BB Telugu 8 Promo: తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న బిగ్ బాస్ 8వ సీజన్ చివరి దశకు చేరుకోబోతోంది. నెల రోజుల్లో ఈ షో కాస్త పూర్తి కాబోతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే 11వ వారానికి సంబంధించి ఫ్యామిలీ వీక్ పూర్తి చేశారు. కంటెస్టెంట్స్ కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ హౌస్ లోకి వచ్చి కంటెస్టెంట్స్ లో జోష్ నింపారు. అయితే ఆ జోష్ ను రెట్టింపు చేస్తూ.. సెలబ్రిటీలను కూడా కంటెస్టెంట్స్ కి మద్దతుగా తీసుకురావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా తమ అభిమాన సెలబ్రిటీలు తమ కోసం స్టాండ్ తీసుకోవడంతో కంటెస్టెంట్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా 11వ వారానికి సంబంధించి వీకెండ్స్ మొదలయ్యాయి. 75వ రోజుకు సంబంధించి తాజా ప్రోమోని కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. ఈ ప్రోమోలో మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్, ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్స్ కోసం విచ్చేశారు. ప్రోమో లో ఏముందనే విషయానికి వస్తే.. హోస్ట్ నాగార్జున మాట్లాడుతూ..” ఈవారం మొత్తం మీ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు.. మీలో ఎనర్జీ బాగా కనిపిస్తోంది. అయితే మీ ఎనర్జీని రెట్టింపు చేయడానికి మీకు సర్ప్రైజ్ అంటూ కంటెస్టెంట్స్ తో తెలిపారు నాగార్జున. మొదట ప్రేరణ కోసం ఆమె తల్లితోపాటు చెల్లి అలాగే బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ ప్రియా స్టేజ్ పైకి వచ్చారు. ఆ తర్వాత రవి, అనిత కూడా హౌస్ లోకి అడుగుపెట్టారు. రవిని చూడగానే సర్ప్రైజ్ అయిన విష్ణు ప్రియ.. హే రవి అంటూ అరిచింది. వెంటనే రవి ఎంతైనా మా యాంకర్ ఫ్యామిలీ కదా.. కానీ నువ్వు నా పేరు చెప్పకపోవడంతో నేను హర్ట్ అయ్యాను అంటూ తెలిపారు.
ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో టైటిల్ ఫేవరెట్ గా నిలిచి ఆ తర్వాత మూడవ స్థానంతో సరిపెట్టుకున్న రెబల్ యాక్టర్ శివాజీ స్టేజ్ పైకి వచ్చారు. ఇక ఈయన రోహిణికి మద్దతుగా స్టేజ్ పైకి రావడం జరిగింది. ఇకపోతే టేస్టీ తేజ హాయ్ అన్న అంటూ ఎన్నిసార్లు పలకరించినా కాసేపు టేస్టీ తేజను శివాజీ ఆటపట్టించారు. అన్న నేను.. అన్న తేజాని అంటే.. పోరా ఎవరు నీకు అన్న అంటూ కామెంట్ చేశారు శివాజీ. ఇక తర్వాత ప్రేరణ.. మమ్మీ నాగార్జున గారి పక్క నిల్చున్నావు కదా.. ఎలా ఉంది అని అడగ్గా.. ఇంకా హగ్ చేసుకోలేదు అంటూ తెలిపింది ప్రేరణ తల్లి. ఆ తర్వాత నాగార్జున ఆమెకు ఒక హాగ్ ఇచ్చారు. ప్రేరణ సోదరీ కూడా హౌస్ లోకి అడుగుపెట్టి మీరందరూ అక్కకి చాలా టఫ్ ఫైట్ ఇస్తున్నారు అని కామెంట్ చేయడం.. వెంటనే రోహిణి మీ అక్కే అందరికీ టఫ్ ఫైట్ ఇస్తోంది అంటూ కామెంట్ చేసింది. ఇక తర్వాత ప్రేరణ సోదరీ “మిస్ ఇండియా తెలంగాణ” టైటిల్ గెలుచుకున్నట్లు తెలిపింది.
ఆ తర్వాత విష్ణుప్రియలో ఉన్న నిజాయితీని పొగుడుతూ రవి కామెంట్ చేశారు. అంతే కాదు శివాజీ విష్ణుప్రియ టైటిల్ విన్నర్ గెలవాలి అని చెప్పాడు. దీంతో శివాజీ లాంటి వ్యక్తి విష్ణు ప్రియ పేరు తీశాడు అంటే ఇక టైటిల్ విన్నర్ అయిపోతుంది అనడంలో సందేహం లేదంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.