Kantara 2: ఒకప్పుడు కన్నడ ఇండస్ట్రీ గురించి తెలుగువారికి అంతగా తెలిసింది లేదు. కన్నడ సినిమాలు తెలుగులో డబ్ అవ్వడం కూడా చాలా కష్టం.కానీ , ఒక్క సినిమా కన్నడ ఇండస్ట్రీని ఒక్క తెలుగుకు మాత్రమే కాదు దేశం మొత్తానికి పరిచయం చేసింది. అదే కెజిఎఫ్. ఈ సినిమా తరువాత అందరూ కన్నడ ఇండస్ట్రీ వైపు చూడడం మొదలుపెట్టారు. ఇక ఈ సినిమా తరువాత కన్నడ ఇండస్ట్రీకి మరింత గుర్తింపు తెచ్చిన సినిమా కాంతార.
కన్నడ హీరో రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కూడా కెజిఎఫ్ మేకర్స్ నే నిర్మించారు. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం కాంతారకు ప్రీక్వెల్ రానుంది. కాంతార లో చూపించిన కథకు ముందు ఏం జరిగింది అనేది.. ఈ ప్రీక్వెల్ లో చూపించబోతున్నారు.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. నిన్ననే ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అక్టోబర్ 2, 2025 న ఈ చాప్టర్ 1 ను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. మొదటి పార్ట్ హిట్ అవ్వడంతో ఈ రెండవ పార్ట్ పై ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తుందా అని ప్రేక్షకులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
ఇక ఈ సినిమాకు పోటీగా ఇంకో సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. అది కూడా చిన్న సినిమా ఏమి కాదు. అదే దళపతి69. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న చివరి చిత్రం. హెచ్ వినోత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ సరసన పూజ హెగ్డే నటిస్తుండగా .. శివన్న, మమితా బైజు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా .. తెలుగులో బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతోందని అంటున్నారు.
ఇక ఈ సినిమాను కూడా అక్టోబర్ 2, 2025 రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారని సమాచారం. రెండు సినిమాలపైన ప్రేక్షకులు అంచనాలను పెట్టుకున్నారు. అయితే.. కాంతారతో దళపతి పోటీ అంత మంచిది కాదేమో అనిపిస్తుంది. విజయ్ కు గత కొన్నేళ్లుగా విజయమే దక్కడం లేదు. విజయ్ సైతం.. ప్రేక్షకులకు మంచి హిట్ ఇచ్చి.. సినిమాలకు గుడ్ బై చెప్పాలనుకుంటున్నాడు. అలాంటి ఆలోచన ఉంటే.. కాంతారతో పోటీకి వెళితే అది జరగదని కొందరు అభిప్రాయపడుతున్నారు. అది కూడా రీమేక్ అని తెలిస్తే తెలుగు ప్రేక్షకులు చూడడం కూడా తగ్గిస్తారు.
ఇక ఈ సినిమా రిలీజ్ చేయాలనుకుంటే.. ఎలాంటి పోటీ లేకుండా మంచి సమయం చూసి రిలీజ్ చేస్తే కొంతవరకు వర్క్ అవుట్ అవుతుందేమో అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇందులో ఎంత నిజముంది అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.