Bigg Boss 18: దాదాపు ప్రతీ భాషలో బిగ్ బాస్ రియాలిటీ షో అనేది ఒకేసారి ప్రారంభమయ్యింది. అందులో ముందుగా తెలుగు బిగ్ బాస్ ఫినాలే వరకు చేరుకుంది. తమిళ బిగ్ బాస్ సగం వరకు వచ్చింది. హిందీ బిగ్ బాస్ కూడా దాదాపు చివరి దశకు చేరుకుంది. హిందిలో బిగ్ బాస్ అనేది ప్రారంభం అయినప్పటి నుండి దీని చుట్టూ ఎన్నో కాంట్రవర్సీలు తిరుగుతూనే ఉన్నాయి. పైగా గత కొన్నిరోజులుగా హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సల్మాన్ ఖాన్ పర్సనల్ లైఫ్ గురించే వార్తలు నడుస్తున్నాయి. అందుకే బిగ్ బాస్ 18 ఫినాలేకు సంబంధించి మేకర్స్ ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఫైనల్ ఎపిసోడ్‌లో మరొక రెండు వారాల పాటు పోస్ట్‌పోన్ చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.
పోస్ట్‌పోన్
ప్రస్తుతం బిగ్ బాస్ 18 ప్రారంభమయ్యి కొన్నిరోజులే అవుతోంది. ఇప్పటికే ఆ హౌస్‌లో జరిగే గొడవల గురించి బిగ్ బాస్ ప్రేక్షకులు చర్చించుకుంటూ ఉంటారు. సోషల్ మీడియాలో కూడా కంటెస్టెంట్స్ పేర్లు ట్రెండ్ అవుతుంటాయి. రోజురోజుకీ ఈ షో చూసే వ్యూయర్స్ కూడా పెరుగుతున్నారు. ఓటింగ్ కూడా పోటాపోటీగా జరుగుతోంది. అప్పుడే బిగ్ బాస్ 18 ఫైనల్స్ గురించి సోషల్ మీడియాలో వార్తలు మొదలయ్యాయి. అసలైతే లెక్క ప్రకారం బిగ్ బాస్ 18 ఫైనల్స్ జనవరిలో జరగాలి. కానీ పలు కారణాల వల్ల ఫినాలే ఎపిసోడ్ దాదాపు నెల రోజులు పోస్ట్‌పోన్ కానుందని బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read: ఈ ఏడుగురి విన్నర్స్ జాబితాలోకి చేరేది ఎవరు.?
మరో రెండు వారాలు
బిగ్ బాస్ 18 (Bigg Boss 18) ఫినాలేకు ముందుగా జనవరి 19న ముహూర్తం ఫిక్స్ చేశారు. కానీ ఆ తేదీకి ఫైనల్ ఎపిసోడ్ ప్రసారం కావడం ఇప్పుడు కష్టమని మేకర్స్ భావిస్తున్నారట. దీనికి తగిన కారణాలు ఏంటో బయటికి రాలేదు కానీ కచ్చితంగా ఫినాలే ఎపిసోడ్ మాత్రం మరో రెండు వారాలు అయినా వాయిదా పడేలా ఉందని సమాచారం. ముందుగా జనవరి 19న ఫైనల్స్ అనుకున్నా కూడా ఇప్పుడు ఫిబ్రవరీ 8 లేదా 15కు పోస్ట్‌పోన్ అయినట్టు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఇంకా రెండు వారాలు ఎక్కువగా కంటెస్టెంట్స్.. ఆ బిగ్ బాస్ హౌస్‌లోనే ఉండాల్సిన పరిస్థితి రానుందని అర్థమవుతోంది. మరి దీనికి తగిన కారణాలు ఏంటి, నిజంగానే ఫైనల్స్ పోస్ట్‌పోన్ అవ్వనున్నాయా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.
హాట్ టాపిక్
బిగ్ బాస్18 మొదలయినప్పటి నుండి ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఇటీవల కంటెస్టెంట్స్ మధ్య పెద్ద గొడవ కూడా జరిగి కాలర్ పట్టుకొని కొట్టుకునే వరకు వెళ్లారు. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పైగా బిగ్ బాస్ 18 మొదలయిన కొన్నిరోజులకే సల్మాన్ ఖాన్ (Salman Khan)కు హత్యా బెదిరింపులు వచ్చాయి. ఒక గ్యాంగ్‌స్టర్‌కు తను టార్గెట్ కూడా అయ్యాడు. దీంతో బిగ్ బాస్ 18కు ఫుల్ సెక్యూరిటీతో వచ్చాడు సల్మాన్ ఖాన్. అలా కూడా కొన్నిరోజుల పాటు బిగ్ బాస్ 18 అనేది వార్తల్లో నిలిచింది.