OTT Movie : డిఫరెంట్ స్టోరీ కావాలనుకునే వాళ్ళు ఈ కన్నడ క్రైమ్ థ్రిల్లర్ ని చూస్ చేసుకోవచ్చు. ఈ చిత్రం కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం అనే ఆరు మానసిక శత్రువుల చుట్టూ తిరిగే కథ. ఇది జూన్ 2019లో లండన్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో వరల్డ్ ప్రీమియర్‌తో పాజిటివ్ రివ్యూలు పొందింది. తర్వాత సింగపూర్ సౌత్ ఆసియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, వాంకోవర్ ఇంటర్నేషనల్ సౌత్ ఆసియన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించబడింది. ఇందులో ఒక వ్యక్తి ఆర్థిక పరిస్థితుల వల్ల కాల్ బాయ్ అవతారం ఎత్తుతాడు. ఆ తరువాత స్టోరీ ఊపందుకుంటుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..
అనీష్ సినీ పరిశ్రమలో నటుడిగా రాణించాలనే కలలు కనే యువకుడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కాల్ బాయ్ గా పని చేస్తుంటాడు. ఒక రోజు రిచ్ లేడీ క్లయింట్ నుండి కాల్ వస్తుంది. అతను ఆమె ఇంటికి వెళ్తాడు, కానీ అక్కడ అతనికి సినీ నిర్మాత మంజునాథ్ భట్ శవం కనిపిస్తుంది. అనీష్ ఈ హత్యకు ఫ్రేమ్ చేయబడతాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన సాక్షి అనే ఒక నటి అతన్ని హంతకుడిగా భావిస్తుంది. అదే సమయంలో ఒక ఆటో డ్రైవర్ డబ్బు దొంగిలించేందుకు ఇంట్లోకి ప్రవేశించి, అనీష్, సాక్షిని చూసి షాక్ అవుతాడు. వారిని హంతకులుగా అనుమానిస్తాడు. ఈ సంఘటన ఒక గందరగోలంగా మారుతుంది.
అశోక్ అనే ఒక డైనమిక్ పోలీసు అధికారి, ఈ కేసును విచారించడం ప్రారంభిస్తాడు. కానీ మంజునాథ్ రెండవ భార్య కృతి ఎంట్రీతో కథ మరింత జటిలం అవుతుంది. కథలో కృతి అక్రమ సంబంధం, మంజునాథ్ వ్యాపార రాజకీయాలు అశోక్ దర్యాప్తులో బయట పడతాయి. అనీష్ తన ఆర్థిక సమస్యల నుండి బయటపడేందుకు ఈ పరిస్థితిని ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తాడు. కానీ అతని నిర్ణయాలు అతన్ని మరింత ఇబ్బందుల్లో పడేస్తాయి. చివరికి ఈ పరిస్థితి నుంచి అనీష్ బయట పడతాడా ? మంజునాథ్ ను చంపింది ఎవరు ? అనీష్ ను ఎందుకు ఇరికించారు ? అనీష్ కాల్ బాయ్ అవతారానికి ఫుల్ స్టాప్ పెడతాడా ? అనే ప్రశ్నలకు ఈ సినిమాను చూసి సమాధానాలను తెలుసుకోండి.
‘అరిషడ్వర్గ’ (Arishadvarga) 2019లో విడుదలైన కన్నడ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం. ఇది అరవింద్ కామత్ దర్శకత్వంలో రూపొందింది. ఇందులో అవినాష్ (మంజునాథ్ భట్), సమ్యుక్త హార్నాడ్ (సాక్షి), నంద గోపాల్ (పోలీసు అధికారి), మహేష్ బంగ్ (అనీష్), అంజు అల్వ నాయక్ (కృతి), గోపాలకృష్ణ దేశ్‌పాండే (ఆటో డ్రైవర్) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం 2020 నవంబర్ 27న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో కన్నడలో, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది. 2 గంటల 5 నిమిషాలతో IMDbలో 6.4/10 రేటింగ్ పొందింది.
Read Also : తెగిపడే అమ్మాయిల తలలు…. అత్యంత దారుణంగా నరికి చంపే సీరియల్ కిల్లర్… ఇంటెన్స్ మిస్టరీ థ్రిల్లర్