Mohammed Siraj : భారత క్రికెటర్ మహ్మద్ సిరాజ్ ప్రధాని నరేంద్ర మోడీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ 75వ పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని మోడీతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్. ముఖ్యంగా ప్రధాని మోడీ ఓటమి బాధతో కుంగిపోయిన తమలో స్ఫూర్తి నింపారని తెలిపారు. “2023 వరల్డ్ కప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలయ్యాం. దీంతో అంతా డ్రెస్సంగ్ రూమ్ లో నిరాశగా కూర్చున్నాం. అప్పుడు ప్రధాని మా దగ్గరికి వచ్చారు. ఆయన స్పీచ్ మాలో స్ఫూర్తి నింపింది. సరిగ్గా ఏడాది తరువాత టీ-20 వరల్డ్ కప్ గెలిచాం. అప్పుడు ప్రధాని మోడీ కాల్ చేశారు. ఓటమి, విజయాల్లో ఆయన మాతోనే ఉన్నారు” అని గుర్తు చేశారు సిరాజ్.
Also Read : Asia Cup 2025 : నేడే పాకిస్తాన్ వర్సెస్ యూఏఈ మ్యాచ్.. ఎలిమినేట్ అయ్యేది ఎవ్వరో..?
“మై మోడీ స్టోరీ” ప్రచారంలో భాగంగా ఎక్స్ వేదికగా సిరాజ్ ఓ వీడియోను పంచుకున్నారు. అందులో ఆయన మాట్లాడుతూ.. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ లో ఓడిపోయినప్పుడు మోడీ నేరుగా డ్రెస్సింగ్ రూమ్ కి వచ్చి మమ్ముల్ని ఓదార్చారు. ఇక 2024లో మేము టీ-20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఫోన్ చేసి ప్రత్యేకంగా అభినందించారు. ఇదే ప్రచారంలో భాగంగా భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కూడా ప్రధాని మోడీ తన తొలి సమావేశాన్ని గుర్తు చేసుకున్నాడు. ముఖ్యంగా ప్రధాని మేధస్సు, విషయాలను గ్రహించే శక్తి తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపారు. 75 ఏళ్ల వయస్సులో కూడా ఆయన ఎంతో వినయంగా ఉంటారు. దేశ నిర్మాణం కోసం ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తుననారని శ్రీకాంత్ తన పోస్ట్ లో ప్రశంసించారు. మరోవైపు మై మోడీ స్టోరీ క్యాంపెయిన్ ద్వారా పలు రంగాలకు చెందిన ప్రముఖులు ఆయనతో వ్యక్తిగత అనుభవాలను పంచుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇదిలా టీమిండియా కీలక బౌలర్ మహ్మద్ సిరాజ్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్ లో కొనసాగుతున్నాడు. ఇటీవల ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో భారత్ డ్రా తో ముగించిందంటే..? అందుకు కారణం మహ్మద్ సిరాజ్ అనే చెప్పవచ్చు. అయితే అలాంటి బౌలర్ సిరాజ్ ని ఆసియా కప్ 2025కి ఎంపిక చేయకపోవడంతో పలువురు క్రీడా విశ్లేషకులు సంచలన కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు 2023 వన్డే వరల్డ్ కప్ టీమిండియా చాలా అద్భుతంగా ఆడింది. ఒక్క మ్యాచ్ కూడా ఓటమి చెందలేద. కానీ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది. దెబ్బ తిన్న పులిలా వెంటనే ఆ ఓటమి బాధ నుంచి తేరుకొని.. వరుసగా రెండేళ్లలో రెండు టైటిల్ సాధించింది. 2024 టీ-20 వరల్డ్ కప్, ఈ ఏడాది 2025లో ఛాంపియన్స్ ట్రోఫీని టీమిండియా కైవసం చేసుకుంది.