BigTV English

Ileana D’Cruz: ఆ క్షణం నరకం అనుభవించా.. కొడుకు విషయంలో నిజాలు బయటపెట్టిన ఇలియానా!

Ileana D’Cruz: ఆ క్షణం నరకం అనుభవించా.. కొడుకు విషయంలో నిజాలు బయటపెట్టిన ఇలియానా!

Ileana D’Cruz:అందాలతార ఇలియానా (Ileana D’Cruz) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఎప్పటికప్పుడు తన అందంతో అందరి దృష్టిని ఆకట్టుకుంటున్న ఈమె.. ఊహించిన విధంగా ఇండస్ట్రీకి దూరమై ప్రస్తుతం మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పలు అనుభూతులను అభిమానులతో పంచుకుంటున్న ఈమె.. తన మొదటి కొడుకు పుట్టిన తర్వాత తాను కూడా నరకం చూసాను. అంటూ చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా అందరి మహిళల లాగే తనకి కూడా ఇబ్బందులు తప్పలేదు అంటూ తెలిపింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.


ఆ సమయంలో ఇబ్బంది పడ్డాను..

తాజాగా ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇలియానా మాట్లాడుతూ.. “పిల్లల పెంపకంలో ప్రతి మహిళా ప్రయాణం ఒకేలా ఉండదు. మొదటిసారి బ్రెస్ట్ ఫీడింగ్ లో సమస్యలు ఎదుర్కొన్నాను. ఆ సమయంలో ఏం చేయాలో తెలియలేదు. అప్పుడే కొడుకు పుట్టాడు.. ఎలా ఆలించాలో ఎలా పాలివ్వాలో తెలియక నరకం చూసాను. కానీ రెండవసారి మాత్రం పూర్తి అవగాహనతో సులభంగా పాలు ఇవ్వగలుగుతున్నాను” అంటూ తెలిపింది ఇలియానా. ఇటీవల రెండవ కొడుకుకు జన్మనిచ్చిన ఈమె ప్రస్తుతం టెక్సాస్ లో తన కుటుంబంతో కలిసి పిల్లల పెంపకంలో నిమగ్నం అయ్యింది.

ఇలియానా పై నెటిజన్స్ ప్రశంసలు..


ఇకపోతే ఇలియానా చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. సాధారణంగా పిల్లలకు తల్లి పాలు ఇవ్వాలి అని ఇప్పటికే ఎంతోమంది ఆరోగ్య నిపుణులు చెబుతున్నా.. చాలామంది అందం పోతుందనే కారణంతో లేదా ఇతర కారణాలవల్ల తమ పిల్లలకు పాలు ఇవ్వడంలో సంశయిస్తూ ఉంటారు. కానీ ఈమె స్టార్ హీరోయిన్ అయి ఉండి కూడా కెరియర్ గురించి ఆలోచించకుండా పిల్లల భవిష్యత్తు ప్రధానమని పాలు ఇస్తున్నానని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక ప్రస్తుతం ఇలియానాపై పలువురు నెటిజన్స్ , అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇలియానా వ్యక్తిగత జీవితం..

ఇలియానా వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. 2023లో మైకేల్ డోలాన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఈమెకు ఇద్దరు మగ పిల్లలు జన్మించారు. మొదటి కొడుకు పేరు కోవా ఫినిక్స్ డోలాన్ కాగా రెండవ పేరు కియాను రఫే డోలన్.. ప్రస్తుతం పిల్లల సంరక్షణలో కుటుంబానికే తన కెరియర్ ను అంకితం చేసింది ఇలియానా.

ఇలియానా సినిమా జీవితం..

ఇలియానా సినిమా జీవిత విషయానికి వస్తే.. వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో రామ్ హీరోగా నటించిన ‘దేవదాసు’ అనే చిత్రంతో హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఇద్దరికి ఈ సినిమా తొలిచిత్రమే అయినా ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇద్దరికీ కూడా ఉత్తమ నూతన నటీనటులుగా ఫిలింఫేర్ అవార్డులు లభించాయి. ఆ తర్వాత మహేష్ బాబు (Maheshbabu) హీరోగా పూరీ జగన్నాథ్ (Puri Jagannath) దర్శకత్వంలో వచ్చిన పోకిరి సినిమాలో హీరోయిన్ గా నటించినది. ఈ సినిమా కూడా ఈమెకు మంచి విజయాన్ని అందించింది. ఇక తెలుగు తో పాటు తమిళ్ చిత్రాలలో కూడా నటించిన ఈమె ఇప్పుడు ఎక్కువగా హిందీ భాషలో సినిమాలు, వెబ్ సిరీస్ లు చేసింది మొన్నటి వరకు రీఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. ఇప్పుడు మళ్లీ కొంతకాలం ఇండస్ట్రీకి దూరం అవుతున్నానని చెప్పి అభిమానులను నిరాశపరిచింది.

ALSO READ:Urvashi Rautela: అభిమాని ఫోన్ లాగేసుకున్న ఊర్వశీ.. అసలు ఏమైందంటే?

Related News

Teja Sajja: అంత మంచి సినిమా ఎలా వదిలేసావు భయ్యా?

Bandla Ganesh: కొడితే నీలా కొట్టాలి రా బాబు దెబ్బ, బండ్లన్న కొత్త భజన?

Teja Sajja: ఒక పెద్ద దర్శకుడు నన్ను మోసం చేశాడు

TVK Vijay: తలపతి విజయ్ పార్టీ పైన త్రిష ఆసక్తికర కామెంట్స్

Pookie: సోషల్ మీడియా దెబ్బకి పూకి ను కాస్త బూకి చేశారు

Big Stories

×