E-Paper
Advertisement

CM Revanth Reddy: సమ్మక్క-సారక్క మనుషుల్లో దేవుళ్లు.. వారి పోరాటమే మన చరిత్ర: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: సమ్మక్క-సారక్క మనుషుల్లో దేవుళ్లు.. వారి పోరాటమే మన చరిత్ర: సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

CM Revanth Reddy: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన కుంభమేళా అయిన మేడారం మహా జాతర సమీపిస్తున్న వేళ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. వనదేవతలు సమ్మక్క-సారలమ్మల గొప్పతనాన్ని, వారి పోరాట స్ఫూర్తిని కొనియాడుతూ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఒక ఉద్వేగభరితమైన పోస్ట్ చేశారు. మేడారం అభివృద్ధి పనులను ‘ప్రజా ప్రభుత్వం’ చేపట్టిన దైవ కార్యంగా ఆయన అభివర్ణించారు.

చరిత్రలో అణగారిన వర్గాల కోసం, పేద ప్రజల కోసం పోరాడిన వారే నిజమైన దేవుళ్ళని సీఎం పేర్కొన్నారు. బలహీనుల పక్షాన నిలిచి ప్రాణత్యాగాలు చేసిన వీరులే తెలంగాణ ప్రజల పాలిట దైవాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వారి సంస్కృతి మన ఆత్మగౌరవానికి, అస్తిత్వానికి ప్రతీక అని, వారి పోరాటలే తెలంగాణ చరిత్రకు సాక్ష్యాలని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. సమ్మక్క-సారక్కల త్యాగాలు తరతరాలకు స్ఫూర్తినిస్తాయని కొనియాడారు.

Advertisement

సమ్మక్క-సారక్కలను “మనుషుల్లో దేవుళ్లు”గా అభివర్ణించిన సీఎం.. వారి గద్దెలను ఆధునీకరించడం తమ ప్రభుత్వ బాధ్యతగా పేర్కొన్నారు. ఆ అమ్మల చరిత్రను, వారు చూపిన తెగువను మరింత గొప్పగా రేపటి తరాలకు అందించాలనేది తమ ‘దైవ సంకల్పం’ అని తెలిపారు. మేడారం క్షేత్రంలో ప్రజా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను, ఆధునీకరణను ఒక సత్కార్యంగా భావిస్తున్నట్లు వెల్లడించారు. జాతర ఏర్పాట్లను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పకనే చెప్పారు.

Advertisement

Read Also: Bhatti Vikramarka: మహాలక్ష్మితో లాభాల్లోకి ఆర్టీసీ: డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×