BigTV English

Shobha Shetty In BB House:తగ్గని హవా.. మొన్న తెలుగు, నేడు కన్నడ.. శోభ క్రేజ్ మామూలుగా లేదుగా..?

Shobha Shetty In BB House:తగ్గని హవా.. మొన్న తెలుగు, నేడు కన్నడ.. శోభ క్రేజ్ మామూలుగా లేదుగా..?

Shobha Shetty In BB House :బిగ్ బాస్ (Bigg Boss).. బిగ్ బ్రదర్ పేరిట పాశ్చాత్య దేశాలలో ప్రారంభమైన ఈ రియాల్టీ షో హిందీలో తొలిసారి బిగ్ బాస్ పేరిట ప్రారంభమైంది. ప్రస్తుతం అక్కడ 18వ సీజన్ ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. ఇక హిందీలోనే కాకుండా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో కూడా ఈ షో నడుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం తెలుగులో ఎనిమిదవ సీజన్ ప్రారంభమైంది. ఇక నిన్నటి వారం ఫ్యామిలీ వీక్ చాలా ఎమోషనల్ గా సాగింది. అయితే ఇప్పుడు ఈ షో కూడా చివరి దశకు చేరుకున్న విషయం తెలిసిందే. ఇకపోతే బిగ్ బాస్ కన్నడలో కూడా ప్రస్తుతం 11వ సీజన్ నడుస్తోంది. అయితే ఈ సీజన్ లో వైల్డ్ కార్డు ద్వారా కొంతమందిని హౌస్ లోకి పంపించారు బిగ్ బాస్ నిర్వాహకులు.


బిగ్ బాస్ కంటే కార్తీకదీపం సీరియల్ తోనే గుర్తింపు..

ఇక వైల్డ్ కార్డు ద్వారా పంపించిన లిస్టులో తెలుగు బుల్లితెర నటి అలాగే తెలుగు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ శోభా శెట్టి (Shobha Shetty) కూడా ఉండడం గమనార్హం. ఇప్పటికే తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ తో భారీ గుర్తింపు తెచ్చుకున్న ఈమె, అక్కడ తన ఆట తీరుతో, మాట తీరుతో భారీ పాపులారిటీ అందుకుంది. అయితే దీనికంటే ముందు కార్తీకదీపం సీరియల్ తో రెండో తెలుగు రాష్ట్రాలలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ అందుకుంది ఈ ముందుగుమ్మ. ఇకపోతే శోభా శెట్టిగా కంటే కూడా మోనితగానే అందరిలో ఎక్కువ గుర్తింపు అందుకుంది. అంతేకాదు తన క్యారెక్టర్ తో అందరిని ఆకట్టుకుంది శోభా శెట్టి.


కన్నడ బిగ్ బాస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ..

ఇకపోతే తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో టాస్క్లలో ఒకలా, నామినేషన్స్ వచ్చేటప్పటికి ఇంకోలా ప్రవర్తిస్తూ సైకోలాగా బిహేవ్ చేసింది. మొత్తానికి నెగెటివిటీని మూటగట్టుకుంది ఈ ముద్దుగుమ్మ అంతేకాదు ఆ నెగిటివిటీ కారణంగా కార్తీకదీపం సీరియల్ 2 లో కూడా అవకాశాన్ని కోల్పోయింది. ఇక ఇప్పుడు కన్నడ బిగ్ బాస్ సీజన్ 11 లోకి వైల్డ్ కార్డు ద్వారా అడుగు పెట్టింది. మరి ఇక్కడ సౌమ్యంగానే ప్రవర్తిస్తుందా లేక వైల్డ్ గా ప్రవర్తించి మధ్యలోనే వెళ్లిపోతుందా అన్నది చూడాలి మొత్తానికైతే చివరి వరకు ఉండి కప్పు గెలుచుకోవాలని అభిమానులు అయితే కోరుకుంటున్నారు. మరోవైపు కన్నడ బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చి, తాజాగా హౌస్ లోకి అడుగుపెట్టిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ మారుతున్నాయి.

తగ్గని శోభాశెట్టి క్రేజ్..

ఒక రకంగా చెప్పాలి అంటే.. నెగిటివిటీ ఏర్పడినా సరే ఈమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు అనడంలో సందేహం లేదు. తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 లోకి అడుగుపెట్టి, తన ఆటతో అందరిని మెప్పించిన ఈమె..తన మాటలతోనే నెగిటివిటీ ఏర్పరుచుకుంది. ఇప్పుడు హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సీరియల్స్ లో అవకాశాలు లేకపోవడంతో బట్టల వ్యాపారం మొదలుపెట్టినట్లు వార్తలు వినిపించాయి. కానీ ఎట్టకేలకు కన్నడ బిగ్ బాస్ లోకి రావడంతో ఈమె క్రేజ్ మామూలుగా లేదు అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×