BigTV English
Advertisement

Afghan Boy: విమానం ల్యాండింగ్ గేర్‌‌‌లో 13 ఏళ్ల బాలుడు.. కాబూల్ నుంచి ఢిల్లీకి ట్రావెల్

Afghan Boy: విమానం ల్యాండింగ్ గేర్‌‌‌లో 13 ఏళ్ల బాలుడు.. కాబూల్ నుంచి ఢిల్లీకి ట్రావెల్

Afghan Boy: సాహసం చేయాలంటే చాలా దైర్యం ఉండాలి. ఏ మాత్రం తేడా వచ్చినా ఈ లోకాన్ని వదిలేయాల్సిందే. 13 ఏళ్ల బాలుడు ఎలాంటి సేఫ్టీ లేకుండా రెండు గంటలపాటు విమానం టైర్లు పట్టుకుని గాల్లో విహరించాడు. అత్యంత ప్రమాదకరమైన స్థితిలో ప్రయాణించిన బాలుడు సురక్షితంగా కిందకు దిగాడు. ఈ ఘటనలో ఢిల్లీలో వెలుగుచూసింది. అసలు విషయమేంటి?


ఆఫ్ఘ‌నిస్థాన్‌లో కందూజ్‌ టౌన్‌కి చెందినవాడు ఈ బాలుడు. కాబూల్ ఎయిర్‌పోర్టులో భద్రతా సిబ్బంది కళ్లు గప్పి లోపలికి ఎంట్రీ ఇచ్చాడు. కాబూల్ నుంచి ఢిల్లీకి వెళ్లేందుకు రెడీగా ఉన్న కేఏఎం ఎయిర్‌లైన్స్ విమానం నెంబరు RQ-4401 వద్దకు వచ్చేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా విమానం టైర్ల మీదుగా ఎక్కేశాడు. చివరకు ల్యాండింగ్ గేర్ కంపార్ట్‌మెంట్‌లో దాక్కున్నాడు.

ఆదివారం ఉదయం 11 గంటలకు ఆ విమానం ఢిల్లీలో ల్యాండ్ అయ్యింది. కాబూల్ నుంచి ఢిల్లీకి ట్రావెల్ కేవలం రెండు గంటలు మాత్రమే. ఈ రెండు గంటలు ఆకాశంలో విహారం చేశాడు ఆ బాలుడు. ప్రయాణికులంతా దిగిపోయారు. ఆ తర్వాత బాలుడు ల్యాండింగ్ గేర్ బాక్సు నుంచి దిగి ఎయిర్‌పోర్టు పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్నాడు.


బాలుడ్ని భద్రతా సిబ్బంది గమనించి పట్టుకుని విచారించారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సాహసం చేయాలన్న ఆలోచనతో ఈ విధంగా చేశానని ఆ బాలుడు చెప్పడంతో అవాక్కయ్యారు అధికారులు. అప్రమత్తమైన సిబ్బంది విమానంలో ప్రతీ అంగుళాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. విమానంలో బాలుడు దాక్కున్న చోట ఎరుపు రంగులో చిన్న స్పీకర్ కనిపించింది.

ALSO READ: ఏసీ కోచ్‌లో దుప్పట్లు దొంగతనం చేసి పట్టుబడిన రిచ్ ఫ్యామిలీ వ్యక్తి

ఎలాంటి విద్రోహ చర్యలకు అవకాశం లేదని నిర్ధారించుకున్నారు అధికారులు. ఆ తర్వాత విమానాన్ని తిరిగి ప్రయాణానికి అనుమతించారు ఎయిర్ పోర్టు అధికారులు. అదే రోజు రాత్రి ఆ బాలుడ్ని ఆ విమానంలో కాబూల్‌కు తరలించారు. ఈ విషయాన్ని అధికారులు అధికారికంగా వెల్లడించారు. ఆ బాలుడు విమానంలో ఉన్న ప్రమాదాలను పూర్తిగా అర్థం చేసుకోకుండా ఉత్సాహంతో ప్రవేశించినట్టు తేలింది.

Related News

IRCTC Packages: రామేశ్వరం నుంచి అయోధ్య వరకు.. భారత గౌరవ్ రైల్లో శ్రీ రామాయణ యాత్ర

Shocking Video: ఎక్కువ ధర ఎందుకన్న ప్రయాణీకుడు, చితక బాదిన క్యాటరింగ్ సిబ్బంది, వీడియో వైరల్!

Vande Bharat Trains: నాలుగు వందే భారత్ రైళ్లను ప్రారంభిస్తున్న ప్రధాని మోదీ.. తెలుగు రాష్ట్రాలకు?

Nashik Tour: నాసిక్ టూర్.. ఈ ప్లేస్‌లు జీవితంలో ఒక్కసారైనా చూడాలి మావా !

Sabarimala Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల నుంచి 60 ప్రత్యేక రైళ్లు!

Bangalore Tour: బెంగళూరు టూర్.. ఈ ప్రదేశాలు ఒక్కసారైనా చూడాల్సిందే !

Amazon Pay Offers: రూ.3వేలలోపే గోవా ట్రిప్, బుకింగ్‌లు స్టార్ట్.. ఈ ఆఫర్ మిస్ అయితే మళ్లీ రాదు..

Vande Bharat: ఇక ఆ వందే భారత్ రైలు నరసాపురం వరకు పొడిగింపు, ప్రయాణికులకు పండగే!

Big Stories

×