Bigg Boss Gautham : బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు సీజన్ కు ఇటీవలే శుభం కార్డు పడింది. ఈ సీజన్ కు ఫైర్ బ్రాండ్ గౌతమ్ కృష్ణ విన్నర్ అవుతారని అందరు అనుకున్నారు. కానీ చివరకు కన్నడ అబ్బాయి నిఖిల్ ట్రోఫీని అందుకున్నాడు. ఇక రన్నరప్‌గా నిలిచిన గౌతమ్ కృష్ణ పీపుల్ విన్నర్‌గా హాట్ టాపిక్ అవుతున్నాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఆరో వారంలో అడుగుపెట్టిన గౌతమ్ కృష్ణ వైల్డ్ ఫైర్ చూపిస్తూ తన ఆట తీరుతో తన మాట తీరుతో మెప్పించాడు. ఇక బిగ్ బాస్ సీజన్ 8 విజేతగా కావడం ఖాయం అనుకున్నటైంలో అతన్ని కాదని.. నిఖిల్‌ని విన్నర్‌గా ప్రకటించింది బిగ్ బాస్. ఓట్లు గౌతమ్‌కి ఎక్కువ వచ్చినా.. స్టార్ మా బ్యాచ్ కావడం వల్లే నిఖిల్‌ని విన్నర్‌ని చేశారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.. అయితే గౌతమ్ కు ట్రోఫీ తో పాటుగా రెండు కోట్లు లాస్ అయ్యాడంటూ ఓ వార్త సోషల్ మీడియాలో షికారు చేస్తుంది. అసలు మ్యాటరేంటో ఒకసారి తెలుసుకుందాం..
బిగ్ బాస్ సీజన్ 8తో పాటు సీజన్ 7లో స్ట్రాంగ్ కంటెస్టెంట్. ఆ సీజన్‌లో 13 వారాలు హౌస్‌లో ఉన్నాడు గౌతమ్. అయితే బిగ్ బాస్‌కి వచ్చేముందు.. గౌతమ్ హీరోగా ‘ఆకాశవీధుల్లో’ అనే సినిమా చేశాడు. ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు గౌతమ్. ఆ సినిమాలో గౌతమ్ బాగానె యాక్ట్ చేసాడు. కానీ డైరెక్షన్ దెబ్బేసింది అంటూ అప్పటిలో వార్తలు వినిపిస్తున్నాయి. ఆ సినిమాలో పూజిత పొన్నాడ హీరోయిన్‌గా నటించింది. అయితే ఈ సినిమా కోసం దాదాపు రెండున్నరేళ్లు కష్టపడ్డాడు గౌతమ్. అయితే ఈ సినిమా సరిగా ఆడకపోవడంతో భారీగా నష్టాన్ని చూసాడు.
ఈ సినిమాకు మొత్తానికి దాదాపు రూ.2 కోట్ల నష్టం వచ్చిందని తాజా ఇంటర్వ్యూలో తెలియజేశాడు గౌతమ్. ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఫస్ట్ సినిమాకు నేనే యాక్టర్, డైరెక్టర్, రైటర్. ఈ సినిమా ఫెయిల్ అయినా కూడా.. ఫెయిల్యూర్ నుంచి ఎక్కువ నేర్చుకున్నా. తెలియనితనం వల్ల చేద్దాంలే అని అనుకున్నా కానీ.. చాలా నేర్చుకున్నాను. ఫిల్మ్ మేకింగ్ చాలా వరకూ తెలుసుకున్నాను. 24 క్రాఫ్ట్స్ పై అవగాహన వచ్చింది. సినిమాను ఎలా తియ్యాలి అనేది అయితే క్లారిటీ వచ్చేసింది. అంతేకాదు మొదటి సినిమా నేర్పిన గుణ పాఠంతో రెండో సినిమా పై జాగ్రత్తలు తీసుకుంటానని గౌతమ్ అంటున్నాడు. ఇకపోతే సెకండ్ ఫిల్మ్‌కి ప్రొడ్యుసర్ దొరికారు. ఫస్ట్ సినిమాకి మాత్రం.. మా డాడీ ఫ్రెండ్స్, తెలిసిన వాళ్లు ఇన్వెస్ట్ చేశారు. బట్ ఫైనాన్సియల్‌గా నా ఫస్ట్ సినిమా ‘ఆకాశవీధుల్లో’ కి రూ.2 కోట్ల నష్టం వచ్చింది. అందుకే ఇప్పుడు నా రెండో సినిమాకి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం..త్వరలోనే సినిమాను చేస్తానని గౌతమ్ అంటున్నాడు. మరి ఎలాంటి స్టోరీతో వస్తాడో చూడాలి.. ఆ సినిమా హిట్ అయితే బిగ్ బాస్ విన్నర్ అయిన అంత మించి సక్సెస్ ను అందుకుంటాడు గౌతమ్.. చూద్దాం..