Bandla Ganesh: నటుడిగా కెరీర్ మొదలుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్నాడు బండ్ల గణేష్. ఇప్పుడు బండ్ల గణేష్ అంటే అందరికీ గుర్తొచ్చేది ప్రొడ్యూసర్ గా ఆయన చేసిన సినిమాలు. బండ్ల గణేష్ స్పీచ్ లు కూడా చాలా వైరల్ గా మారుతుంటాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమాలకు జరిగే ఆడియో ఫంక్షన్ లో బండ్ల గణేష్ మాటలు ఎప్పుడూ వైరల్ అవుతాయి. పవన్ కళ్యాణ్ కు బీభత్సమైన ఎలివేషన్ ఇస్తాడు.
బండ్ల గణేష్ స్పీచ్ చాలామంది పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంజాయ్ చేస్తారు. వాటిని స్టేటస్ లో కూడా పెట్టుకుంటారు. అయితే పవన్ కళ్యాణ్ అంటే పడని వాళ్ళు మాత్రం బండ్ల గణేష్ భజన చేస్తున్నాడు అంటారు. ఇలా భజన అన్నందుకు కూడా పలు సందర్భాల్లో క్లారిటీ కూడా ఇచ్చాడు బండ్ల గణేష్. దేవుళ్లను కూడా అస్తమానం పొగుడుతూ ఉండటం, హీరో నాకు దేవుడి లాంటి వాడు వాళ్లకి భజన చేయడంలో తప్పేముంది అని మాట్లాడుతుంటాడు.
మౌళి తనూజ్ (Mouli Tanuj) నటించిన లిటిల్ హార్ట్స్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద విడుదలై మంచి సక్సెస్ సాధించింది. పలుచోట్ల ఈ సినిమాకి హౌస్ ఫుల్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. ఈ రోజుల్లో హౌస్ ఫుల్ అవడం అనేది మామూలు విషయం కాదు. లిటిల్ హార్ట్స్ సినిమాకి యునానిమస్గా పాజిటివ్ టాక్ వచ్చింది. చాలామంది సెలబ్రిటీలు ఈ సినిమా గురించి కామెంట్ చేస్తున్నారు.
ఇప్పుడు తాజాగా బండ్ల గణేష్ ఈ సినిమా గురించి రెస్పాండ్ అయ్యాడు. “కొడితే నీలా కొట్టాలి రా బాబు దెబ్బ…..చంపేశావ్ ..ఇక దున్నే టాలీవుడ్ నీదే ……..!” అంటూ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశాడు బండ్ల గణేష్. దీనికి మౌళి కూడా రిప్లై ఇచ్చాడు. అయితే చాలామంది కామెంట్స్ లో మళ్ళీ కొత్తగా భజన మొదలు పెట్టావా అంటూ బండ్ల గణేష్ ను అనడం స్టార్ట్ చేశారు.
బండ్ల గణేష్ ప్రొడ్యూసర్ గా విపరీతమైన పేరు సాధించుకున్నాడు. చాలామంది స్టార్ హీరోలతో సినిమాలు చేశాడు. ప్రస్తుతం సినిమాలు చేయడం తగ్గించాడు కానీ ఒకప్పుడు ఈయన నిర్మించిన సినిమాలు బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టాయి. మళ్లీ నిర్మాతగా సినిమాలు తీయడం మొదలు పెడతాను. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తాను. అని పలు సందర్భాల్లో బండ్ల గణేష్ చెప్పాడు. మళ్లీ నిర్మాతగా ఎటువంటి కం బ్యాక్ ఇస్తాడో వేచి చూడాలి. బండ్ల గణేష్ స్పీచ్ లు మాత్రమే కాదు ట్వీట్ లు కూడా వైరల్ అవుతాయి.