Bigg Boss Shoel: బుల్లితెర టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ ద్వారా చాలామంది సెలబ్రిటీలు అయిపోయారు. ఎంతోమంది వరుస అవకాశాలను అందుకుంటూ అటు సినిమాల్లోనూ ఇటు సీరియస్లలోనూ బిజీగా గడుపుతున్నారు. అలాంటి వారిలో సయ్యద్ సోహెల్ ఒకరు. ఈయన హీరోగా వెండితెరపైన, సీరియల్స్ లో నటించి తెలుగు ఆడియెన్స్ కు ఎంతగానో దగ్గరయ్యాడు.. సోషల్ మీడియాలో సోహెల్ చాలా యాక్టివ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే. తన గురించి ప్రతి విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంటూ ఫాలోవర్స్ ని పెంచుకుంటున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈయన లైంగిక వేధింపులకు గురైనట్లు షాకింగ్ న్యూస్ ని బయటపెట్టారు. ఒక అమ్మాయి తనని ఇబ్బంది పెట్టడం వల్ల ఆ అమ్మాయిపై పోలీస్ కేసు పెట్టిన తర్వాత తనకు విముక్తి కలిగిందని సో హెల్ సోషల్ మీడియా ద్వారా బయటపెట్టారు.
బిగ్ బాస్ తర్వాత అమ్మాయి వేధింపులు..
బిగ్ బాస్ లో తన యాటిట్యూడ్ తో ఆటతీరుతో ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు.. ఇతని ఫైర్ ని చూసి అందరూ ఇతని విన్నర్ అవుతారని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. బుల్లితెర ప్రేక్షకులను మరింతగా అలరించారు. అయితే హౌజ్ నుంచి వచ్చిన తర్వాత లక్కీ భాస్కర్ సినిమా చేశారంట. ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు తన నెంబర్ ను గత ఇంటర్వ్యూలో బయట పెట్టారని సోహైల్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.. ఆ తర్వాత ఆ అమ్మాయి నెంబర్తీసుకొని నాకు రోజు మెసేజ్లు ఫోన్లు చేసేది.. అంతేకాకుండా నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి నన్ను ఇబ్బంది పెట్టేది. అంతటితో ఆగలేదు. ముద్దులు, కిస్సులు అడుగుతూ చాలా ఇబ్బంది పెట్టిందని చెప్పాడు. ప్రతి రోజూ ఆమెతో టార్చర్ అనుభవించలేక పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు. దాంతో ఆమె నుంచి విముక్తి కలిగిందన్నారు. అమ్మాయిలకి కాదు అబ్బాయిలు కూడా ఇలాంటి ఇబ్బందులు తప్పవని సోహెల్ అంటున్నారు.
Also Read :రెడీ పెళ్లికి రెడీ అవుతున్న బుల్లితెర నటి.. ఇదిగో క్లారిటీ ఇచ్చేసిందిగా..!
సోహెల్ నటించిన సినిమాలు..
బిగ్ బాస్ కి రాకముందు సోహెల్ పలు చిత్రాల్లో చిన్న పాత్రలు చేసి ప్రేక్షకుల మనసు దోచుకున్నారు.. కొన్నాళ్ల పాటు సపోర్టింగ్ రోల్స్ లో నటిస్తూ వచ్చారు. తొలుత కొత్త బంగారు లోకంతో వెండితెరపై మెరిశారు. ఆ తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అంతకు ముందు ఆ తర్వాత, వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. బిగ్ బాస్ తర్వాత ఆయనే స్వయంగా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. 2013లో మ్యూజిక్ మ్యాజిక్ అనే చిత్రంతో హీరోగా లాంచ్ అయ్యారు. ఆ చిత్రం తర్వాత డీ ఫర్ దోపిడీ, ది బెల్స్, సిని మహాల్, యురేక, లక్కీ లక్ష్మణ్, ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు, మిస్టర్ ప్రెగ్నెంట్, చివరిగా బూట్ కట్ బాల్రాజు వంటి సినిమాలు చేశారు. అయితే ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేసినా కూడా ఇతని ఖాతాలో సాలిడ్ మాత్రం పడలేదు. కర్మన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం ఈ షూటింగ్ డ్రెస్ లోనే ఉంది. కనీసం ఏ మూవీ అయినా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందేమో చూడాలి..