Big TV Kissik Talks show: బిగ్ టివి (Big Tv)నిర్వహిస్తున్న కిసిక్ టాక్స్(Kissik Talks) కార్యక్రమం ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుని జబర్దస్త్ వర్ష (Varsha)యాంకర్ గా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమం ప్రతి శనివారం ప్రసారం కాబోతోంది. ఇక ప్రతివారం పెద్ద ఎత్తున బుల్లితెర నటీనటులు సినీ సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. తాజాగా ఈ కార్యక్రమానికి బిగ్ బాస్ బ్యూటీ శుభశ్రీ రాయగురు(Subha Sree Rayaguru) హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా వర్ష శుభశ్రీ మధ్య ఎన్నో విషయాల గురించి చర్చలు జరిగాయి. శుభశ్రీ ఇటీవల నిశ్చితార్థం (Engagment) చేసుకోవడంతో పెద్ద ఎత్తున ఈమె నిశ్చితార్థం గురించి సోషల్ మీడియాలో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఎవరిని పెళ్లి చేసుకోవాలో చెప్పడానికి వీరెవరు?
ఇలా తనపై వచ్చిన ట్రోల్స్ గురించి వర్ష ప్రశ్నించారు. ఇటీవల అజయ్ మైసూర్(Ajay Mysore) తో నిశ్చితార్థం జరిగింది. నిశ్చితార్థం తర్వాత మీ ఇద్దరి గురించి ఎన్నో విమర్శలు వచ్చాయి ఆ ట్రోల్స్ నువ్వు చూసావా? అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు శుభశ్రీ సమాధానం చెబుతూ వాటిని చూసి నాకు కన్నీళ్లు ఆగలేదని ,రెండు రోజులు జ్వరం కూడా వచ్చిందని తెలిపారు. చాలామంది అతను నల్లగా ఉన్నాడు, డబ్బు కోసమే పెళ్లి చేసుకుంటున్నాను అంటూ కామెంట్లు చేశారు. అయినా నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలి , ఎలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలో చెప్పడానికి మీరెవరు? అంటూ శుభశ్రీ ఫైర్ అయ్యారు.
నేను సంపాదించా…
తాను అజయ్ ని పెళ్లి చేసుకుంటుంది తన డబ్బు చూసి కాదని, తన మంచితనం చూసి పెళ్లి చేసుకుంటున్నానని తెలిపారు. అతనితో కలిసి వన్ వీక్ జర్నీ చేసిన తర్వాత అతని ఆటిట్యూడ్, నాకు ఇచ్చిన రెస్పెక్ట్ చాలా బాగా నచ్చాయి. అతను నాకు సరైన వ్యక్తి అనిపించింది అందుకే మరొక అడుగు ముందుకు వేశామని శుభశ్రీ తెలిపారు . కేవలం నేను డబ్బు కోసమే పెళ్లి చేసుకుంటున్నానని మీరు ఎలా జడ్జ్ చేయగలరు. డబ్బు కోసమే పెళ్లి చేసుకోవడం అయితే నా దగ్గర కూడా చాలా డబ్బులు ఉన్నాయని, నాకంటూ సొంత ఇల్లు, కార్లు, నేను లగ్జరీ లైఫ్ గడపడానికి కావాల్సినంత డబ్బు ఉందని కొంతపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎప్పుడైనా ఒక వ్యక్తి గురించి ఏదైనా మాట్లాడే ముందు వారికి కొన్ని ఎమోషన్స్ ఉంటాయి, వారికి ఫ్యామిలీ ఉంటుందనే విషయాలను గుర్తు చేసుకొని మరి కామెంట్లు చేయాలి అంటూ ఈ సందర్భంగా ట్రోలర్స్(Trollers) ఉద్దేశించి మాట్లాడారు. అజయ్ గురించి దారుణంగా బాడీ షేమింగ్ కామెంట్స్ చేశారని తెలిపారు. అతను మంచి ఫుడీ అందుకే కాస్త లావుగా ఉన్నారు, ఆ విషయాన్ని కూడా విమర్శించారని తెలిపారు. మా ఇద్దరి ఎంగేజ్మెంట్ గురించి వచ్చిన కామెంట్లు చూసేసరికి తాను ఏదైనా తప్పు చేస్తున్నానా? నేను తీసుకున్న నిర్ణయం సరైనది కాదా? అనే భావన కూడా నాలో కలిగింది అంటూ ఈమె ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: Big TV Kissik Talks Show : పెళ్లికి ముందే కండీషన్లు.. సినిమాలకు శుభశ్రీ గుడ్ బై?