BigTV English
Advertisement

Bigg Boss 9 Telugu: ఎన్నో అవమానాలు, హేళనలు.. కట్ చేస్తే.. టాప్ స్టేజ్.. ఇమ్మూ బ్యాక్ గ్రౌండ్ ఇదే!

Bigg Boss 9 Telugu: ఎన్నో అవమానాలు, హేళనలు.. కట్ చేస్తే.. టాప్ స్టేజ్.. ఇమ్మూ బ్యాక్ గ్రౌండ్ ఇదే!

Bigg Boss 9 Telugu: రంగుల ప్రపంచం అనే సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.. కానీ కొంతమందికి ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే అదృష్టం వరిస్తే… మరికొంతమంది అవమానాలు, హేళనలు భరించి ఆ తర్వాత ఒక స్థాయికి వస్తారు. అలాంటి వారిలో జబర్దస్త్ ఇమ్మానుయేల్ (Emmanuel) కూడా ఒకరు. ‘పటాస్’ షో ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చిన ఈయన.. ఆ తర్వాత జబర్దస్త్ కార్యక్రమంలో అవకాశాన్ని అందుకొని ఇప్పుడు టాప్ కమెడియన్ గా చలామణి అవుతున్నారు. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలలో ప్రముఖ లేడీ కమెడియన్ వర్ష (Varsha) తో ఆయన చేసిన ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి మరింత పాపులారిటీ లభించింది.


టాప్ కమెడియన్ గా బిగ్ బాస్ హౌస్ లోకి ఇమ్మానుయేల్..

అలా తనదైన శైలిలో పంచులు వేస్తూ అటు జడ్జెస్ ను ఇటు ఆడియన్స్ ను మెప్పిస్తున్న ఇమ్మానుయేల్ తాజాగా తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 లోకి అడుగుపెట్టారు. ముఖ్యంగా హౌస్ లోకి అడుగుపెట్టిన టాప్ కమెడియన్ గానే కాకుండా అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న సెలబ్రిటీగా కూడా రికార్డు సృష్టించారు ఇమ్మానుయేల్. బిగ్ బాస్ కార్యక్రమం విషయానికి వస్తే.. ఇప్పటివరకు 8 సీజన్లను పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తెలుగు ఇప్పుడు 9వ సీజన్ ఘనంగా సెప్టెంబర్ 7న రాత్రి 7 గంటలకు అట్టహాసంగా ప్రారంభం అయింది. ఈ కార్యక్రమంలో టాప్ కమెడియన్గా హౌస్ లోకి అడుగుపెట్టారు ఇమ్మానుయేల్. ఈ సందర్భంగా ఆయన ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు ?ఆయన కెరియర్ ఎలా మొదలయ్యింది? ఈ స్టేజ్ కి రావడానికి ఆయన పడ్డ కష్టం.. ఇలా పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

అవమానాలు.. హేళనలు..


గుంటూరుకు చెందిన ఈయన పాకెట్ మనీతో హైదరాబాద్ కి వచ్చారట. కమెడియన్ గా తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి పలు షోలకి ఆడిషన్స్ ఇవ్వగా.. చాలామంది నల్లగా ఉన్నావు.. అందంగా లేవు అని చాలా అవమానించారట.. నీలాంటి వాళ్లకు ఇండస్ట్రీలో అవకాశం లభిస్తుందా అంటూ హేళన కూడా చేసినట్లు సమాచారం. అలా ఎంతో నరకం అనుభవించి అన్నింటిని నిలదొక్కుకుని.. చివరికి పటాస్ షోలో అవకాశం దక్కించుకున్నారట. ఆ తర్వాతే జబర్దస్త్ లో అవకాశం లభించిందని, ఇక వర్షాతో చేసిన స్కిట్స్ కారణంగా మరింత పాపులారిటీ లభించిందని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

ALSO READ:Ileana D’Cruz: ఆ క్షణం నరకం అనుభవించా.. కొడుకు విషయంలో నిజాలు బయటపెట్టిన ఇలియానా!

టీవీ షోలతో పాటు సినిమాలలో కూడా..

ప్రస్తుతం పలు టీవీ షోలలో సందడి చేస్తూనే.. సినిమాలలో కూడా నటిస్తున్నారు. విరూపాక్ష సినిమాలో ఒక కీలక పాత్ర పోషించిన ఈయన.. గ్రామ వాలంటీర్ అనే ఒక కామెడీ వెబ్ సిరీస్ లో కూడా నటించారు. ఒకవైపు షోల ద్వారా మరొకవైపు సినిమాలు, వెబ్ సిరీస్ ల ద్వారా భారీ పాపులారిటీ అందుకోవడంతో ఇప్పుడు హౌస్ లోకి అవకాశం లభించినట్లు తెలుస్తోంది. మొత్తానికి అయితే తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఈయన.. ఇప్పుడు హౌస్ లో ఏ విధంగా ఆడియన్స్ ఆదరణ పొందుతారో చూడాలి.

డబుల్ హౌస్.. డబుల్ డోస్..

ఇకపోతే బిగ్ బాస్ 9 గ్రాండ్ లాంచ్ ఘనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. డబుల్ హౌస్.. డబుల్ డోస్.. డబుల్ ఎంటర్టైన్మెంట్ అంటూ ప్రేక్షకులను మెప్పించడానికి తెలుగు సీజన్ 9 ప్రారంభం అయింది. ఈసారి చదరంగం కాదు రణరంగం అంటూ షోపై అంచనాలు కూడా పెంచేశారు నాగార్జున. ఇందులో కొత్త రూల్స్.. కొత్త టాస్కులు ఉండనున్నట్లు ముందే హింట్ కూడా ఇచ్చారు. మరి ఈ సీజన్ లో ఎవరు విజేతగా నిలుస్తారో తెలియాలి అంటే.. వీరి పర్ఫామెన్స్ ఎలా ఉందో తెలిసే వరకు ఎదురు చూడాల్సిందే.

Related News

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ నుంచి పచ్చళ్ళ పాప అవుట్.. 2 వారాలకు రెమ్యూనరేషన్..?

Bigg Boss 9: ఇమ్మాన్యుయేల్ గుట్టు రట్టు చేసిన నాగ్.. షాక్ లో తనూజ

Bigg Boss 9: రోడ్ రోలర్.. వీడియోలు చూపించి మరీ వార్నింగ్.. సంజనకి నాగార్జున ఝలక్

Bigg Boss 9: రాము విషయంలో తనూజకు ఫుల్ క్లాస్, వీడియోలతో కంటెస్టెంట్స్ ని ఆటాడుకున్న నాగ్

Nagarjuna: బిగ్ బాస్ హోస్ట్ చేయడంలో నాగార్జున ఫెయిల్ అయ్యారా? ఎందుకంత నెగిటివిటీ వస్తుంది?

Duvvada Madhuri: ఒక్క వారంలో ఊహించని మార్పు, అంత తనూజ దయ

Bigg Boss 9 : బిగ్ బాస్ 9 యాజమాన్యంలో ఎంత మార్పు వచ్చిందో, దెబ్బకు అలా చేయడం ఆపేశారు

Bigg Boss 9 Promo: నువ్వు తోపు అయితే.. అది ఇక్కడ కాదు, మాధురికి నాగ్‌ వార్నింగ్

Big Stories

×