Bigg Boss 9 Telugu : ప్రస్తుతం తెలుగు ప్రజల నోట వినిపిస్తున్న ఒకే ఒక మాట బిగ్ బాస్.. టాప్ రియాల్టీ షో గా ఎనిమిది సీజన్ 2 తెలుగులో పూర్తి చేసుకుంది ఈ షో.. ప్రస్తుతం 9వ సీజన్ ను ప్రసారం చేస్తుంది. ఇప్పటికే 12 వారాలు పూర్తి చేసుకున్న షోలో 13 వారం నామినేషన్స్ హీటెక్కించాయి. హౌస్ లో ఉన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్లలో ఈ వారం ఎవరు బయటకు వెళ్తారు అన్నది ఆసక్తిగా మారింది. మరోవైపు బిగ్ బాస్ ఫైనలిస్ట్ లో ఎవరు ఉంటారు? ఎవరు ఎలిమెంట్ అయ్యి బయటకు వెళ్తారు? అన్నది చర్చనీయాంశంగా మారింది. గతవారం దివ్య అతి తక్కువ ఓటింగ్ తో ఎలిమినేట్ అయింది. ఈవారం హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్తారు అన్నది పక్కన పెడితే.. టాప్ 5 ఫైనలిస్టులోకి ఎవరు చేరుతారు అన్నది సస్పెన్స్ గా మారింది.. ఫైనలిస్ట్ కోసం బిగ్ బాస్ టాస్కులను ఇస్తున్న సంగతి తెలిసిందే. మరి టాప్ 5 లో ఎవరు ఉండబోతున్నారు అన్నది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..
తెలుగు ఆడియన్స్ ఎప్పుడెప్పుడు అని ఎదురుచూసిన రోజు మరి కొద్దిరోజుల్లో రానుంది.. ఈ సీజన్ ఫైనల్ ఎపిసోడ్ వరకు ఎవరు ఉంటారు అని తెలుసుకోవాలని ఆత్రుత కనబరుస్తున్నారు. ప్రస్తుతం హౌస్ లో ఫైనలిస్ట్స్ కోసం కంటెస్టెంట్స్ మధ్య పెద్ద యుద్దాలే జరుగుతున్నాయి. పవన్ తనూజ, సుమన్ శెట్టి, ఈ పోటీ నుంచి ఔట్ అవ్వగా రీతూ చౌదరి, కళ్యాణ్, ఇమాన్యుయల్ ముగ్గురి మధ్య చాలా టఫ్ ఫైట్ జరిగింది. ఇప్పటిదాకా మీరు పడిన కష్టానికి ప్రతిఫలం దక్కే సమయం ఆసన్నమైంది… గొంగళి పురుగు ఎలాంటి దశలను ఎదుర్కొని సీతాకోక చిలుకగా మారుతోంది.. మీరు అనుకున్న గమ్యానికి మీరు చేరుకోవాలని కోరుకుంటున్నాను అని బిగ్ బాస్ అంటారు. ఆ డైలాగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
Also Read: ఓటీటీలోకి వచ్చేసిన రష్మిక రొమాంటిక్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
కళ్యాణ్, రీతూ, ఇమాన్యుయల్ ముగ్గురు పోటీ పడ్డారు. రీతూ చాలా బాగా ఆడింది విజయం సాధించింది… ఇప్పుడు రీతూ కనక మొదటి ఫైనలిస్ట్ గా వెళితే మాత్రం టాప్ 5 లో నిలిచే కంటెస్టెంట్స్ లిస్ట్ మారిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే ఫైనలిస్ట్ టాస్క్ లో తనూజ, ఇమ్మూ, కళ్యాణ్ లు ఉన్నారన్న విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు రీతూ కూడా ఆ లిస్ట్ లోకి చేరినట్లే.. మొత్తానికి నలుగురు కంటెస్టెంట్స్ టాప్ ఫైనలిస్ట్ లోకి చేరుకున్నారు. సుమన్ శెట్టి, సంజన, భరణి ముగ్గురిలో ఎవరో ఒక్కరికి మాత్రమే టాప్ 5 లోకి వెళ్ళే అవకాశం దక్కుతోంది. సుమన్ శెట్టితో పోలిస్తే భరణి అన్నిటాస్కులలో పర్వాలేదని అనిపిస్తున్నాడు. దాంతో ఫైనలిస్ట్ లిస్టులోకి అతను చేరే అవకాశం ఉందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. మరి ఈ ఐదుగురు ఫైనల్ లో ఉంటారా..? ఈవారం ఎవరు హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వస్తారు? వీటన్నిటి పై క్లారిటీ రావాలంటే ఈ వీకెండ్ ఎపిసోడ్ని మిస్ అవ్వకుండా చూడాల్సిందే…