BigTV English

OTT Movie : భర్త చనిపోవడంతో మరో మగాడితో…. పెళ్ళైన వాడితో ఇవేం పాడు పనులు…. క్లైమాక్స్ ట్విస్ట్ డోంట్ మిస్

OTT Movie : భర్త చనిపోవడంతో మరో మగాడితో…. పెళ్ళైన వాడితో ఇవేం పాడు పనులు…. క్లైమాక్స్ ట్విస్ట్ డోంట్ మిస్

OTT Movie : కొన్ని సినిమాలు సింపుల్ స్టోరీతో తెరకెక్కినప్పటికీ, మనల్ని ఆలోచనలో పడేస్తాయి. అలాంటి ఓ సినిమా ఏకంగా పలు అవార్డులను కొల్లగొట్టి, టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. ఆ మూవీనే ఈరోజు మన మూవీ సజెషన్. మరి ఈ మూవీ పేరేంటి? ఏ ఓటీటీలో అందుబాటులో ఉంది? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.


రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్

ఈ మూవీ పేరు “నాతిచరామి” (Nathicharami). 2018లో విడుదలైన ఈ కన్నడ క్రైమ్ డ్రామాకు మన్సోర్ (మంజునాథ సోమశేఖర రెడ్డి) దర్శకత్వం వహించారు. సంధ్యా రాణి రచించారు. ఈ చిత్రం థియేట్రికల్ రిలీజ్ తరువాత నెట్‌ఫ్లిక్స్ (Netflix), అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులోకి వచ్చింది. బెంగళూరు నేపథ్యంలో సాగే ఈ సినిమా, ఒక యువ వితంతువు శారీరక, భావోద్వేగ అవసరాల మధ్య సంఘర్షణ, సమాజంలో మహిళల కోరికలపై ఉన్న నిషేధాలు, ఆమె వ్యక్తిగత స్వేచ్ఛ కోసం పోరాటం వంటి అంశాలు ప్రధానంగా తెరకెక్కింది. శృతి హరిహరన్, సంచారి విజయ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో శరణ్య (సుమ), పూర్ణచంద్ర మైసూర్ (మహేష్), బాలాజీ మనోహర్ (డాక్టర్ కార్వాల్హో), గోపాల్ దేశ్‌పాండే (రవి), గ్రీష్మ శ్రీధర్, హర్షిల్ కౌషిక్ కీలక పాత్రలు పోషించారు.


ఈ మూవీ 66వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఐదు అవార్డులను గెలుచుకుంది. అందులో ఉత్తమ సహాయ నటి (శృతి హరిహరన్), ఉత్తమ గాయని, ఉత్తమ సాహిత్యం, ఉత్తమ ఎడిటింగ్, ఉత్తమ కన్నడ చిత్రం కేటగిరీలలో అవార్డులు దక్కించుకుంది. అలాగే ఈ సినిమా 20వ జియో మామి ముంబై ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఇండియా స్టోరీ విభాగంలో ప్రీమియర్ అయి, ఆక్స్‌ఫామ్ ఉత్తమ లింగ సమానత్వ చిత్ర అవార్డుకు నామినేట్ అయింది.

కథలోకి వెళ్తే…

కథ గౌరి (శృతి హరిహరన్) అనే యువ వితంతువు చుట్టూ తిరుగుతుంది. ఆమె తన భర్త మహేష్ (పూర్ణచంద్ర మైసూర్)ను ఒక ప్రమాదంలో కోల్పోయిన తర్వాత బెంగళూరులో ఒంటరిగా జీవిస్తుంది. గౌరి ఒక సక్సెస్ ఫుల్ ఐటీ ప్రొఫెషనల్, కానీ ఆమె జీవితం తన భర్త జ్ఞాపకాల చుట్టూ తిరుగుతుంది. ఆమె అతను ఇష్టపడే విధంగా సోఫా కుషన్‌లు, వార్తాపత్రికలు, ఇంటి అలంకరణను అమరుస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆమె తల్లిదండ్రులు ఆమెను మళ్లీ వివాహం చేసుకోమని ఒత్తిడి చేస్తారు.

కానీ గౌరి తన స్వేచ్ఛ, గుర్తింపును కోరుకుంటుంది. ఒక స్నేహితురాలి సలహాతో, ఆమె డాక్టర్ కార్వాల్హో (బాలాజీ మనోహర్) అనే సైకియాట్రిస్ట్‌ను సంప్రదిస్తుంది. ఆయన ఆ కోరికలను మానవ అవసరంగా గుర్తించమని సూచిస్తాడు. ఈ సలహాతో గౌరి తన శారీరక అవసరాలను నెరవేర్చడానికి, వివాహ బంధం లేకుండా ఒక సంబంధాన్ని కోరుకుంటుంది. ఇంకేముంది నెక్స్ట్ సురేష్ (సంచారి విజయ్) అనే వివాహితుడిని కలుస్తుంది. అతను తన భార్య సుమ (శరణ్య)తో అసంతృప్తితో ఉంటాడు. వీరిద్దరి మధ్య స్నేహంగా మొదలైన సంబంధం క్రమంగా సాన్నిహిత్యాన్ని దారి తీస్తుంది. గౌరి కోరికలు, సురేష్ వైవాహిక జీవితంలోని సమస్యలు ఘర్షణకు దారితీస్తాయి.

క్లైమాక్స్‌లో గౌరి తన అంతర్గత సంఘర్షణను జయించినట్లు అనిపించినప్పటికీ, ఒక అనూహ్యమైన ట్విస్ట్ కథను మరో మలుపు తిప్పుతుంది. హీరోయిన్ నిర్ణయాలు ఎలాంటి పరిణామాలకు దారి తీశాయి? అసలు పెళ్ళైన వాడితో అలాంటి పాడు పనులకు ఎందుకు ఒప్పుకుంది? సురేష్ కు భార్యతో ఉన్న సమస్యలు ఏంటి? క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఏంటి? అనే విషయాలని సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : పెళ్ళైన టీచర్ తో ప్రేమ… చివర్లో బుర్రపాడు ట్విస్ట్… మెంటలెక్కించే తమిళ థ్రిల్లర్

Related News

OTT Movie : సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ లైఫ్ ఇంత దారుణంగా ఉంటుందా? ఒక్కో సీన్ కు మైండ్ బ్లాక్

OTT Movie : కిటికీలోంచి చూడకూడని సీన్ చూసి ప్రాణాల మీదకు తెచ్చుకునే కుర్రాడు… ప్రతీ సీన్ క్లైమాక్స్ లా ఉండే సర్వైవల్ థ్రిల్లర్

OTT Movie : రెంటుకొచ్చిన అమ్మాయితో రెచ్చిపోయే ఓనర్… అర్ధరాత్రి వింత శబ్దాలు… వణుకు పుట్టించే సైకో సీన్స్

OTT Movie : మగాళ్లను దారుణంగా చంపే లేడీ కిల్లర్… 20 ఏళ్ల తరువాత అచ్చం అదే రీతిలో హత్యలు… కిర్రాక్ కొరియన్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : పనమ్మాయితో యజమాని రాసలీలలు… భర్త ఉండగానే సీక్రెట్ రొమాన్స్… క్లైమాక్స్ లో బుర్రపాడు ట్విస్ట్

OTT Movie : 7 రోజులు ఏకాంతంగా… బిజినెస్ మ్యాన్ తో 20 ఏళ్ల అమ్మాయి బిగ్ డీల్… నెవర్ బిఫోర్ ఏరోటిక్ థ్రిల్లర్ మావా

Big Stories

×