హిందూ పురాణాల్లో ఎంతోమంది దేవతలు ఉన్నారు. ముల్లోకాల్లో ఉన్న దేవతలను లెక్కపెడితే మూడు కోట్లకు పైగా ఉంటారని చెప్పుకుంటారు. హిందూ పురాణాల్లో ఎంతోమంది దేవతలు ప్రత్యేక లక్షణాలను, బాధ్యతలను కలిగి ఉంటారు. వారిలో ముఖ్యమైన వారు త్రిమూర్తులు. సృష్టికర్త అయిన బ్రహ్మ, విశ్వసంరక్షకుడైన విష్ణువు, చెడును విధ్వంసం చేసే శివుడు… వీరి ముగ్గురిని ప్రత్యేకంగా చెప్పుకుంటారు. అయితే వీరిలో విష్ణువు, శివుడే నిత్యం పూజలు అంటుకుంటారు. త్రిమూర్తుల్లో మొదటి వాడైనా బ్రహ్మ మాత్రం పూజలు పెద్దగా అందుకోడు. మనదేశంలో బ్రహ్మను పూజించే గుడిలో చాలా అరుదుగా కనిపిస్తాయి. హిందూమతంలో అతి తక్కువగా ఆరాధించే దేవతగా బ్రహ్మాను ఇస్తాడు. సృష్టికర్త అయిన బ్రహ్మను అంత అరుదుగా పూజించడానికి, ఎవరూ పెద్దగా పట్టించుకో పోవడానికి కారణం ఏంటి?
ఈ విశ్వాన్ని ఉనికిలోకి తీసుకువచ్చి జీవాన్ని సృష్టించిన దేవుడు బ్రహ్మ. అతడి పని సృష్టి చేయడమే. జ్ఞాన దేవత అయిన సరస్వతితో కలిసి బ్రహ్మ జీవిస్తాడు. అతను నాలుగు తలలు నాలుగు వేదాలను సూచిస్తాయి. ఆయన నాలుగు తలలు సృష్టిలోని నాలుగు దిశలను చూడగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. సృష్టిలో అతడి పాత్ర ఎంతో కీలకమైనది. అయితే బ్రహ్మకు ఎక్కడా పెద్దగా ఆలయాలు కనిపించవు. పూజలు ఉండవు. నిత్యం తలుచుకునే భక్తులు కూడా ఉండరు. ఇంతగా బ్రహ్మను పక్కన పెట్టడానికి కారణం ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
పురాణ కథ ఇదే
శివ పురాణం ప్రకారం బ్రహ్మ ఎందుకు పూజలను అందుకోడో కొంతవరకు తెలుస్తుంది. బ్రహ్మ, విష్ణువు ఒకప్పుడు తాను గొప్ప అంటే తాను గొప్ప అని వాదించుకున్నారు. ఆ వివాదాన్ని పరిష్కరించడానికి శివుడు సరైన వ్యక్తిలా వారికి కనిపించాడు. వెంటనే శివుడు ఒక కాంతి స్తంభంలా మారాడు. కాంతి స్తంభం చివర్లను గుర్తించమని ఆయన సవాలు చేశాడు. విష్ణువు నిజాయితీ కనిపెట్టలేనని ఒప్పుకున్నాడు. కానీ బ్రహ్మ కనిపెడతానని అబద్ధం చెప్పాడు. స్థంబం పైభాగాన్ని కనుగొన్నానని అబద్ధం చెప్పి శివుని కోపానికి గురయ్యాడు. ఆ సమయంలో శివుడు ‘నువ్వు ఎవరి చేత పూజలు అందుకోవు’ అంటూ శపించాడు. ఆ శాపం ఫలితంగానే బ్రహ్మ ఎవరి నుంచి పూజలు అందుకోని పరిస్థితికి వచ్చినట్టు చెప్పుకుంటారు.
శివుడి శాపమే కాదు, భృగు మహర్షి శాపం కూడా బ్రహ్మదేవునికి తగిలిందని చెబుతారు. భృగు మహర్షి వచ్చినప్పుడు బ్రహ్మ సరైనా గౌరవాన్ని ఇవ్వలేదని అతడు బాధపడతాడు. ఆ కోపంలో భృగు మహర్షి బ్రహ్మను శపిస్తాడు. ఇకపై భూమిపై ఉన్న జనులు ఎవరూ నిన్ను పూజించరని అంటాడు. ఆనాటి నుంచి బ్రహ్మకు పూజలు కరువైపోయాయి.
ఐదు తలల బ్రహ్మ
అయితే మరొక కథనం ప్రకారం బ్రహ్మకు ఐదు తలలు ఉండేవట. బ్రహ్మ తన సృష్టించిన శతరూప అనే అమ్మాయిపై మోహాన్ని పెంచుకున్నాడట. ఆమె ఎక్కడకు వెళ్లినా వెనకే వెళ్లడం ప్రారంభించాడట. అతని పనులు చూసిన శివుడు కోపంతో బ్రహ్మ ఐదవ తలను నరికి వేసాడట. దీంతో అతని స్థాయి చాలా వరకు తగ్గిపోయిందని, అప్పటి నుంచి బ్రహ్మను పూజించడం అందరూ మానేశారని చెప్పుకుంటారు.
ఇలాంటి కథనాలు ఎన్నో వాడుకలు ఉన్నాయి. నిజానికి మిగతా దేవత దేవతలతో పోలిస్తే బ్రహ్మకు ఆలయాలు కూడా పెద్దగా కనిపించవు. రాజస్థాన్లోని పుష్కర్ లో బ్రహ్మ దేవాలయం కనిపిస్తుంది. అదొక ప్రముఖ పుణ్యక్షేత్రంగా చెప్పుకుంటారు. అంతే తప్ప పెద్దగా బ్రహ్మను పూజించే ప్రదేశాలు మనకు ఎక్కడా కనిపించవు.