BigTV English

BiggBossTelugu8: తొలివారమే హాట్ నామినేషన్స్.. నా గుడ్డుతో బుర్జీ చేసుకుంటానన్న సీత.. ఆదిత్య రియాక్షన్ పై నవ్వులు

BiggBossTelugu8: తొలివారమే హాట్ నామినేషన్స్.. నా గుడ్డుతో బుర్జీ చేసుకుంటానన్న సీత.. ఆదిత్య రియాక్షన్ పై నవ్వులు

BiggBossTelugu8 Nominations : బిగ్ బాస్ కు ప్రత్యేకంగా అభిమానులుంటారు అనడంలో డౌటే లేదు. ఎప్పుడెప్పుడు సీజన్ మొదలవుతుందా అని చూసేవారి ఆశ తీరింది. ఈనెల 1న గ్రాండ్ ఈ రియాలిటీ షో ప్రారంభం అవ్వగా.. 14 మంది కంటెస్టెంట్లు హౌస్ లో అడుగుపెట్టారు. వీరిలో ప్రేక్షకులకు తెలిసిన సీరియల్, సినీ నటులు ఉండగా.. కొందరికే తెలిసిన సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు ఉన్నారు. సీజన్ 8 అన్ లిమిటెడ్ ఎంటర్టైన్ మెంట్ కాన్సెప్ట్ తో నడుపుతుండగా.. ముందు ముందు ట్విస్టులెలా ఉంటాయోనని ఆసక్తిగా వీక్షిస్తున్నారు ప్రేక్షకులు.


నామినేషన్ల పర్వం మొదలవ్వగా.. తొలివారమే ఒకరిపై ఒకరు వంట గురించి, సింపతీ గురించి, కోపతాపాలపై విమర్శలు చేసుకుంటూ నామినేషన్లు వేస్తున్నారు. ముఖ్యంగా శేఖర్ బాషా – నాగమణికంఠ- అభయ్ నవీన్ ల మధ్య నామినేషన్ల రగడ జరిగిందని తాజాగా రిలీజైన ప్రోమోలో తెలుస్తోంది. బేబక్క – సీత ల మధ్య వంట గురించి గొడవ జరిగింది.

నామినేషన్ల టైమ్ లో.. సీత మాట్లాడుతూ.. మధ్యాహ్నం ఒక కర్రీ, రాత్రి ఒక కర్రీ అనుకున్నాక.. నిన్న రాత్రి రెండుకూరలెందుకు చేశారని బేబక్కను ప్రశ్నించింది. ముందు రెండు కూరలు చేయలేదన్న బేబక్క.. ఆ తర్వాత నాన్ వెజ్ తినని వారికోసం ఆలుకర్రీ చేశానని చెప్పింది. అలాంటపుడు నా గుడ్డుతో బుర్జీ చేసుకుంటానంటే ఎందుకు వద్దన్నారని అడిగింది. ఇక విష్ణుప్రియ – సోనియా నామినేషన్ లో.. రెస్పాన్సిబులిటీ తీసుకోలేనపుడు పక్కన కూర్చుని చిల్ కొట్టు అని సలహా ఇచ్చింది సోనియా.


Also Read: బిగ్ బాస్ నామినేషన్స్ లిస్ట్.. ముందుగా ఎలిమినేట్ అయ్యేది వాళ్లే!

అభయ్ నవీన్ హౌస్ లో ఉన్నవాళ్లు కోపాలు తగ్గించుకోవాలని చెప్తుండగా.. నాగమణికంఠ రియాక్ట్ అయ్యాడు. దాంతో వారిద్దరి మధ్య కాస్త వాగ్వాదం జరిగినట్లుగానే కనిపిస్తోంది. తన ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ ఎప్పుడూ సీరియస్ గానే ఉంటాయి కాబట్టి.. కోపంగా ఉన్నట్లే కనిపిస్తానని చెప్పుకొచ్చాడు నాగమణికంఠ. తను అన్ ఫిట్ అయితే ఈ వీకే వెళ్లిపోతానని అతను.. ఏమో నేను కూడా వెళ్లిపోవచ్చేమోనని అభయ్ వాదించుకున్నారు. ఇక ప్రోమో చివరిలో నాగమణికంఠ మళ్లీ సింపతీ గెయిన్ చేసేందుకు ప్రయత్నించగా.. అతను చెప్పిన విషయాలు హౌస్ మెంబర్స్ తో కన్నీళ్లు పెట్టించాయి.

తాను చావు వరకూ వెళ్లొచ్చానని, తండ్రి చనిపోయాడని, స్టెప్ ఫాదర్ చేత అవమానం ఎదుర్కొన్నానని, తల్లి చనిపోతే దహనం చేయడానికి కూడా డబ్బుల్లేక అందరినీ అడిగి కట్టెలు పేర్చి అంత్యక్రియలు చేశానని చెబుతూ ఏడ్చేశాడు. ఈ ప్రోమోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. మీరూ మీరూ కొట్టుకుని చావండి.. నాకు ఎంటర్టైన్ మెంట్ ఇవ్వండి అన్నట్లు ఆదిత్య ఓం ఉన్నాడని, నాగమణికంఠ సింపతీ కోసం ట్రై చేస్తున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరైతే విష్ణుప్రియ యాంగర్ చూడటానికి వెయిట్ చేస్తున్నామన్నారు. బిగ్ బాస్ సీజన్ 8 మూడోరోజు ప్రోమో 1 ఇలా సాగింది.

Related News

Bigg Boss AgniPariksha: అనుమానం రేకెత్తిస్తున్న మాస్క్ మ్యాన్.. ఎవరో తెలుసా?

Bigg Boss Telugu 9 Promo : సంవత్సరానికి నలుగురు పిల్లలు కావాలా? ఏంటి శ్రీముఖి ఇది? 

Bigg Boss 9 Agnipariksha : బిగ్ బాస్ సీజన్ 9 లోకి ఐదుగురు కన్ఫామ్..?

Bigg Boss Telugu: కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. వీడియో వైరల్!

Rahul Sipligunj – Rathika : ఘనంగా రాహుల్ ఎంగేజ్మెంట్, గుక్కపెట్టి ఏడుస్తున్న రతిక

Bigg Boss Agnipariksha: ఒక్క ఛాన్స్ అంటూ గోల.. రేయ్ ఎక్కడ దొరికార్రా మీరంతా?

Big Stories

×