Bigg Boss 8 Prize : ప్రస్తుతం బిగ్ బాస్ 8 గురించి సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. మరో వారంలో తెలుగు సీజన్ 8 ఎండ్ అవుతుంది. గత వారం డబుల్ ఎలిమినేషన్ జరిగింది. మరి ఈ వారం కూడా డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఎలిమినేషన్ మాట పక్కన పెడితే ఈ సీజన్ విన్నర్ ఎవరు అనే దానిపై చర్చలు మొదలయ్యాయి. విన్నర్ రేసులో గౌతమ్, నిఖిల్ ఉన్నట్లు వాళ్ల ఓటింగ్ ను చూస్తే తెలుస్తుంది. అయితే విన్నర్ కు ప్రైజ్ మని ఏమిస్తారు అనేది ఆసక్తిగా మారింది. విన్నర్ కు ఎంత ప్రైజ్ మనీ ఇస్తారు? ఇంకేమైన బెనిఫిట్స్ ఉన్నాయా? అని ఆడియన్స్ ఆలోచిస్తున్నారు. ఇక తాజాగా బిగ్ బాస్ గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి చక్కర్లు కొడుతుంది. ప్రైజ్ మనీ తో పాటుగా కారును కూడా గిఫ్ట్ గా ఇస్తారని ఓ వార్త షిఖారు చేస్తుంది.. అందులో నిజమేంత ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..
బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ జోరుగా సాగుతోంది. సెప్టెంబర్ 1న ప్రారంభమైన బిగ్ బాస్ 8 తెలుగు సీజన్‌లోకి ముందు 14 మంది కంటెస్టెంట్స్‌గా ఎంట్రీ ఇచ్చారు. తర్వాత కొంతమంది ఎలిమినేషన్, వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో ప్రస్తుతం హౌస్ 14 వ వారంలో ఏడుగురు మిగిలారు.విష్ణు ప్రియా, రోహిణి, అవినాష్, నిఖిల్, గౌతమ్, ప్రేరణ, నబీల్ ఉన్నారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఇన్ఫినిటీ అనే కాన్సెప్ట్‌తో స్టార్ట్ అయింది. అంటే అన్‌లిమిటెడ్ ఫన్, అన్‌లిమిటెడ్ ట్విస్టులతోపాటు అన్‌లిమిటెడ్ ప్రైజ్ మనీ అని హోస్ట్ నాగార్జున చెప్పారు.. గతంలో బిగ్ బాస్ తెలుగు టైటిల్ విన్నర్‌కు దాదాపుగా రూ. 50 లక్షల వరకు ప్రైజ్ మనీగా వచ్చేది. కానీ, బిగ్ బాస్ తెలుగు 8లో మాత్రం కంటెస్టెంట్ల ఆట తీరును బట్టి ప్రైజ్ మనీ ఉంటుందని తెలిపారు. అంటే, కంటెస్టెంట్స్ ఎంత సంపాదించుకుంటే అంతగా బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్ ప్రైజ్ మనీ అదే ఉండేది.
గత వారాల్లో విష్ణుప్రియ మెగా చీఫ్ కావడంతో బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్ ప్రైజ్ మనీ ఇంకాస్తా పెరిగింది. దాంతో ఇప్పటికీ బిగ్ బాస్ తెలుగు 8 టైటిల్ విన్నర్ ప్రైజ్ మనీ రూ. 40,16000 కు చేరుకుంది. అంటే, ఈ సీజన్ విన్నర్‌గా నిలిచిన విజేతకు ఇప్పటికీ అయితే 40 లక్షల 16 వేల రూపాయల డబ్బు వస్తుంది. ఆ తర్వాత ఒక్కొక్కటి పెరుగుతూ వచ్చింది.. ఇప్పుడు 50 లక్షలకు పైగానే ఉందని తెలుస్తుంది. అంతేకాదు స్పెషల్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఖరీదైనా కారును కూడా గిఫ్ట్ గా ఇవ్వనున్నారని ఓ వార్త చక్కర్లు కొడుతోంది. బిగ్ బాస్ విన్నర్ కి ప్రైజ్ మనీ తోపాటు మారుతీ సుజుకీ ఆల్ న్యూ డ్యాజిలింగ్ డిజైర్ కారు కూడా ఇవ్వనున్నారు అంటే ఈ సీజన్ విన్నర్ పంట పండినట్లే.. మరి ఎవరికీ అదృష్టం వరిస్తుందో చూడాలి..
ఇక 13 వారం హౌస్ నుంచి తేజా, పృథ్వి ఎలిమినేట్ అయ్యాక.. ప్రస్తుతం హౌస్ లో విష్ణు ప్రియా, రోహిణి, నిఖిల్, అవినాష్, ప్రేరణ, నబీల్, గౌతమ్ లు ఉన్నారు. ఈ 14 వ వారం నామినేషన్స్ రసవత్తరంగా ఉండబోతున్నాయని తెలుస్తుంది. ఎవరు నామినేషన్స్ లో ఉంటారో సోమవారం ఎపిసోడ్ లో తెలియనుంది.. గత వారం లాగా ఈ వారం నామినేషన్స్ లో ఏదైనా ట్విస్ట్ ఇస్తాడేమో బిగ్ బాస్ చూడాలి..