BigTV English
Advertisement

Bigg Boss: నామినేషన్ లోకి టాప్ కంటెస్టెంట్.. వైల్డ్ కార్డ్స్ పగబట్టారా..?

Bigg Boss: నామినేషన్ లోకి టాప్ కంటెస్టెంట్.. వైల్డ్ కార్డ్స్ పగబట్టారా..?

Bigg Boss.. ప్రస్తుతం తెలుగులో బిగ్ బాస్ 8వ సీజన్ (Bigg Boss season 8)కొనసాగుతున్న విషయం తెలిసిందే. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగుపెట్టగా.. అందులో ఇప్పటికే 6 మంది ఎలిమినేట్ అయ్యారు. 5 వారాలు పూర్తి చేసుకున్న ఈ షోలోకి నిన్న అనగా ఆదివారం అక్టోబర్ 6వ తేదీన వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ ను మళ్లీ హౌస్ లోకి తీసుకొచ్చారు నిర్వాహకులు. అందులో భాగంగానే వైల్డ్ కార్డు ఎంట్రీస్ ద్వారా హరితేజ , టేస్టీ తేజ , నయని పావని, మెహబూబ్, గౌతమ్ కృష్ణ, రోహిణి, ముక్కు అవినాష్, గంగవ్వ ఇలా మొత్తం 8 మంది హౌస్ లోకి అడుగుపెట్టారు. ఇకపోతే ఈ వైల్డ్ కార్డ్స్ అందరూ కూడా ప్రస్తుతం ఉన్న టాప్ కంటెస్టెంట్స్ పై పగబట్టారో ఏమో తెలియదు కానీ ఇప్పటివరకు నామినేషన్ లోకి రాకుండా సేవ్ అవుతూ వస్తున్న ఆ టాప్ కంటెస్టెంట్ ను నామినేషన్ లోకి తీసుకురావడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.


హౌస్ మేట్స్ వర్సెస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్..

బిగ్ బాస్ వైల్డ్ కార్డు ఎంట్రీ తో తెలుగు సీజన్ 8 చాలా ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ఫైర్ బ్రాండ్స్ తో పాటు నాన్ స్టాప్ ఎంటర్టైనర్స్ ని కూడా హౌస్ లోకి తీసుకొచ్చారు. సాధారణంగా కొత్త సెలబ్రిటీలను కంటెస్టెంట్ లుగా ఎంపిక చేస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈసారి అందుకు భిన్నంగా అందరినీ మాజీ కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి తీసుకురావడం ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉండగా ఆరవ వారం మొదలైంది. మరి ఆరవ వారం మొదటి రోజులో భాగంగా హౌస్ లో ఉన్న ఎనిమిది మందిని ఒక క్లాన్ గా, ఇప్పుడు వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఎనిమిది మందిని మరో క్లాన్ గా విభజించి పోటీ నిర్వహించనున్నారు.


టాప్ కంటెస్టెంట్ ను టార్గెట్ చేసిన వైల్డ్ కార్డ్స్..

ఈ నేపథ్యంలోనే సోమవారం యథావిధిగా నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి నామినేషన్ లో భాగంగా యష్మీ ని హరితేజ నామినేట్ చేసింది. హరితేజకు యష్మీ ఆటపై మంచి అభిప్రాయం లేదని, ఈ విషయాన్ని నేరుగా నాగార్జునతో వేదికపై చెప్పి, యష్మీ కి గట్టిగా ఇస్తానని పరోక్షంగా కూడా వెల్లడించింది. అలా హౌస్ లోకి హరితేజ అడుగుపెట్టగానే యష్మీ ని టార్గెట్ చేసినట్లు స్పష్టమవుతుంది. ముఖ్యంగా హౌస్ లో నామినేషన్ ప్రక్రియ వాడివేడిగా సాగినట్లు తెలుస్తోంది. మెజారిటీ కంటెస్టెంట్స్ అందరూ కూడా యష్మిని నామినేట్ చేసారట అంతేకాదు ఎక్కువగా ఓట్లు వ్యతిరేకంగా పడడంతో యష్మీ నామినేషన్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది.

ఈవారం నామినేషన్ లో నిలిచిన కంటెస్టెంట్స్ వీరే..

మరి ఈ వారం నామినేషన్ లోకి వచ్చిన కంటెస్టెంట్లలో యష్మీ, గంగవ్వ, విష్ణు ప్రియ, సీత , పృథ్వీరాజ్ , మహబూబ్ నామినేట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరిలో వచ్చేవారం ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా హౌస్ లోకి వైల్డ్ కార్డ్స్ అలా ఎంట్రీ ఇచ్చారో లేదో అప్పుడే హౌస్ లో టాప్ కంటెస్టెంట్ గా సాగుతున్న యష్మీ ని నామినేషన్ లోకి పడేసి ఆమెకు గట్టి ఝలక్ ఇచ్చారని చెప్పవచ్చు.

Related News

Bigg Boss 9 Telugu Day 62 : ఇమ్మూ, రీతూ ఇంత సెల్ఫిషా ? కంటెస్టెంట్స్ ఎమోషన్స్ తో ఆటాడుకున్న నాగ్… రామూ షాకింగ్ ఎలిమినేషన్

Bigg Boss Tamil: ప్రాంక్‌ పేరుతో కొట్టుకున్న కంటెస్టెంట్స్‌.. ఫైర్‌ అయిన హోస్ట్‌!

Bigg Boss 9 Elimination: డబుల్‌ ట్విస్ట్‌, డబుల్‌ ఎలిమినేషన్‌.. రాము రాథోడ్‌ అవుట్‌!

Bigg Boss 9 Promo : బిగ్ బాస్ హౌస్ లో ఆర్జీవి, అందరూ అమ్మాయిలే కావాలి అంటూ..

Bigg Boss 9: ఏడుపుగొట్టు చెత్తను బయటకు తోసేయండి, లైవ్ చూడలేకపోతున్నాం

Bigg Boss 9: ఇన్ సెక్యూరిటీ లోకి పోయి గేమ్ పాడు చేసుకుంటున్నా ఇమ్మానియేల్

Bigg Boss 9 Telugu Day 61 : రీతూ బంగారంరా… తనూజాపై అంత కక్షగట్టేశావ్ ఏంటి దివ్య? నక్కతోక తొక్కిన ఇమ్మూ

Bigg Boss 9 Telugu : ఇమ్మూనా మజాకా? బిగ్ బాస్ చరిత్రలోనే బిగ్గెస్ట్ రికార్డ్… కానీ ఆ బుర్ర తక్కువ పనే మైనస్ మావా

Big Stories

×