నింటిని కూడా రిజెక్ట్ చేసినట్లు సమాచారం. ఏదేమైనా బిగ్ బాస్ పై పిచ్చితో కెరీర్ను ఇరకాటంలో పెట్టుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి బిగ్ బాస్ తర్వాత ఈమెకు ఏ విధంగా కలిసి వస్తుందో చూడాలి.

 

View this post on Instagram

 

Tags

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×