Team India: రెండు తెలుగు రాష్ట్రాల క్రికెట్ అభిమానులకు అదిరిపోయే శుభవార్త అందించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. విశాఖ లోని వైయస్ రాజశేఖర్ రెడ్డి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ( Dr. Y.S. Rajasekhara Reddy ACA-VDCA Cricket Stadium, Visakhapatnam) ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా నాలుగు అంతర్జాతీయ మ్యాచ్ లు జరగనున్నాయి. విశాఖ వేదికగా నాలుగు అంతర్జాతీయ మ్యాచ్ లు నిర్వహించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి షెడ్యూల్ ఫిక్స్ చేసింది. దీంతో తెలుగు రాష్ట్రాల క్రికెట్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఫుల్ జోష్ లో కనిపిస్తున్నారు. ఈ నాలుగు మ్యాచ్ లు చూసేందుకు ఆత్రుతగా ఉన్నట్లు పేర్కొంటున్నారు.
Also Read: Grace Hayden: నగ్నంగా తిరుగుతానంటూ బోల్డ్ కామెంట్స్..చివరి క్షణంలో కాపాడిన రూట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ నగరం విశాఖ వేదికగా నాలుగు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లు జరగనున్నాయి. కేవలం రెండు నెలల వ్యవధిలోనే విశాఖ స్టేడియం 4 అంతర్జాతీయ మ్యాచ్ లకు ఆతిథ్యం ఇవ్వనుంది. డిసెంబర్ 6 అంటే రేపటి రోజున దక్షిణాఫ్రికా వర్సెస్ టీమిండియా ( India vs South Africa, 3rd ODI ) మధ్య మూడవ వన్డే విశాఖలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా జరగనుంది. అలాగే డిసెంబర్ 21వ తేదీన టీమిండియా మహిళల జట్టు వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య టి20 నిర్వహించనున్నారు.
ఇక డిసెంబర్ 23వ తేదీన ఇదే మహిళల టీమిండియా వర్సెస్ శ్రీలంక ( Team India vs Sri Lanka) మధ్య మరో టి20 మ్యాచ్ కూడా జరగనుంది. కొత్త సంవత్సరం అంటే 2026 జనవరి 28వ తేదీన న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా ( New Zealand vs Team India) మధ్య టి20 మ్యాచ్ కూడా విశాఖలోని వైయస్ రాజశేఖర్ రెడ్డి అంతర్జాతీయ స్టేడియంలో జరగనుంది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ ఖరారైంది. అయితే రెండు నెలల వ్యవధిలోనే వైయస్ రాజశేఖర్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో వరుసగా అంతర్జాతీయ మ్యాచ్ లు ఉన్న నేపథ్యంలో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.
Also Read: IPL 2026: వీడు అంత మొనగాడా..ఒక్క మ్యాచ్ కు రూ.50 ఇవ్వాలట, 4 మ్యాచ్ లే ఆడతాడట !
టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య రేపు విశాఖ వేదికగా మూడవ వన్డే జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టుకు సిరీస్ దక్కనుంది. ఇప్పటికే విశాఖ వన్డే కోసం టీమిండియాతో పాటు దక్షిణాఫ్రికా జట్లు వైజాగ్ చేరుకున్నాయి. ఈ మేరకు గ్రాండ్ వెల్కమ్ పలికింది ఏపీ సర్కార్. చాలా రోజుల తర్వాత విశాఖ వేదికగా టీమిండియా మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో టికెట్లు అని హట్ కేకుల అమ్ముడుపోయాయి. ఇప్పటికే ఈ రెండు జట్ల మధ్య రెండు మ్యాచ్లు పూర్తయ్యాయి. ఇందులో మొదటి మ్యాచ్ లో టీమిండియా గెలవక రెండవ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. రేపు జరిగే మ్యాచ్ లో గెలిచిన జట్టు సిరీస్ కైవసం చేసుకుంటుంది.