BigTV English
Advertisement

Bapatla YSRCP: బాపట్లలో వైసీపీకి దిక్కెవరు?

Bapatla YSRCP: బాపట్లలో వైసీపీకి దిక్కెవరు?

Bapatla YSRCP: బాపట్ల జిల్లా వైసీపీలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ఉంది నాయకుల పరిస్థితి.. ప్రస్తుతం అధినేత పర్యటనలు ప్రభుత్వంపై విమర్శలతో వైసీపీ నేతలు అనేక ప్రాంతాల్లో యాక్టివ్‌గా ముందుకు వెళ్తున్నారు కానీ .. ఆ జిల్లాలో అంది వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని పార్టీ శ్రేణులను ముందుండి నడిపించే వారు కరువయ్యారు.. దొరికిన అవకాశాన్ని కూడా వాడుకోలేకపోతున్నారని, క్యాడర్‌కు మార్గనిర్దేశం కరువైందని సొంత పార్టీ కార్యకర్తలే వాపోతున్నారు. గతంలో ఎంపీతో పాటు దాదాపు అన్ని స్థానాలను తన ఖాతాలో వేసుకున్న బాపట్ల జిల్లా వైసీపీకి ఈ పరిస్థితి ఎందుకు దాపురించింది? ప్రస్తుతం ఎంపీనే కాదు ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా పోవడమే కారణమా?


గుంటూరు జిల్లాలో పార్టీని పట్టాలు ఎక్కించే ప్రయత్నాలు

వైసీసీకి ఉమ్మడి గుంటూరు జిల్లాలో గత వైభవాన్ని తీసుకుని రావటానికి ఇటు పల్నాడు జిల్లాలోని నేతలు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.. అదే విధంగా గుంటూరు జిల్లాలో సైతం పార్టీని పట్టాలెక్కించడానికి ఏదో ఒక కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు చేపడుతున్న పరిస్థితి ఉంది.. ఈ మధ్యకాలంలో వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ తెనాలి, పల్నాడు పర్యటనలు, అప్పట్లో అధికార, పత్రిపక్షాల మధ్య మాటల యుద్దాలతో రాజకీయ వేడి రాజుకుంది.. అయితే ఆ పర్యటనల సందర్భంగా ఉద్రిక్తతలు ఏర్పడటం, అవి వైసీపీకి ఒకింత మైనస్‌గా మారినా.. స్థానిక నేతలు వాటిని సమర్ధంగా తిప్పికొట్టలేకపోయారన్న అభిప్రాయం ఉంది. ఆ క్రమంలో రెండు జిల్లాల వైసీపీలో కొన్ని కీలకమైనటువంటి మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయన్న టాక్ వినిపిస్తోంది


బాపట్ల జిల్లాలో అనామకంగా తయారైనా వైసీపీ పరిస్థితి

కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంలో వైసీపీ చేపట్టిన వెన్నుపోటు దినోత్సవం ఆందోళనల్లో గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఆ పార్టీ నేతలు బానే హడావుడి చేశారు.. అయితే ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి వేరుపడిన ప్రస్తుత బాపట్ల జిల్లాలో వైసీపీ పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగా తయారైందంటున్నారు.. అసలు బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గంలో ఇన్చార్జిలు కానీ, గతంలో అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన నేతలు గాని ఎక్కడా కూడా ఏ కార్యక్రమం చేపట్ట లేదు… కనీసం పార్టీ పిలుపునిస్తున్న కార్యక్రమాలను కూడా పట్టించుకోకపోతుండటంతో జిల్లాలో కేడర్ అంతా పూర్తిగా ఢీలా పడిపోయిందంట.. ముఖ్యంగా బాపట్ల పట్టణంలో వైసీపీకి స్ట్రాంగ్ క్యాడర్ ఉండేది. ఎన్నికలకు ముందు వైసీపీకి సంబంధించి ఉమ్మడి గుంటూరు జిల్లాలో గెలుపోవటములపై అనుమానాలు వ్యక్తమైనా.. బాపట్లలో మాత్రం తాము ఖచ్చితంగా గెలుస్తామని ఆ పార్టీ శ్రేణులు విపరీతమైన కాన్ఫిడెన్స్ ప్రదర్శించాయి.. పలువురు బాపట్ల జిల్లా నేతలు తాము క్లీన్ స్వీప్ చేయబోతున్నామని.. బల్లగుద్ది చెప్తూ బెట్టింగులు కూడా కాశారు.. తీరా చూస్తే సిట్టింగు ఎంపీ సీటుతో సహా, ఒక్క ఎమ్మెల్యే స్థానాన్ని కూడా జగన్ పార్టీ గెలుచుకోలేక పోయింది

బాపట్ల బీచ్‌లో మత్సకారుల నిరసనలు

వైసీపీ సీనియర్ నాయకుడు మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలతో అంటీముట్టనట్లు ఉంటూ.. అసలు పార్టీ పిలుపు నిస్తున్న కార్యక్రమాలపై దృష్టి పెట్టడం లేదు.. అప్పుడప్పుడూ కొన్ని కార్యక్రమాల్లో గెస్ట్ అప్పీరియన్స్ ఇవ్వడం తప్పించి జిల్లాలో పార్టీని ఆక్టివ్ చేయడానికి ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్న పరిస్థితులు అయితే కనిపించడం లేదు.. ఈ మధ్య కాలంలోనే బాపట్ల బీచ్ లో చాపల వేటకు వెళ్లే వాళ్లంతా నిరసన కార్యక్రమాలు చేపట్టి అనేకమంది ప్రజాప్రతినిధులపై ఆరోపణలు చేశారు.. వారి ఆందోళనల్లో గాని తర్వాత గాని మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి ఎక్కడా రియాక్ట్ అవ్వలేదు. దాంతో జిల్లాలో కీలకమైన మత్స్య సామాజికవర్గంతో పాటు సొంత పార్టీ క్యాడర్ సైతం ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోందంట.

Also Read: ఖానాపురంలో దారుణం.. కూర వేయలేదని మహిళపై గొడ్డలితో దాడి

మైలేజ్ వచ్చే అవకాశాన్ని చేజార్చుకున్న కోన రఘుపతి

మత్స్యకారుల చేపట్టిన నిరసనల్లో వైసీపీ పెద్దన్న పాత్ర పోషించి.. వారి పక్షాన పోరాటం చేసి ఉంటే నియోజకవర్గంలో కొంతమేర మైలేజ్ వచ్చేదని.. ఆ ఇష్యూతో జిల్లా కూటమి ఎమ్మెల్యేలను అంతోఇంతో ఇరకాటంలోకి నెట్టే అవకాశమున్నా.. కూన రఘుపతి దాన్ని పట్టించుకోకపోవడంతో ఆయనపై వైసీపీ శ్రేణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఇదే జిల్లాకు చెందిన బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ కేసుల్లో ఇరుక్కుని జిల్లా పార్టీని పట్టించుకోకపోవడమే మానేశారు. టీడీపీలో చేరి వైసీసీలో చేరిన మరో సీనియర్ నాయకుడు చీరాల మాజీ ఎమ్మెల్యే కరణం బలరాం ఆ సెగ్మెంట్‌కే దూరమయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో బాపట్ల జిల్లాలో వైసీపీ పరిస్థితి చుక్కాని లేని నావలా మారిందంటున్నారు.

Story By Vamshi Krishna, Bigtv

Related News

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Jagan Youth Politics: స్టూడెంట్ వింగ్, యూత్ వింగ్.. జగన్ యూత్ పాలిటిక్స్

Big Stories

×