Bigg Boss 9 Telugu Live Updates: మరికొన్ని గంటల్లో బిగ్బాస్ కొత్త సీజన్ ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. ఈ రోజు (సెప్టెంబర్ 7) సాయంత్రం 7 గంటలకు బిగ్బాస్ 9 తెలుగు (Bigg Boss 9 Telugu) షో గ్రాండ్గా లాంచ్ కాబోతోంది. ఈసారి డబుల్ హౌజ్, డబుల్ డోస్‌తో ఈ రియాలిటీ ఫైర్ స్ట్రోమ్గా ఉంటుందంటూ హో స్ట్ నాగార్జున హైప్ పెంచుతున్నారు. కాసేపటి క్రితం విడుదలైన ప్రొమోలో హౌజ్ని పరిచయం చేశాడు. రెండు హౌజ్లతో బిగ్బాస్ కనువిందు చేసింది. సెకండ్ హౌజ్ అవుట్ స్టాండింగ్ అంటూ క్యూరియాసిటీ పెంచాడు హోస్ట్. కంటెస్టెంట్స్ని కూడా పరిచయం చేశాడు.
కానీ, వాళ్లు ఎవరనేది చూపించకుండ సస్పెన్స్ క్రియేట్ చేశాడు. కొత్త బిగ్బాస్, సరికొత్త టీం, సరికొత్త కాన్సెప్ట్లో ఈ రియాలిటీ షోలో ఆడియన్స్ని ఫుల్ ఎంటర్టైన్ చేయబోతుందని ప్రొమో చూస్తే అర్థమైపోతుంది. లాంచ్ డే రోజే ఎవరూ ఊహించని మలుపు ఉండబోతుందని తెలుస్తోంది. ఎంట్రీ స్టేజ్పై నుంచే కంటెస్టెంట్ వెనక్కి వెళ్లబోతున్నాడని తెలుస్తోంది. ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ కాన్పీడెన్స్ చూస్తుంటే నెక్ట్స్ లెవెల్ అనేట్టుగా ఉంది. పిక్చర్ అబీ భాకీ హై అంటూ ఆశా షైనీ ఫైర్ స్ట్రోమ్ పెంచింది. మరి హోస్ట్ చెప్పినట్టుగానే ఈసారి హౌజ్ రణరంగమే అన్నట్టు ఉంది.. కంటెస్టెంట్స్ ఫైర్ చూస్తుంటే.
ఈ ప్రొమో చూస్తుంటే ముందు నుంచి వినిపిస్తున్న పేర్లే.. స్టేజ్పై వినిపించాయి. రాము రాథోడ్, రితూ చౌదరి, భరణి శకంర్, జబర్దస్త్ ఇమ్మానుయేల్, సుమన్ శెట్టి, రాము రాథోడ్, తనూజ గౌడ్, నటి ఆశా షైనీ, సంజన గల్రానీ, ఉమెన్ కొరియోగ్రాఫర్ శ్రేష్టి, సుమన్ శెట్టి, ఉన్నట్టు తెలుస్తోంది. ఇక కామనర్స్ నుంచి శ్రీజ దమ్ము, ప్రియా శెట్టి, మాస్క్ మ్యాన్ హరీష్, ఆర్మీ పవన్ కళ్యాణ్, మర్యాద మనీష్లు కన్ఫాం అయ్యారు.