E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu Day 68 : గుక్కపెట్టి ఏడ్చిన కంటెస్టెంట్స్… బిగ్ బాస్ బంపర్ ఆఫర్… ఏడుపుతో పాటు ఎంజాయ్ కూడా

Bigg Boss 9 Telugu Day 68 : గుక్కపెట్టి ఏడ్చిన కంటెస్టెంట్స్… బిగ్ బాస్ బంపర్ ఆఫర్… ఏడుపుతో పాటు ఎంజాయ్ కూడా

Bigg Boss 9 Telugu Day 68 : కొత్తగా కెప్టెన్ అయిన రాణి తనూజాకు వెల్కమ్ పలికారు హౌస్ మేట్స్. ఆ తరువాత రాణి పెట్టిన కండిషన్స్ ను ప్రజలు ఫాలో అవ్వాల్సి వచ్చింది. ప్రజలను పిలిచి వారి కష్టాలు ఏంటో అడిగి మరీ తెలుసుకుంది తనూజా. ఇమ్మాన్యుయేల్ హగ్ కావాలని అడగ్గా, కళ్యాణ్ ద్వారా ఆ కోరిక తీర్చింది. రాజు నిఖిల్ కమాండర్ దివ్య కూడా హగ్ ఇవ్వొచ్చు అనగా… వెంటనే దివ్య హగ్ ఇవ్వడానికి రాగా, ఇమ్మాన్యుయేల్ తప్పించుకునే ప్రయత్నం చేసి నవ్వులు పూయించాడు. అలాగే సుమన్ శెట్టి అందరి ముందు తన కోరికను చెప్పాలంటే సిగ్గేస్తోంది అంటూ తెగ సిగ్గుపడ్డాడు. ఈ ఫన్ అంతా పూర్తయ్యాక నిఖిల్, రీతూ, తనూజా ఇమ్యూనిటీ, కెప్టెన్సీని పొందడానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నారు అంటూ బిగ్ బాస్ హోల్డ్ ది క్రౌన్ అనే టాస్క్ పెట్టారు. ఇందులో రాజు రాణులు నిఖిల్, తనూజా, రీతూ ఆడగా…  తనూజా విన్ అయ్యింది. నిఖిల్ స్వార్డ్ పై సంజన బరువును వేయకపోయి ఉంటే ఆ అదృష్టం నిఖిల్ ను వరించేది.

కంటెస్టెంట్స్ ఎమోషనల్ స్టోరీ

ఇక ఆ తరువాత హౌస్ మేట్స్ అందరూ ఎమోషనల్ అయ్యారు. చిల్డ్రన్స్ డే సందర్భంగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ చిన్ననాటి మధురానుభూతులను ఫోటోల రూపంలో హౌస్ లోకి పంపారు. వాటిని అందుకున్న హౌస్ మేట్స్ ఒక్కొక్కరూ తమ ఎమోషనల్ స్టోరీని బయట పెట్టారు. ‘ప్రతి ఒక్కరి జీవితంలో బాల్యం చాలా అందమైనది. వేలు పట్టుకుని నడవడం నుంచి మొదలు పెడితే చిన్న చిన్న కోరికలు తీరేది కూడా బాల్యంలోనే’. అందులో తనూజా “నా లైఫ్ లో బెస్ట్ సూపర్ హీరో మా అమ్మ. నేనేదైనా చేయలేను అనుకున్నా నువ్వు చేయగలవు అంటూ ఫుల్ సపోర్ట్ ఇచ్చింది. ఆమె వల్లే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను. లవ్ యూ సావిత్రి. మేము ముగ్గురం ఆడపిల్లలం. ఆడపిల్లలను ఎక్కువగా చదివించొద్దు అని మా నానమ్మ నాన్నకు చెప్పడంతో మా చెల్లిని వదిలేసి, నన్ను అక్కను తీసుకుని హైదరాబాద్ కు వచ్చేసింది అమ్మ. వాళ్ళు ఎంత ట్రై చేసినా మా విషయంలో కాంప్రమైజ్ కాలేదు. మొగుడి కంటే పిల్లల భవిష్యత్తు ఎక్కువ అని తేల్చేసింది” అంటూ ఎమోషనల్ అయ్యింది.

తరువాత ఇమ్మాన్యుయేల్ “నన్ను కనడమే మా అమ్మకు ఇష్టం లేదు. అప్పట్లో వాళ్లకు తినడానికి తిండే ఉండేది కాదట. అందుకే అలా అనుకుంది. నన్ను మా అన్నయ్యే నాన్నలా చూసుకున్నాడు. నేను 20 బస్తాలు మోయాల్సి వస్తే, వాడే 15 బస్తాలు మోసేవాడు. నేను చేయని పని లేదు” అంటూ కష్టకాలంతో తీపి జ్ఞాపకాలను కూడా గుర్తు తెచ్చుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు.

కళ్యాణ్ పడాల “మా అమ్మానాన్నతో తిరిగింది గుర్తులేదు. చాలా లోస్ చూశాను చిన్నప్పుడు. అప్పట్లో నోరు తెరిచి ఏది చెప్పలేకపోయాను. ఇప్పటికీ ఎక్స్ప్రెస్ చేయలేను. హాస్టల్ లో వేస్తానంటే వెళ్ళిపోయా. ప్రతి ఆదివారం నేను హాస్టల్ వార్డెన్ దగ్గర కూర్చునే వాడిని. కొన్ని నెలల పాటు ఫోన్లు చేసేవారు కాదు. ఎక్కడో వచ్చేస్తా అంటానో అనేది వాళ్ళ భయం. నేను పుట్టగానే మా నాన్నకు బిజినెస్ లో బాగా కలిసొచ్చింది. కానీ తరువాత ఫ్రెండ్స్ చేసిన మోసంతో జీరోకి వచ్చేశారు. చిన్నప్పుడు వాళ్ళు నా దగ్గర లేకపోవడం ఎప్పటికీ తీరని లోటు. కానీ వాళ్ళు అలా చేయడానికి వాళ్ళ రీజన్ వాళ్ళకు ఉంది” అంటూ వెక్కివెక్కి ఏడ్చాడు.

క్రికెట్ తో లగ్జరీ ఐటమ్స్

ఈ వారం జరిగిన బీబీ రాజ్యం టాస్క్ లో రాణులు, రాజులు ప్రత్యేకమైన ప్రయోజనాలు, విందు భోజనం రుచి చూశారు. సాధారణ ప్రజలకు మాత్రం ప్రయోజనమేమీ చేకూరలేదు. మీకు వారిలా విందు భోజనం ఆరగించే ఛాన్స్ దక్కలేదు. అందుకే మీరు కొన్ని లగ్జరీ ఐటమ్స్ ను అందుకునే ఛాన్స్ ఇస్తున్నాను. క్రికెట్ ఆడి ఆ ఐటమ్స్ ను గెలుచుకోండి అంటూ బంపర్ ఆఫర్ ఇచ్చారు బిగ్ బాస్. దీంతో ప్రజలు క్రికెట్ ఆడి మటన్, కాఫీ, పిజ్జా, మష్రూమ్, దోశ పిండి, రసగుల్లా వంటి లగ్జరీ ఐటమ్స్ ను సంపాదించుకున్నారు. టాస్కులు పూర్తయ్యాక రీతూ – ఇమ్మాన్యుయేల్ మధ్యన జరిగిన ఫన్నీ కన్వర్జేషన్ తో ఇంటి సభ్యులు అందరూ పడీపడీ నవ్వుకున్నారు.

Read Also : రిటైర్డ్ ఏజ్ లో పడుచు పిల్లతో పెళ్లి… కడుపుబ్బా నవ్వించే తెలుగు కామెడీ డ్రామా

Related News

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

ట్రోలర్స్ ఇనయా దిమ్మతిరిగే కౌంటర్.. కాన్ఫిడెంట్ కు మెచ్చుకోవాల్సిందే..!

Bigg Boss Soniya: గిన్నీస్ బుక్ లో సోనియా కూతురికి చోటు.. ఏం చేసిందో తెలుసా..?

Demon Pawan : వివాదంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ డిమాన్.. ఆగని ట్రోల్స్..!

బిగ్ బాస్ నటితో సిరాజ్ డేటింగ్.. సంచలనం సృష్టిస్తున్న వీడియో!

Big Stories

×