Sandra Jaichandran : తెలుగు బుల్లితెర పై హీరోయిన్లు చాలా తక్కువగానే ఉన్నారు.అయితే ఉన్న కొద్ది మందిలో అందం, అభినయం రెండూ ఉన్న హీరోయిన్లలో శాండ్రా జైచంద్రన్ ఒకరు. ఇప్పటివరకూ దాదాపు 10కి పైగా సీరియల్స్‌లో నటించి ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఈమె కలవారి కోడలు డైలీ సీరియల్ తో బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత ఒక్కో సీరియల్ లో తన నటనతో ఆకట్టుకుంటుంది. సీరియల్స్ మాత్రమే కాదు సినిమాల్లో కూడా నటించి మెప్పించింది. శాండ్రా ఈ మధ్య తాను ప్రేమించిన వ్యక్తితో రిలేషన్లో ఉందని వార్తలు వినిపించాయి. అయితే ఆ వార్తలను నిజం చేస్తూ పెళ్లికి సిద్దమైంది. ఇంతకీ ఆయన ఎవరు? బ్యాగ్రౌండ్ ఏంటో చూద్దాం..
ప్రియుడి ఫోటోను షేర్ చేసిన నటి..
తాజాగా శాండ్రా తన ఫ్యాన్స్‌కి ఓ గుడ్‌న్యూస్ చెప్పింది. తన ప్రియుడి ఫొటోని షేర్ చేస్తూ తమ లవ్ గురించి అందరికీ చెప్పింది. నీకోసం నేను వెతక్కుండానే నాకు నువ్వు దొరికావు.. నువ్వు నా అద్భుతం” అంటూ క్యాప్షన్ ఇచ్చింది శాండ్రా. కింద బ్లెస్‌డ్ అంటూ హ్యాష్ ట్యాగ్ ఇచ్చింది. ఇక ఈ పోస్ట్ చూసి సీరియల్ యాక్టర్స్ అందరు కంగ్రాట్స్ చెబుతున్నారు. అయితే అదే నిజం అని అందరు నమ్ముతున్నారు. ఇంతకీ శాండ్రా కట్టుకోబోయేవాడు మరెవరో కాదు బుల్లితెర మహేష్ బాబు. అవును అతని పేరు మహేష్ బాబు కాళిదాసు.. ఈయన కూడా బుల్లితెర హీరోనే.. పలు తెలుగు సీరియల్స్ లలో హీరోగా నటించారు.
ఈయన బ్యాగ్రౌండ్?
మనసిచ్చి చూడు, శుభస్య శీఘ్రం లాంటి సీరియల్స్‌లో మెయిన్ లీడ్‌గా చేశాడు. వీళ్లిద్దరూ శుభస్య శీఘ్రం సెట్‌లోనే ప్రేమలో పడ్డట్లు తెలుస్తోంది.ఈ డైలీ సీరియల్స్ ద్వారా వీరిద్దరికీ పరిచయం అయ్యింది. అది కాస్త ప్రేమగా మారింది. ఓ యూట్యూబ్ ఛానల్ కూడా మొదలుపెట్టారు. ఇందులో రెగ్యులర్‌గా వీడియోలు కూడా పోస్ట్ చేస్తున్నారు. దీంతో వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నట్లు ఆడియన్స్ ఎప్పటినుంచో అనుకుంటున్నారు. మొత్తానికి అనౌన్స్ చేసేంది..
Also Read : శనివారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్..
శాండ్రా కు రెండో పెళ్లి..
బుల్లితెర నటి సాండ్రా గతంలో ఒక పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా 19 ఏళ్లకే ఆమె పెళ్లి చేసుకుంది. అయితే చేసుకున్నవాడు తనతో పాటు మరో అమ్మాయితో కూడా రిలేషన్‌లో ఉన్నట్లు తెలిసి విడాకులు ఇచ్చేసింది శాండ్రా. ఆ తర్వాత చాలా ఏళ్ల పాటు డిప్రెషన్‌లో కూడా ఉంది.. ఈ విషయాన్ని ఇంటర్వ్యూలో కూడా ఆమె బయట పెట్టింది.. ఎన్నో బాధలు అనుభవించానని ఆ తర్వాత వాటి నుంచి విముక్తి తీసుకున్నానని ఆమె స్వయంగా చెప్పింది. అయితే చాలా కాలం తర్వాత మళ్లీ సీరియల్స్ అలో బిజీగా మారింది.. ఇప్పుడు రెండో పెళ్లి చేసుకొని మళ్లీ సంతోషంగా జీవితాన్ని మొదలుపెట్టబోతుంది. మొత్తానికి వీరిద్దరి పెళ్లి వార్త విన్న అభిమానులు, సీరియల్ యాక్టర్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.