Samsung Galaxy: సామ్‌సంగ్ గెలాక్సీ ఏ17 5జీ సరికొత్త ప్రారంభానికి పునాది వేసింది. డిజిటల్ ప్రపంచానికి అనుగుణంగా, నూతన ఫీచర్లతో ముందుకు వచ్చింది. ఫోన్, ఇంటర్నెట్, డేటా ఈ మూడు అంశాలు విడదీయలేని బంధాలుగా మారిన ఈ ప్రపంచంలో, వినియోగదారులకు సౌకర్యాన్ని పెంచే ప్రత్యేక ఫీచర్లతో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. దీని ప్రత్యేకతలను ఇప్పుడు పరిశీలిద్దాం.
ధర- ఫోన్ ప్రత్యేకత ఏమిటి?
మొదటగా ధర గురించి మాట్లాడితే, ఇది రూ.17,999 నుండి ప్రారంభమవుతుంది. అదనంగా రూ.1000 ఇన్ స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. అంతేకాదు, ఎవరైనా పెద్ద మొత్తం ఒకేసారి పెట్టలేకపోతే, రూ.3000 ప్రతీ నెల చెల్లింపుతో 6 నెలల నో కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా ఉంది. అంటే అదనపు వడ్డీ లేకుండా సులభంగా కొనే అవకాశం లభిస్తుంది.
ఇందులో ఫీచర్‌లు- 5జీ సపోర్ట్
ఇక ఈ ఫోన్‌లో ముఖ్యమైన ఫీచర్లు చూస్తే, 5జీ సపోర్ట్ ఉండటం పెద్ద ప్లస్ పాయింట్. 5జీ నెట్‌వర్క్ వల్ల మీరు ఇంటర్నెట్ వాడేటప్పుడు పది రెట్లు ఎక్కువ వేగం (Speed) పొందుతారు. సినిమాలు డౌన్‌లోడ్ చేయడం, ఆన్‌లైన్ గేమ్స్ ఆడటం, వీడియో కాల్స్ అన్నీ వేగంగా జరుగుతాయి.
సామ్‌సంగ్ ఈ ఫోన్‌లో కొత్తగా గూగుల్ జెమిని, సర్కిల్-సర్చ్ అనే ప్రత్యేక ఫీచర్లను కూడా అందిస్తోంది. అంటే మీకు ఏదైనా తెలియని వస్తువు, ప్రోడక్ట్ లేదా సమాచారం కనిపిస్తే వెంటనే స్క్రీన్‌పై సర్కిల్ చేసి సులభంగా ఆ విషయాన్ని గూగుల్‌లో సెర్చ్ చేయవచ్చు. ఇది కొత్త యూజర్లకు చాలా ఉపయోగపడే ఫీచర్.
Also Read: Airtel 5G Plus: స్టోర్‌కి రాకండి, మేమే వస్తాం.. ఎయిర్‌టెల్ కొత్త ఆఫర్
అదిరిపోయే డిజైన్
డిజైన్ విషయానికి వస్తే, గెలాక్సీ ఏ17 5జీ స్టైలిష్ లుక్‌తో వస్తుంది. సన్నగా, ఆకర్షణీయంగా ఉండే ఈ ఫోన్ చేతిలో పట్టుకున్నా, బయటకు తీసుకుని వెళ్ళి మీ చేతిలో వున్న ఈ ఫోన్ లుక్ అందరిని ఆకర్షి్స్తుంది. కేవలం డిజైన్ మాత్రమే కాదు, బలమైన బాడీ క్వాలిటీతో కూడా ఇది ఎక్కువ కాలం ఉపయోగపడుతుంది.
కెమెరా – బ్యాటరీ ఎలా ఉంది
కెమెరా విషయానికి వస్తే, సామ్‌సంగ్ ఎప్పటిలాగే ఈ మోడల్‌లో కూడా అద్భుతమైన క్వాలిటీని అందిస్తోంది. ఫోటోలు తీసినా, వీడియోలు రికార్డ్ చేసినా, తక్కువ లైట్‌లో కూడా మంచి క్లారిటీ వస్తుంది. యువతకు సోషల్ మీడియా కోసం ఫోటోలు, రీల్స్ చేయడం ఇష్టం కాబట్టి ఈ ఫోన్ ఒక మంచి ఎంపిక అవుతుంది. మరోవైపు బ్యాటరీ సామర్థ్యం కూడా బలంగా ఉంది. ఒకసారి ఛార్జ్ చేస్తే రోజంతా సులభంగా వాడుకోవచ్చు. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటంతో తక్కువ టైంలోనే ఎక్కువ బ్యాటరీ అందుతుంది.
సర్వీస్ నెట్ వర్క్- సామ్‌సంగ్
ఇక సామ్‌సంగ్ సర్వీస్ నెట్‌వర్క్. భారత్‌లోనే అతి పెద్ద సర్వీస్ సెంటర్ నెట్‌వర్క్ కలిగిన కంపెనీ సామ్‌సంగ్. కాబట్టి ఈ ఫోన్ వాడేటప్పుడు ఎలాంటి సమస్య వచ్చినా త్వరగా సర్వీస్ పొందవచ్చు. 5జీ సపోర్ట్, స్టైలిష్ డిజైన్, కొత్త గూగుల్ ఫీచర్లు, ఈఎంఐ సౌకర్యం అన్నీ కలిపి ఈ ఫోన్‌ను యువత, ఉద్యోగులు, విద్యార్థులు అందరికీ సరిపోయేలా చేస్తాయి. కాబట్టి మీరు కొత్త ఫోన్ కొనాలని అనుకుంటే, తక్కువ బడ్జెట్‌లో అధిక ఫీచర్లతో లభించే గెలాక్సీ ఏ17 5జీ తప్పక పరిశీలించవలసిన మోడల్.