E-Paper
Advertisement

Bigg Boss 9 Thanuja: సర్ప్రైజ్.. ఎట్టకేలకు కెప్టెన్ అయిన ముద్దుబిడ్డ తనూజ

Bigg Boss 9 Thanuja: సర్ప్రైజ్.. ఎట్టకేలకు కెప్టెన్ అయిన ముద్దుబిడ్డ తనూజ
Advertisement

Bigg Boss 9 This Week Captain: తనూజ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. ఎట్టకేలకు ఆమె కెప్టెన్ అయ్యింది. ప్రస్తుతం తెలుగు బిగ్ బాస్ షో ఫినాలేకు దగ్గరవుతోంది. ప్రస్తుతం తొమ్మిదవ వారంకి వచ్చేసింది. ఈ వారం కెప్టెన్సీ టాస్క్ కోసం ప్రస్తుతం హౌజ్ పోరు కొనసాగుతుంది. గత రెండు రోజులకు కెప్టెన్సీ కోసం జరుగుతున్న పోటీకి ఈ రోజుతో ఎండ్ పడనుంది. ఈ సీజన్ ఎంతోమంది ఫెవరేట్, టాప్ కంటెస్టెంట్స్ తనూజ మొదటి నుంచి కెప్టెన్సీ కోసం తీవ్రంగా శ్రమిస్తోంది.

శివంగి రెచ్చిపోతున్న తనూజ

Advertisement

ఎప్పుడు చివరి వరకు వచ్చి కెప్టెన్సీ చేజార్చుకుంటోంది. అయితే ఈ వీక్ మాత్రం గట్టిగా టాస్క్ లు ఆడి కెప్టెన్సీని తగ్గించుకున్నట్టు తెలుస్తోంది. కాగా కెప్టెన్సీ పోరు కోసం బిగ్ బాస్ బీబీ రాజ్యం పేరుతో టాస్క్ ఇచ్చాడు. దీనికి కింగ్ కళ్యాణ్.. క్వీన్ రీతూ, దివ్యలను ప్రకటించాడు బిగ్ బాస్. అయితే వారికి కమాండర్స్ గా తనూజ, నిఖిల్, డిమోన్ పవన్, సంజనలను నియమించి మిగిలిన వారిని రాజ్య ప్రజలుగా పేర్కొన్నారు. ఈ టాస్క్ తనూజ గట్టి పోటీ ఇచ్చింది. తన వంతు వచ్చేసరికి లా శివంగి రెచ్చిపోయింది.

కమాండర్స్ నుంచే కెప్టెన్

అయితే నిన్నటి ఎపిసోడ్ లో కమాండర్స్ గా ఉన్న తనూజ, సంజనలకు టాస్క్ ఆడే అవకాశం రాలేదు. డిమోన్, నిఖిల్ మాత్రమే ఆడారు. ఈ ఆటలో క్వీన్ దివ్యని ఓడించి నిఖిల్ కింగ్ అయ్యాడు. ఈ రోజు జరిగిన టాస్క్ ల్లో తనూజ, సంజనలు ఆడారు. వారిలో తనూజ బాగా ఆడి కెప్టెన్సీ కంటెండర్ వరకు చేరుకుంది. ఫైనల్ కింగ్ నిఖిల్, క్వీన్ రీతూ, కమాండర్ నుంచి తనూజ.. ఇక ప్రజల నుంచి సుమన్, ఇమ్మాన్యుయేల్ కెప్టెన్సీ కంటెండర్లు నిలిచారు. వీరిలో నలుగురు పోటీ పడగా చివరిగా తనూజ గట్టి పోటీ ఇచ్చి కెప్టెన్సీని సొంతం చేసుకుంది.

తనూజ కొత్త కెప్టెన్

Advertisement

ఫైనల్ గా తొమ్మిదో వారం కెప్టెన్ గా తనూజ నిలిచిందని తెలుస్తోంది. మరి దీనిపై క్లారిటీ రావాలంటే ఫుల్ ఎపిసోడ్ వచ్చేవారు ఆగాల్సిందే. నిజానికి తనూజకి ఒక హోదా ఉంటే ఆమె నోటికి ఎప్పుడు పని చెబుతూనే ఉంటుంది. ముఖ్యంగా రూల్స్ పెట్టి హౌజ్ మేట్స్ చుక్కలు చూపిస్తుంది. రేషన్ మేనేజర్ ఆమె నిబంధనలు ఏ స్థాయిలో ఉంటాయో చూశాం. రెండు సార్లు రేషన్ మేనేజర్ గా ఉన్నప్పుడు తనూజతో సంజనకు జరిగిన గొడవ పీక్ స్టేజ్ వరకు వెళ్లింది. సంజనతోనే కాదు రీతూ, దివ్య ఇలా హౌజ్ ప్రతి ఒక్కరిని రూల్స్ తో చావగొట్టింది. రేషన్ మేనేజర్ గానే చుక్కలు చూపించిన తనూజ.. ఇక కెప్టెన్ హౌజ్ ఎలా ఆడుకుంటుందో అని అంటున్నారు.

Also Read: Bigg Boss 9 Promo: బీబీ రాజ్యంలో తిరుగుబాటు… ఇమ్మాన్యుయేల్, భరణిల నిరసన

గొడవలతో నెగిటివిటీ

కాగా తనూజకు ఎంతటి ఫ్యాన్ బేస్ ఉందో అదే స్థాయిలో నెగిటివిటీ కూడా ఉంది. బిగ్ బాస్ ముద్దుబిడ్డ అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తుంటారు. అంతేకాదు హోస్ట్ నాగార్జునతో పాటు బిగ్ బాస్ టీం కూడా ఆమె ఫెవరిటిజం చూపిస్తుంటే విమర్శలు చేస్తుంటారు. అంతేకాదు హౌజ్ బాండింగ్స్ పేరుతో అందరిని వాడుకుంటుందంటూ కూడా ట్రొల్ వస్తుంటాయి. కానీ, తనూజ మాత్రం తనదైన ఆటతోనే ముందుకు వెళుతుంది. హౌజ్ లో అందరితో గొడవలు ఉన్న మళ్లీ వెంటనే రీసాల్వ్ చేసుకుంటుంది. ఎవరితో గర్జ్ పెట్టుకోకుండ అందరితో కలిసిపోయి ఉంటుంది. కానీ, గొడవలు వచ్చేసరికి మాత్రం తగ్గేదే లే అంటూ విరుచుపడుతూ తీవ్ర నెగిటివిటీని మూటగట్టుకుంటుంది. 

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×