BigTV English

OTT Movie : అమ్మాయిల చర్మాన్ని వలిచి అమ్ముకునే రాకెట్… వలపు వల వేసి ట్రాప్… కేక పెట్టించే క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : అమ్మాయిల చర్మాన్ని వలిచి అమ్ముకునే రాకెట్… వలపు వల వేసి ట్రాప్… కేక పెట్టించే క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : అందాల తార హన్సిక మోట్వానీ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘మై నేమ్ ఈజ్ శృతి’. ఈ సినిమాలో హన్సిక నటన, సస్పెన్స్ ఎలిమెంట్స్ థ్రిల్లర్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రం స్కిన్ మాఫియా అనే ప్రత్యేకమైన కాన్సెప్ట్‌తో రూపొందింది. మహిళా సాధికారత థీమ్‌తో ఈ సినిమా ప్రధానంగా నడుస్తుంది. క్లైమాక్స్ ట్విస్టులు ఈ కథని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తాయి. ఈ స్టోరీ ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …


కథలోకి వెళ్తే

శృతి అనే యువతి హైదరాబాద్‌లో యాడ్ ఏజెన్సీలో పనిచేస్తుంటుంది. తన సినిమాటోగ్రఫీ కలలను సాకారం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయిన ఆమె తన తాత, తల్లి పెంపకంలో పెరుగుతుంది. ఆమె చరణ్ అనే వ్యక్తితో ప్రేమలో పడుతుంది. కానీ అతను మోసం చేస్తున్నాడని, తన స్నేహితురాలు అను ద్వారా తెలుసుకుంటుంది. ఈ నేపథ్యంలో శృతి తన ఫ్లాట్‌లో అనుకోకుండా ఒక దారుణ సంఘటనలో చిక్కుకుంటుంది. అక్కడ అను శవమై కనిపిస్తుంది. ఈ ఘటన శృతిని పోలీసు కస్టడీలోకి తీసుకెళ్తుంది. ఏసీపీ రంజిత్ ఆమెను విచారిస్తాడు. ఈ కేసు స్కిన్ మాఫియాతో ముడిపడి ఉందని, ఎమ్మెల్యే గురుమూర్తి ఈ నేరస్థుల ముఠాకు నాయకత్వం వహిస్తున్నాడని తెలుస్తుంది. శృతి ఈ అక్రమ రాకెట్ గురించి తెలుసుకుంటూ, తనను తాను రక్షించుకుంటూ, నేరస్థులను బయటపెట్టడానికి ప్రయత్నిస్తుంది.

సెకండ్ హాఫ్‌లో కథ మరింత ఉత్కంఠభరితంగా మారుతుంది. శృతి తన ధైర్యంతో స్కిన్ మాఫియాకు సంబంధించిన రహస్యాలను వెలికితీస్తుంది. గురుమూర్తి ముఠాలో డాక్టర్ కిరణ్మయి, బాబీ వంటి వాళ్ళు కీలకంగా ఉంటారు. వీళ్ళు అక్రమ స్కిన్ ట్రాఫికింగ్‌లో భాగమవుతారు. శృతి తన ప్రేమికుడు చరణ్ మోసాన్ని ఎదుర్కొని, అను మరణం వెనుక ఉన్న నిజాలను బయటపెట్టడానికి రంజిత్‌తో కలిసి పనిచేస్తుంది. చివరి 20 నిమిషాల్లో అనేక ట్విస్ట్‌లు, సస్పెన్స్ ఎలిమెంట్స్ ప్రేక్షకులకు చిల్లింగ్ థ్రిల్ ని ఇస్తాయి. ఈ క్లైమాక్స్ ఏమిటి ? శృతి వెలుగులోకి తెచ్చే నిజాలు ఏమిటి ? అనుని చంపింది ఎవరు ? ఆమె బాయ్ ఫ్రెండ్ పాత్ర ఇందులో ఎంత ? అనే ప్రశ్నలకు సమాధానాలను ఈ సినిమాని చూసి తెలుసుకోండి.


ఏ ఓటీటీలో ఉందంటే

“మై నేమ్ ఈజ్ శృతి” (My Name Is Shruthi) 2023లో విడుదలైన తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం. శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వంలో బురుగు రమ్య ప్రభాకర్, వైష్ణవి ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఇందులో హన్సిక మోట్వానీ (శృతి), మురళీ శర్మ (ఏసీపీ రంజిత్), ఆడుకలం నరేన్ (ఎమ్మెల్యే గురుమూర్తి), పూజా రామచంద్రన్ (అను), ప్రేమ (డాక్టర్ కిరణ్మయి) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2023 నవంబర్ 17న థియేటర్లలో విడుదలైంది. 2024 ఫిబ్రవరి 28 నుంచి Aha లో తెలుగులో అందుబాటులో ఉంది. 2 గంటల 10 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా IMDbలో 6.1/10 రేటింగ్ పొందింది.

Read Also : తెగిపడే అమ్మాయిల తలలు…. అత్యంత దారుణంగా నరికి చంపే సీరియల్ కిల్లర్… ఇంటెన్స్ మిస్టరీ థ్రిల్లర్

Related News

OTT Movie : డబ్బు కోసం అబ్బాయితో ఆ ఆట… ఫ్యామిలీ మొత్తాన్ని టార్గెట్ చేసే ఖతర్నాక్ కిలాడీ… ఊహించని క్లైమాక్స్

kantara Chapter 1 OTT: భారీ డీల్ కుదుర్చుకున్న కాంతార 2.. ఎన్ని కోట్లో తెలుసా?

OTT Movie : శవాన్ని దాచడానికి మాస్టర్ ప్లాన్… చెఫ్‌తో పెట్టుకుంటే ఇదే గతి… గ్రిప్పింగ్ కన్నడ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : పని మనిషితో యజమాని యవ్వారం… ఇంటి పని కోసం పిలిచి ఇదేం పని సామీ… క్లైమాక్స్ ట్విస్ట్‌కు ఫ్యూజులు అవుట్

OTT Movie : ఇంట్లో ఎవరూ లేని టైంలో బాయ్ ఫ్రెండ్‌తో… తల్లి చెప్పిందేంటి, ఈ పాపా చేస్తుందేంటి మావా ?

Big Stories

×