Soniya Akula : బిగ్ బాస్ ఫేమ్ సోనియా ఆకుల గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. బిగ్ బాస్ సీజన్ 8 పాల్గొని ఫైర్ బ్రాండ్ అనే ట్యాగ్ ను అందుకుంది. అయిందానికి కానీ దానికి గొడవ పడుతూ యూత్ కు చిరాకు తెప్పించింది. బిగ్ బాస్ ఆడియన్స్ కు కోపం తెప్పించింది. దాంతో నాలుగు వారాలకే పాపను తమ ఓట్లతో ఎలిమినేట్ చేశారు. ఇక బయటకు వచ్చిన తర్వాత కూడా పాప నోటికి బ్రేకులు పడలేదు. బిగ్ బాస్ బజ్ కు వచ్చింది.. అక్కడ నాగార్జున నన్ను మోసం చేశాడు. నా పై తప్పుడూ ప్రచారం చేశారని, నన్ను హౌస్ లో బ్యాడ్ గా చూపించారని మండిపడింది.. ఇక రీసెంట్ గా తాను ప్రేమించిన ప్రియుడితోనే మూడు ముళ్ళు వేయించుకుంది. అయితే తాజాగా ఈమె అగ్రిమెంట్ తో పెళ్లి చేసుకుందనే వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అసలు విషయం ఏంటో ఒకసారి తెలుసుకుందాం..
బిగ్ బాస్ ఫెమ్ సోనియా ఎలిమినేట్ ఐపోగానే తాను ప్రేమించిన యష్ ని పెళ్లి చేసుకుంది.. అలాగే పెళ్లి చేసుకున్న సాయంత్రానికే ఇష్మార్ట్ జోడి 3 లోకి వచ్చేసారు. హైదరాబాద్ వేదికగా జరిగిన సోనియా వివాహానికి పలువురు బుల్లితెర ప్రముఖులు, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. సోనియా పెళ్లి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఆమె పెళ్లికి చిన్నోడు వచ్చాడు. కానీ పెద్దోడు రాలేదు. ఆ విషయం పై అనేక వార్తలు వినిపించాయి. సోషల్ మీడియాలో నెటిజన్స్ మాత్రం ఓ రేంజులో ఆడేసుకున్నారు. ఇండైరెక్ట్ గా పెద్దోడికి ఏదోకటి ఇవ్వలేదేమో అంటూ కామెంట్ల వర్షం కురిపించారు.
ఇదిలా ఉండగా.. తాజాగా ఈ అమ్మడు గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి చక్కర్లు కొడుతుంది. ఇచ్చాడు యష్ అని అయితే ఈ విషయం మీద ఈ భార్యా భర్తలు ఇద్దరూ కూడా స్పందించారు. యష్ విడాకులు తీసుకోవడానికి కారణం సోనియా అనే వార్తలు వినిపించాయి. కానీ అందులో నిజం లేదు. మా ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతోనే విడాకులు తీసుకున్నాం. అంతకు మించి లేదు అని క్లారిటీ ఇచ్చాడు. ఆ తర్వాత ఈవెంట్స్ చేసాము.. మా మధ్య ఫ్రెండ్ షిప్ కాస్త ప్రేమగా మారింది. ఇప్పుడు పెళ్లితో మమ్మల్ని ఇంకాస్త స్ట్రాంగ్ అయ్యేలా చేసిందని యష్ అన్నాడు. నా గురించి యష్ వాళ్ళ ఫామిలీ మొత్తానికి కూడా బాగా తెలుసు. నేను ఎవరితో ఎలా ఉంటాను. ఎవరిని ఎలా ట్రీట్ చేస్తానో కూడా బాగా తెలుసు. ఇక యష్ వాళ్ళ మేనత్తకి ఐతే నేను పవన్ కళ్యాణ్ లెక్కా. అంత ఇష్టం. అని చెప్పారు. కానీ తాజాగా వీరిద్దరిది అగ్రిమెంట్ పెళ్లి అని ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఆ అగ్రిమెంట్ పూర్తి అయితే విడాకులు తీసుకుంటారా? లేదా అగ్రిమెంట్ ను క్యాన్సిల్ చేస్తారా? అన్న దాని పై సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అందులో నిజమేంత ఉందో తెలియాలంటే సోనియా క్లారిటీ ఇవ్వాల్సిందే.. ఇక డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కథ అందించిన కరోనా వైరస్ మూవీలో నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ కూతురు శాంతి పాత్రలో సోనియా ఆకుల నటించింది..