E-Paper
Advertisement

Akhanda 2 : 6వ తారీఖు టికెట్స్ ఓపెన్, అంటే రేపు సినిమా రిలీజ్ కానట్లేనా?

Akhanda 2 : 6వ తారీఖు టికెట్స్ ఓపెన్, అంటే రేపు సినిమా రిలీజ్ కానట్లేనా?
Advertisement

Akhanda 2 : ఈ మధ్యకాలంలో భారీ అంచనాలు ఉన్న సినిమా అఖండ 2. గతంలో వచ్చిన అఖండ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. ఆ సినిమా తర్వాత బాలకృష్ణ చేసిన అన్ని సినిమాల్లో కూడా వరుస సక్సెస్ సాధించాయి. ప్రతి సినిమా విషయంలో కొన్ని అడ్డంకులు ఎదురవడం అనేది సహజంగా జరుగుతుంది. కానీ అఖండ 2 సినిమా విషయానికి వస్తే ఎవరు ఊహించని విధంగా ఈ సినిమాకి అడ్డంకులు వస్తున్నాయి. సినిమా ప్రీమియర్ షోలు కాసేపట్లో ప్రారంభం అవుతాయి అనగానే ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చి ఎదురయ్యాయి.

ఈ సినిమాను గతంలో సెప్టెంబర్ 27న విడుదల చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అదే డేట్ కు పవన్ కళ్యాణ్ నటించిన ఓ జి సినిమా వస్తుంది కాబట్టి పోస్ట్ ఫోన్ అయింది అని అనుకున్నారు. అయితే ఓ జి సినిమా సెప్టెంబర్ 25న విడుదలైంది. సెప్టెంబర్ 25న విడుదలవడానికి అంటే ముందు ఒక సంవత్సరం పాటు వాయిదా పడింది ఆ సినిమా. మొత్తానికి బాక్స్ ఆఫీస్ వద్ద ఈ రెండు సినిమాలు తలపడతాయి అనుకున్నారు. కానీ కొంత విఎఫ్ఎక్స్ వర్క్ పెండింగ్ ఉండటం వలన అఖండ 2 సినిమా పోస్ట్ పోన్ అయింది.

6వ తారీఖు టికెట్స్ ఓపెన్

Advertisement

అఖండ సినిమా డిసెంబర్ 5న విడుదలవుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఆ డేటున్న సినిమా విడుదలవుతుంది అంటే పెద్ద సినిమా కాబట్టి ఒకరోజు ముందుగానే ప్రీమియర్ షోలు పడటం సహజంగా జరుగుతుంది. కానీ ఈ సినిమాకు అలా జరగలేదు. చివరి నిమిషంలో ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చాయి.

ఇకపోతే ఈ సినిమా ముందు ప్రమోషన్ చేసిన మాదిరిగా డిసెంబర్ 5న కూడా విడుదల కావడం లేదు. ఎందుకంటే ఈ సినిమాకి ఐదో తారీకు సంబంధించిన టిక్కెట్లు ప్రస్తుతం ఆన్లైన్ లో పెట్టలేదు. నైజం ఏరియాలో కేవలం ఆరువ తారీకు డేటుకు సంబంధించిన టికెట్లు మాత్రమే ఆన్లైన్లో పెట్టారు. అంటే దీనిని బట్టి రేపు ఈ సినిమా విడుదల కావడం లేదు అనే క్లారిటీ చాలామందికి వచ్చేసింది.

ప్లానింగ్ ఉండాల్సింది 

Advertisement

చిన్న సినిమాలు రిలీజ్ డేట్ కి రాకుండా పోస్ట్ పోన్ అవ్వడం కామన్ గా జరుగుతుంది. కానీ ఒక సక్సెస్ఫుల్ కాంబినేషన్ లో వచ్చే సినిమా చెప్పిన డేట్ కి రావడం లేదు అంటే అది మామూలు విషయం కాదు. చాలామంది ఈ సినిమా కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారు. ముందే ఆ డేటు సినిమా రావట్లేదు అని అనౌన్స్ చేసి ఉంటే బాగుండేది.

కానీ ప్రాజెక్ట్ అంతా పూర్తయిన తర్వాత కాసేపట్లో ప్రీమియర్ షోలు మొదలవుతాయి అని ప్రేక్షకులందరూ ప్రిపేర్ అయిపోయిన తర్వాత, ఆ టైం కి సినిమా విడుదల కాకపోతే ఖచ్చితంగా నిరాశ కలగడం జరుగుతుంది. ప్రస్తుతం చాలామంది బాలకృష్ణ అభిమానులకు అదే జరిగింది. ఇక రేపు కూడా సినిమా రిలీజ్ అవుతుంది అనే నమ్మకం పోయింది.

Also Read: Akhanda 2 : ప్రొడ్యూసర్స్ కోసం పవన్ కళ్యాణ్ లా బాలకృష్ణ ఎందుకు రంగంలో దిగలేదు?

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×