Neeraj Chopra’s Wife: రెండుసార్లు ఒలంపిక్ పతక విజేత, భారత స్టార్ ఆటగాడు, స్టార్ జావెలెన్ త్రోయర్ నీరజ్ చోప్రా వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. ఈ విషయాన్ని నీరజ్ చోప్రా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. తన సోషల్ మీడియా అధికారిక ఎక్స్ (ట్విట్టర్) హ్యాండిల్, ఇంస్టాగ్రామ్ లో చాలా వివాహ ఫోటోలను పంచుకున్నాడు. అతడు చాలా సింపుల్ గా సాంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నట్లుగా ఈ ఫోటోలు చూస్తే అర్థమవుతుంది. దీంతో నీరజ్ చోప్రా పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Also Read: WV Raman: నరకంలో ఆ మాజీ క్రికెటర్..చనిపోయి, మళ్లీ బతికానంటూ పోస్ట్ !
హిమాని అనే యువతిని వివాహం చేసుకున్నాడు నీరజ్. ” నా కుటుంబంతో జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాను. ఈ క్షణంలో మమ్మల్ని ఒకచోట చేర్చిన ప్రతి ఆశీర్వాదానికి చాలా కృతజ్ఞతలు” అని తెలియజేశాడు. దీంతోపాటు నీరజ్ లవ్స్ హిమాని అని పోస్ట్ లో పేర్కొన్నాడు. వీరి వివాహానికి ఇరు కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఎలాంటి ఎంగేజ్మెంట్, పెళ్లి కబురు చెప్పకుండానే ఆకస్మాత్తుగా తన పెళ్లి వార్తని చెప్పి అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశాడు నీరజ్.
దీంతో నీరజ్ పెళ్లి చేసుకున్నాడనే వార్త తెలిసిన అభిమానులు ఈ కొత్త జంటకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అలాగే నీరజ్ పెళ్లి చేసుకున్న హిమాని ఎవరు..? ఆమె ఏం చేస్తుండేది..? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి..? అని తెలుసుకునేందుకు నెటిజెన్లు ప్రయత్నిస్తున్నారు. అయితే నీరజ్ భార్య హిమాని మోర్ హర్యానాలోని సోనిపట్ ప్రాంతానికి చెందినవారు. ఆమె ప్రస్తుతం అమెరికాలో విద్యనభ్యసిస్తోంది.
రెండు రోజుల క్రితమే నీరజ్ – హిమనీల వివాహం జరగగా.. ఈ కొత్తజంట ప్రస్తుతం హనీమూన్ కోసం విదేశాలకు వెళ్లినట్లు సమాచారం. హిమాని ఓ టెన్నిస్ క్రీడాకారిణి. ఆమె హర్యానాలోని లార్సౌలీ ప్రాంతానికి చెందిన యువతి. హిమాని పానిపట్ లోని లిటిల్ ఏంజెల్స్ స్కూల్ లో పాఠశాల విద్యను అభ్యసించింది. అలాగే ఢిల్లీ యూనివర్సిటీలో మీరాండా హౌస్ నుంచి పొలిటికల్ సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ లో బ్యాచిలర్ డిగ్రీ పట్టా పొందింది.
Also Read: Neeraj Chopra Marraige: మను భాకర్ కు షాక్.. పెళ్లి చేసుకున్న నీరజ్ చోప్రా !
ప్రస్తుతం అమెరికాలో క్రీడలకు సంబంధించిన విద్యను అభ్యసిస్తోంది. స్పోర్ట్స్ మేనేజ్మెంట్, అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్స్ ఇన్ సైన్స్ చేస్తోంది. అలాగే గ్రాడ్యుయేట్ అసిస్టెంట్ గా పనిచేసిన కాలేజీలోనే టెన్నిస్ టీమ్ ను మేనేజ్ చేస్తుంది. ఇక నీరజ్ విషయానికి వస్తే.. 27 ఏళ్ల నీరజ్ జాగరింగ్ త్రో ఈవెంట్ లో బంగారు పతకం సాధించగా.. పారిస్ ఒలంపిక్స్ లో రజత పథకాన్ని గెలుచుకున్నాడు. టోక్యో ఒలంపిక్స్ లో నీరజ్ 87.58 మీటర్లు విసిరి స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించాడు.
जीवन के नए अध्याय की शुरुआत अपने परिवार के साथ की। 🙏
Grateful for every blessing that brought us to this moment together. Bound by love, happily ever after.
नीरज ♥️ हिमानी pic.twitter.com/OU9RM5w2o8
— Neeraj Chopra (@Neeraj_chopra1) January 19, 2025