Bigg Boss 9: బిగ్ బాస్.. వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షోగా గుర్తింపు తెచ్చుకున్న ఈ షో గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఇప్పటికే తెలుగులో 8 సీజన్లు దిగ్విజయంగా పూర్తవగా తొమ్మిదవ సీజన్ కూడా ప్రారంభం అయ్యింది. ఇకపోతే 9 మంది సెలబ్రిటీలు హౌస్ లోకి అడుగుపెట్టగా.. 6 మంది కామనర్స్ హౌస్ లోకి వచ్చారు. అయితే వీరందరికీ కూడా అగ్నిపరీక్ష అంటూ వారం రోజులపాటు ఒక మినీ షో నిర్వహించి.. అందులో పలు టాస్కులలో నెగ్గిన 6 మందిని ఫైనల్ గా ఎంపిక చేయడం జరిగింది.
అలా మొదటి వారం ప్రముఖ సెలబ్రిటీ శ్రష్టి వర్మ ఎలిమినేట్ అవ్వగా .. ఇప్పుడు రెండవ వారం నామినేషన్స్ ప్రక్రియ కూడా చాలా వాడి వేడిగా జరిగిన విషయం తెలిసిందే. ఇకపోతే ఇప్పుడు ఫన్ టైం వచ్చేసింది. అందులో భాగంగానే తాజాగా పదవ రోజుకు సంబంధించి మొదటి ప్రోమోను నిర్వాహకులు విడుదల చేయగా.. అందులో ఇమ్మానుయేల్ – తనూజా మధ్య జరిగిన ఫోన్ సంభాషణ హౌస్ లోని కంటెస్టెంట్స్ కే కాదు ఇటు చూసే ఆడియన్స్ కి కూడా నవ్వులు తెప్పించింది.
పదవరోజు మొదటి ప్రోమో రిలీజ్..
ప్రోమో విషయానికి వస్తే.. తనూజ ఇమ్మానుయేల్ మధ్య ఫోన్ సంభాషణ జరిగింది. అందులో తనూజ అలా ఫోన్ చేయగానే.. ఇమ్మానుయేల్ ఇక్కడ ఫోన్ మాట్లాడకుండా ఆమెకు ముద్దుల వర్షం కురిపించారు. ఇక ఆమె ఫోన్ కట్ చేసింది. ఆ తర్వాత మళ్లీ చేశారు. చివరికి నువ్వు రమేష్ కాదా అంటూ జలక్ ఇచ్చాడు ఇమ్మానుయేల్. అలా మొత్తానికైతే నవ్వుల వర్షంతో ఈ ప్రోమో చాలా కామెడీగా సాగింది అని చెప్పవచ్చు. ఇక తాజాగా ఈ ప్రోమో కు సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఈవారం ఆయన పై వేటు తప్పదా?
బిగ్బాస్ కార్యక్రమం విషయానికి వస్తే.. బుల్లితెర సీరియల్స్ ద్వారా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న తనూజ, సుమన్ శెట్టి, భరణి శంకర్ ,రాము రాథోడ్, సంజన గల్రానీ, రీతూ చౌదరి, శ్రష్టి వర్మ, ఫ్లోరా షైనీ, ఇమ్మానుయెల్ ఇలా మొత్తం 9 మంది సెలబ్రిటీలు హౌస్ లోకి అడుగుపెట్టగా.. అందులో శ్రష్టి వర్మ మొదటి వారం ఎలిమినేట్ అయింది
. కామనర్స్ అంటూ మాస్క్ మ్యాన్ హరీష్, మర్యాద మనీష్, ఆర్మీ కళ్యాణ్ , డెమోన్ పవన్, దమ్ము శ్రీజ, ప్రియా శెట్టి ఇలా 6 మంది హౌస్ లోకి అడుగుపెట్టారు. ఇకపోతే ఈ వారం మాస్క్ మాన్ హరీష్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.. ముఖ్యంగా పూర్తి వ్యతిరేకత హౌస్ లో ఇప్పుడు ఈయనపైనే ఉంది.. కానీ ఆడియన్స్ ఒకవేళ ఈయనకు సపోర్టుగా ఓట్లు వేశారు అంటే కచ్చితంగా ఈయన సేఫ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియాలి అంటే వీకెండ్స్ వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే.