E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu Day 66 : దివ్యకు రీతూ మాస్ వార్నింగ్… రాణితో ఇమ్మూ ఫ్లర్టింగ్ … బాహుబలి రేంజ్ పనిష్మెంట్ ఇచ్చిన కళ్యాణ్

Bigg Boss 9 Telugu Day 66 : దివ్యకు రీతూ మాస్ వార్నింగ్… రాణితో ఇమ్మూ ఫ్లర్టింగ్ … బాహుబలి రేంజ్ పనిష్మెంట్ ఇచ్చిన కళ్యాణ్

Bigg Boss 9 Telugu Day 66 :బిగ్ బాస్ డే 66 ఎపిసోడ్ లో ఫుల్ ఫన్ మోడ్ లోకి మారిపోయింది హౌస్. రాజు రాణులైన కళ్యాణ్, రీతూ, దివ్య హౌస్ మేట్స్… ముఖ్యంగా సామాన్యులతో ఓ ఆట ఆడుకున్నారు. అలాగే బిగ్ బాస్ రాజు లేదా రాణి హోదాను లాక్కునే ఛాన్స్ ను కూడా హౌస్ మేట్స్ కి ఇచ్చాడు. బిగ్ బాస్ హౌస్ లో ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగింది? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ఫన్ మోడ్ లో బిగ్ బాస్ హౌస్

రాణిగా ఉన్న రీతూ హౌస్ ను ఫన్ మోడ్ లోకి మార్చేసింది. తనకున్న రాణి పవర్ ను పర్ఫెక్ట్ గా వాడుకుని ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నిస్తోంది. ఈరోజు సుమన్ శెట్టితో ఆమె ఖర్భుజా పండు తినిపించుకోవడం, ఇమ్మూతో ఫ్లర్ట్ చేసి రాజు దగ్గర ఇరికించడం హైలెట్ గా నిలిచింది. సుమన్ శెట్టి హైట్ ను అడ్వాంటేజ్ గా తీసుకుని అతనికి అందకుండా ఉండడానికి చాలా ట్రై చేసింది రీతూ. అయితే సుమన్ ఏమాత్రం విసుగు చెందకుండా రీతూకి చిన్న పిల్లలా పండును తినిపించి, చివర్లో దిష్టి కూడా తీశాడు. మరోవైపు ఇమ్మూ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ ఫన్ క్రియేట్ చేసింది రీతూ. చివరికి రాజు దగ్గరకు తీసుకెళ్లి తనను అదోలా చూస్తున్నాడు అంటూ కంప్లైంట్ చేసింది. దానికి శిక్షగా బాహుబలి రేంజ్ లో రాజు కళ్యాణ్ కత్తితో ఇమ్మాన్యుయేల్ ను వేసేశాడు. అలాగే ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ లో పనిష్మెంట్ ఇచ్చారు కింగ్ అండ్ క్వీన్స్. సుమన్ శెట్టిని పిలిచినప్పుడల్లా వీణ స్టెప్ చిరునవ్వుతో వేయాలని ఆదేశించారు రాజు రాణులు. అలాగే భరణి, ఇమ్మాన్యుయేల్ కు కూడా చిరు సూపర్ హిట్ స్టెప్పులు నవ్వుతూ వేయాలని చెప్పారు.

నిలబెట్టు పడగొట్టు గెలుపొందు 

సామాన్య ప్రజలు కమండర్లుగా, కమాండర్లు సామాన్యులుగా మారడానికి ‘నిలబెట్టు పడగొట్టు గెలుపొందు’ అనే టాస్క్ పెట్టారు బిగ్ బాస్. అయితే ఈ టాస్క్ ప్రజలకు చివరి టాస్క్ కాగా, ఇందులో పాల్గొనడానికి ఇద్దరు కమాండర్లు, ఇద్దరు ప్రజలను సెలెక్ట్ చేసే బాధ్యతను రాజు రాణులకు అప్పగించారు బిగ్ బాస్. కమాండర్లు డెమోన్, నిఖిల్… ప్రజల నుంచి భరణి, గౌరవ్ ఈ టాస్క్ ఆడారు. అయితే ఇందులో డెమోన్, నిఖిల్ టీం విన్ అయ్యారు. దీంతో కమాండర్లుగా మారే గోల్డెన్ ఛాన్స్ ను ప్రజలు పోగొట్టుకున్నారు.

ఎయిమ్ ఫర్ క్రౌన్ టాస్క్ 

ఇక ఈ ఫన్ అంతా పక్కన పెడితే బిగ్ బాస్ రాజు రాణులు కూడా సేఫ్ కాదు అంటూ ‘ఎయిమ్ ది క్రౌన్’ అనే టాస్క్ పెట్టారు. ఈ టాస్క్ లో కమాండర్లతో రాజు రాణులలో ఒకరు తమ ప్లేస్ ను రిస్క్ లో పెట్టి ఆడాల్సి ఉంటుంది. దీంతో దివ్య, రీతూ, కళ్యాణ్ కు దీనిపై డిస్కషన్ నడిచింది. నీకు బెటర్ ఛాన్సులు వస్తున్నాయి అని కళ్యాణ్ దివ్యతో అనగా, అవి రావట్లేదు నేనే క్రియేట్ చేసుకుంటున్నా. తనకు అన్ని ఛాన్సులు వచ్చినా యూజ్ చేసుకోలేకపోయింది అని వాదించింది దివ్య. దీంతో పక్కనోళ్ళను తక్కువ చేసి మాట్లాడకు. నీ గురించి నువ్వు మాట్లాడు. నన్ను తొక్కి పైకి ఎక్కకు అంటూ ఇచ్చిపడేసింది. చివరగా దివ్యను సెలెక్ట్ చేశారు. ఇక కమాండర్స్ ఎవ్వరూ తగ్గకపోవడంతో చిట్స్ వేసి సెలెక్ట్ చేయగా, డెమోన్, నిఖిల్ లకు ఛాన్స్ వచ్చింది.

ఇక ఈ టాస్క్ లో స్టాండ్స్ కు ఉన్న బోల్ట్ తీసేసి, బ్యారెల్స్ ను తీసుకుని, దారిలో వచ్చే ఫ్రేమ్స్ నుంచి ఎండ్ పాయింట్ దగ్గర ఉన్న ప్లాట్ ఫామ్ పై పెట్టాలి. చివరగా బాల్స్ తో అవి కిందపడేలా చేయాలి అన్నది టాస్క్. ఈ టాస్క్ లో నిఖిల్ విన్ అయ్యి, దివ్య క్రౌన్ ను సొంతం చేసుకుని కళ్యాణ్ తో పాటు మరో కింగ్ అయ్యాడు.

Read also : దివ్యకు రీతూ మాస్ వార్నింగ్… రాణితో ఇమ్మూ ఫ్లర్టింగ్ … బాహుబలి రేంజ్ పనిష్మెంట్ ఇచ్చిన కళ్యాణ్

Related News

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

ట్రోలర్స్ ఇనయా దిమ్మతిరిగే కౌంటర్.. కాన్ఫిడెంట్ కు మెచ్చుకోవాల్సిందే..!

Bigg Boss Soniya: గిన్నీస్ బుక్ లో సోనియా కూతురికి చోటు.. ఏం చేసిందో తెలుసా..?

Demon Pawan : వివాదంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ డిమాన్.. ఆగని ట్రోల్స్..!

బిగ్ బాస్ నటితో సిరాజ్ డేటింగ్.. సంచలనం సృష్టిస్తున్న వీడియో!

Big Stories

×