BigTV English

Bigg Boss 8 Telugu Rules: ‘బిగ్ బాస్’ రూల్స్ మార్చేశారు గురూ, అవి లేకుండా ఎలా?

Bigg Boss 8 Telugu Rules: ‘బిగ్ బాస్’ రూల్స్ మార్చేశారు గురూ, అవి లేకుండా ఎలా?

Bigg Boss 8 Telugu Rules: ఎంతో మంది బుల్లితెర ప్రేక్షకులు ముక్త కంఠంగా ఎదురుచూసిన ‘బిగ్ బాస్ 8’ తెలుగు రియాలిటీ షో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. సెప్టెంబర్ 1న ఎవరూ ఊహించని రేంజ్‌లో స్టార్ట్ అయింది. దాదాపు 14 మంది కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అందులో యష్మి గౌడ (టీవీ సీరియల్ నటి), నిఖిల్ మలియక్కల్ (టీవీ సీరియల్ నటుడు), సోనియా ఆకుల (సినీ నటి), బెజవాడ బేబక్క (యూట్యూబర్), అభయ్ నవీన్ (సినీ నటుడు), ప్రేరణ (టీవీ సీరియల్ నటి), ఆదిత్య ఓం (సినీ నటుడు), ఆర్జే శేఖర్ బాషా (ఆర్జే), కిర్రాక్ సీత (సినీ నటి), నాగ మణికంఠ (టీవీ సీరియల్ నటుడు), పృథ్విరాజ్ (నటుడు), విష్ణుప్రియ భీమినేని (టీవీ యాంకర్), నైనిక డ్యాన్స్ (ఢీ ఫేమ్), నబీల్ ఆఫ్రిది (యూట్యూబర్) ఉన్నారు.


అయితే ఇందులో విచిత్రం ఏంటంటే.. ప్రతి సీజన్‌లోనూ ఒక్కొక్కరిని ఎంట్రీ చేసే బిగ్ బాస్ ఈసారి మాత్రం జంటలుగా తీసుకొచ్చాడు. ఒక్కో జంటను పరిచయం చేస్తూ సరికొత్త ఉత్సాహాన్ని ఆడియన్స్‌లో నింపాడు. ఇంకొన్ని వారాల తర్వాత వైల్డ్ కార్డు ద్వారా మరికొందరినీ ఎంట్రీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ముందుగా హూస్ట్ అక్కినేని నాగార్జున ఎంట్రీ అదిరిపోయిందనే చెప్పాలి. ఊరమాస్ లుక్‌లో గుబురు గుబురు గడ్డంతో కనిపించి అదరగొట్టేశాడు. అంతేకాదండోయ్.. ‘దేవర’లోని సాంగ్‌కు తనదైన స్టెప్పులతో ఉర్రూతలూగించాడు. లేడీ డ్యాన్సర్ల మధ్య మనసు దోచే మన్మధుడిలా తన క్లాసిక్ స్టెప్పులతో అదరహో అనిపించాడు.

అయితే వీటికంటే ముందు ఈ షో ఆరంభం అదిరిపోయింది. టాలీవుడ్ సినీ స్టార్లు ఎంట్రీలతో ఆడియన్స్‌లో ఉత్సాహాం రెట్టింపయింది. సరిపోదా శనివారం మూవీ ప్రమోషన్లలో భాగంగా నేచురల్ స్టార్ నాని, ప్రియాంక మోహనన్ ఇందులో పాల్గొన్నారు. అలా నాగ్ వీరిద్దరితో ముచ్చటించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. దాని తర్వాత 35 చిన్న కథ కాదు మూవీ ప్రమోషన్స్ కోసం రానా, నివేదా థామస్ ఎంట్రీ ఇచ్చారు. అలా ఈ రెండు సినిమాల ప్రమోషన్స్ కోసం వచ్చిన ఈ స్టార్లు బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చి కంటెస్టెంట్‌లతో ముచ్చటించారు.


Also Read: షాకింగ్.. ‘బిగ్ బాస్’ ప్రైజ్ మనీ ఇంతేనా? దిమ్మతిరిగే ట్విస్ట్

ఆ తర్వాత దర్శకుడు అనిల్ రావిపూడి ఎంట్రీ ఇచ్చాడు. ఇలా ఎంట్రీ ఇచ్చాడో లేదో అలా గుడ్ అండ్ బ్యాడ్ న్యూస్ చెప్పాడు. దాదాపు 10 వారాల వరకు బేబక్క ఉంటుందని సరదాగా చెప్పుకొచ్చాడు. అదే సమయంలో స్టార్టింగ్ రోజే ఎలిమినేషన్‌ కూడా ఉంటుందని చెప్పి షాక్ ఇచ్చాడు. అయితే అందులో భాగంగానే కంటెస్టెంట్‌లు అందరూ నాగమణిని ఎలిమినేట్ చేశారు. దీంతో ఆమె చాలా ఎమోషనల్ అయిపోయింది. ఆ తర్వాత వెంటనే ఇదంతా ప్రాంక్ అంటూ చెప్పుకొచ్చారు. ఇలా బిగ్ బాస్ ప్రారంభమైన రోజే ఇన్ని ట్విస్టులు ఇస్తూ ఆడియన్స్‌లో క్యూరియాసిటీ పెంచేశారు.

ఇదిలా ఉంటే ‘బిగ్ బాస్’ గురించి ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. కొత్తలో కాన్సెప్ట్‌లు వెరైటీగా అనిపించినా.. సీజన్స్ గడిచేకొద్ది పాతవైపోయాయి. దీంతో ప్రేక్షకులకు అన్నీ తెలిసిపోతున్నాయి. రొటీన్‌గా ఉండటంతో చూసేందుకు కూడా ఇష్టపడటం లేదు. అందుకే, తెలుగు బిగ్ బాస్‌ను లేపేందుకు గత సీజన్ నుంచే కొత్త కాన్సెప్ట్‌లను తెరపైకి తేవడం మొదలుపెట్టారు. ఏడో సీజన్‌లో ‘ఉల్టా పుల్టా’ కింద.. షోను కిచిడీ చేశారు. ప్రేక్షకులు గెస్ చేయకుండా.. కంటెస్టెంట్లు అంచనాలకు అందకుండా ఓ ఆట ఆడుకున్నాడు బిగ్ బాస్. ఇప్పుడు సీజన్ 8లో కూడా అలాగే చేయాలని డిసైడ్ అయ్యాడు. ఏకంగా ‘కెప్టెన్’ కాన్సెప్ట్‌నే తొలగించాడు.

ఔనండి.. ఈ సారి సీజన్‌లో కెప్టెన్ ఉండడట. అంతేకాదు.. హౌస్ మేట్స్‌కు రేషన్ కూడా ఇవ్వలేదు. చివరికి ఇమ్యునిటీ కూడా ఉండదంటూ హోస్ట్ నాగార్జున కంటెస్ట్‌లకు షాకిచ్చారు. గత సీజన్ల కంటే భిన్నంగా, ఎన్నడూ చూడని విధంగా ఈ కొత్త సీజన్ ఉండబోతుందని బిగ్ బాస్ కూడా తెలిపాడు. ఊహించని ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లతో ఉక్కిరిబిక్కిరి చేయనున్నట్లు బిగ్ బాస్ స్పష్టం చేశాడు. కాగా ఈ బిగ్‍బాస్ 8వ సీజన్‌ను ప్రముఖ టీవీ ఛానెల్ స్టార్ మా ఛానెల్‍లో వీక్షించవచ్చు. సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9 గంటలకు చూడవచ్చు. అలాగే శని, ఆదివారాల్లో రాత్రి 9.30 గంటలకు ప్రసారం అవుతుంది. అయితే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ డిస్నీ+ హాట్‍స్టార్‌లో 24 గంటలు స్ట్రీమింగ్ అవుతుంది.

Related News

Bigg Boss Telugu 9: సంజన సీక్రెట్ బయటపెట్టి షాకిచ్చిన మనీష్.. వరస్ట్ ప్లేయర్ శ్రీజ, ప్రియకు బిగ్ బాంబ్!

Bigg Boss Telugu 9 Day 13: సంజన, ఫ్లోరా గుట్టురట్టు చేసిన నాగార్జున.. ఆమె జైలుకి, హౌజ్ మేట్స్ కి బిగ్ ట్విస్ట్

Bigg Boss 9 Promo: తనూజా చేతే లవ్ సీక్రెట్ బయటపెట్టించిన నాగ్!

Bigg Boss 9 Telugu : మళ్లీ కెప్టెన్ అయ్యాడు.. ఆడియన్స్ కు బిగ్ బాస్ పిచ్చెక్కిస్తున్నాడే..

Bigg Boss 9: 2వారాలకు గానూ మర్యాద మనీష్ ఎంత సంపాదించారో తెలుసా?

Bigg Boss Telugu 9 day 13: తు.. తు.. నువ్వు ఆగమ్మా.. దమ్ము శ్రీజకి నాగ్ కౌంటర్, ప్రియకు ఝలక్.. ఓనర్స్ గా మారిన సెలబ్రిటీలు

Bigg Boss Telugu 9 Day 13: రీతూ బండారం బయపెట్టిన నాగ్.. భరణికి అన్యాయం, డిమోన్ కెప్టెన్సీ రద్దు..

Bigg Boss 9: ప్రియా శెట్టి పగిలిపోయే వార్నింగ్ ఇచ్చిన కింగ్, డిమాన్ పవన్ కెప్టెన్సీ రద్దు

Big Stories

×