Pushpa 2 Hindi Collections: ఈరోజుల్లో తెలుగు సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోంది. మంచి కంటెంట్‌తో తెరకెక్కితే చాలు.. తెలుగు సినిమాలకు బ్రహ్మరథం పడుతున్నారు ప్రేక్షకులు. ముఖ్యంగా నార్త్ బాక్సాఫీస్‌పైనే ఎక్కువగా మేకర్స్ ఫోకస్ ఉంటోంది. నార్త్‌లో గెలిస్తే పాన్ ఇండియా రేంజ్‌లో గెలిచినట్టే అని హీరోలు సైతం ఫిక్స్ అయిపోతున్నారు. అందుకే నార్త్ ఆడియన్స్‌ను ఇంప్రెస్ చేయడం కోసం పుష్ఫరాజ్ రంగంలోకి దిగాడు. సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన ‘పుష్ఫ 2’ సినిమా హిందీ బాక్సాఫీస్‌పై దండయాత్ర చేస్తోంది. ఒరిజినల్ సినిమాలను సైతం వెనక్కి నెట్టే రికార్డుల మోత మోగిస్తోంది. ఇది చూసి బన్నీ ఫ్యాన్స్ తెగ సంతోషపడిపోతున్నారు.
నార్త్‌లోనే ఇలా
డిసెంబర్ 5న దేశవ్యాప్తంగా ‘పుష్ఫ 2’ (Pushpa 2) విడుదలయ్యింది. సినిమా విడుదల అవ్వగానే దీని చుట్టూ కాంట్రవర్సీలు మొదలయ్యాయి. ఇక మొదటిరోజే మూవీ చూసిన చాలామంది ఇది యావరేజ్‌గా ఉందని కూడా కామెంట్స్ చేశారు. అయినా ‘పుష్ప 2’ థియేట్రికల్ రన్‌ను ఎవరూ ఆపలేకపోయారు. అంతే కాకుండా దీనికి పోటీగా మరే ఇతర సినిమా కూడా విడుదల కాకపోవడంతో ‘పుష్ప 2’కు భారీ అడ్వాంటేజ్‌గా మారింది. తెలుగులో మాత్రమే కాదు.. నార్త్‌లో కూడా ఇదే పరిస్థితి. నార్త్‌లో అయితే పుష్పరాజ్ హవా మామూలుగా లేదు. ఇప్పటికే ఏకంగా హిందీలో మాత్రమే ఈ సినిమాకు రూ.618.5 కోట్లు కలెక్షన్స్ రావడం అంటే మామూలు విషయం కాదు.
Also Read: అబ్బాయ్ కోసం బాబాయ్ దిగుతున్నాడు.. అల్లు అర్జున్ మ్యాటర్ తీస్తాడా..?
హిందీ బాక్సాఫీస్‌పై రూలింగ్
2024లో హిందీలో విడుదలయిన సినిమాల్లో అత్యంత భారీ వసూళ్లు సాధించిన చిత్రాల్లో మొదటి స్థానంలో నిలిచింది ‘స్త్రీ 2’. ఇప్పుడు ‘పుష్ప 2’ ఒక డబ్బింగ్ చిత్రమే అయినా ‘స్త్రీ 2’ కలెక్షన్స్‌ను బీట్ చేయడానికి చాలా దగ్గర్లో ఉంది. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ సంతోషానికి హద్దులు లేవు. వారితో పాటు మేకర్స్ కూడా ఈ విషయంలో హ్యాపీగా ఫీలవుతున్నారు. వారే స్వయంగా ‘పుష్ప 2’ హిందీ కలెక్షన్స్ గురించి స్వయంగా ప్రకటించారు. ‘పుష్ప 2’ హిందీ బాక్సాఫీస్‌ను రూల్ చేస్తోంది. 14 రోజుల్లోనే రూ.618.5 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించి, హిందీ సినిమా చరిత్రలోనే అతిపెద్ద బ్లాక్‌బస్టర్ కావడానికి సిద్ధమయ్యింది’ అంటూ ట్వీట్ చేశారు మేకర్స్.
15 రోజుల్లోనే
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప 2’లో అల్లు అర్జున్‌కు జోడీగా రష్మిక మందనా నటించింది. ఈ సినిమాలో మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ చాలానే ఉన్నాయి. అందుకే ఇలాంటి సినిమాలు ఇష్టపడేవారికి ‘పుష్ఫ 2’ చాలా నచ్చింది. ఈ మూవీకి పూర్తిగా పాజిటివ్ టాక్ రాలేదు. కాస్త మిక్స్‌డ్ టాక్‌తోనే ఈ సినిమా మొదలయ్యింది. అయినా కూడా 14 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1500 కోట్లు సాధించిన మొదటి సినిమాగా ‘పుష్ప 2’ రికార్డ్ క్రియేట్ చేసింది. దేశవ్యాప్తంగా 15 రోజుల్లో ఈ సినిమా రూ.975 కోట్ల కలెక్షన్స్ సాధించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్‌తో పాటు తన ఫ్యాన్స్ కూడా ‘పుష్ప 2’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.
#Pushpa2TheRule is ruling the Hindi Box Office 💥💥
Collects 618.5 CRORES NETT in 14 days and is on the verge of becoming the biggest ever blockbuster in Hindi Cinema ❤🔥
Book your tickets now!
🎟️ https://t.co/tHogUVEOs1#Pushpa2#WildFirePushpaIcon Star @alluarjun… pic.twitter.com/9EM1om2bb4
— Mythri Movie Makers (@MythriOfficial) December 19, 2024