SBI Bank Robbery: దోపిడీ దొంగలు రూటు మార్చారు. ఈ మధ్యకాలంలో బ్యాంకులను టార్గెట్ చేసుకున్నారు. వీలు చిక్కితే బ్యాంకులను దోచేస్తున్న ఘటనలు దేశంలో క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా కర్ణాటకలోని విజయపుర జిల్లా ఎస్‌బీఐ శాఖలో భారీ దోపిడీ చోటు చేసుకుంది. దొంగలు ఆర్మీ యూనిఫామ్‌లో ఎంట్రీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఏకంగా 50 కేజీల బంగారం, 8 కోట్ల నగదు దోచుకెళ్లినట్టు తెలుస్తోంది. అసలెలా జరిగింది?
కర్ణాటకలో విజయపుర జిల్లాలోని చడ్చనా పట్టణంలో ఈ ఘటన జరిగింది. ఎస్బీఐ బ్యాంక్‌కు ఆర్మీ దుస్తులు ధరించి కొందరు దొంగలు వచ్చారు. వారి ముఖాలకు ముసుగులు ఉన్నాయి. తుపాకులతో సిబ్బందిని బెదిరించారు. ఆ తర్వాత లాకర్లలో 50 కేజీల బంగారం, 8 కోట్ల నగదును దోచుకున్నట్లు బ్యాంక్ వర్గాలు చెబుతున్నాయి.
మంగళవారం సాయంత్రం సమయంలో దొంగలు బ్యాంకులోకి చొరబడ్డారు. అప్పటికి వినియోగదారులు ఎవరూ లేకపోవడంతో ఉద్యోగులను బంధించి దోపిడీకి పాల్పడ్డారు. నిందితులు ఉపయోగించిన కారు పంధర్‌పుర్ ప్రాంతానికి చెందినది గుర్తించారు పోలీసులు. నార్మల్‌గా అయితే బ్యాంకులో దోపిడీ జరుగుతున్నట్టు తెలియగానే అలారమ్ మోగించాలి.
అయితే బెల్‌ను నొక్కకుండా బ్యాంక్ మేనేజర్‌ను ఆయుధాలతో బెదిరించినట్లు చెబుతున్నారు. ఈ ఘటన సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై బ్యాంకు సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ నిపుణులు బ్యాంకు చేరుకున్నారు.
ALSO READ: షాకింగ్ ఘటన.. 16 ఏళ్ల బాలుడిపై 14 మంది అత్యాచారం
సిబ్బందిని బెదిరించి స్ట్రాంగ్ రూమ్ వివరాలు తెలుసుకొని సొమ్మును దోచినట్టు గుర్తించారు పోలీసులు. దొంగల ముఠా మహారాష్ట్ర వైపు పారిపోయి ఉంటారని భావిస్తున్నారు. ఐదుగురు లేదా ఆరుగురు దోపిడీకి పాల్పడినట్టు ఓ అంచనా. దోపిడీ సమయంలో బ్యాంకు బయట ఎంతమంది ఉన్నారనేది తెలీదు. కర్ణాటక, మహారాష్ట్రలో దొంగల కోసం పోలీసులు టీమ్ గాలింపు మొదలుపెట్టాయి.
బ్యాంకు దోపిడీ వెనుక సిబ్బంది నిర్లక్ష్యం బయటపడుతుందని అంటున్నారు. సాయంత్రం నాలుగైదు గంటలకు బ్యాంకు లోపలికి ఎవరినీ సిబ్బంది అనుమతించరు. బ్యాంకు లోపల మిగతా పనులను రాత్రి ఎనిమిది లేదా తొమ్మిది గంటల వరకు చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. దీన్ని తమకు అనుకూలంగా దొంగలు మార్చుకుని ఉంటారన్నది పోలీసుల భావన.
మే నెలలో విజయపుర జిల్లా కెనరా బ్యాంక్‌లో భారీ దోపిడీ జరిగింది. లాకర్ల నుంచి 58 కిలోల బంగారం దాదాపు ఐదున్నర లక్షల క్యాష్ దుండుగులు దోచుకొన్నారు. బ్యాంకులో చొరబడే ముందు సీసీటీవీ కెమెరాల వైర్లు, కరెంటు వైర్లను కట్ చేసి ఎంట్రీ ఇచ్చారు. ఖాదీ మారా ముఠా ఈ దోపిడీకి పాల్పడినట్లు గుర్తించారు పోలీసులు. ఎస్బీఐ దోపిడీ వెనుక ఆ ముఠా ప్రమేయముందా అనేదానిపై ఆరా తీస్తున్నారు పోలీసులు.
VIDEO | Vijayapura, Karnataka: A gang of masked men struck at State Bank of India branch looting cash and gold worth crores on Tuesday evening. Police have launched manhunt to nab the criminals.#Bankloot #KarnatakaNews
(Full video available on PTI Videos -… pic.twitter.com/51eq1Jen6Y
— Press Trust of India (@PTI_News) September 17, 2025