Vishwak Sen: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది దర్శకులకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని కోరిక బలంగా ఉంటుంది. అయితే ఈ కోరిక కూడా చాలామంది యంగ్ ఫిలిం మేకర్స్ కు తీరింది అని చెప్పాలి. ఈ రీసెంట్ టైమ్స్ లో పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.. కానీ రీయంట్రి తర్వాత కేవలం మూడు సినిమాలు మాత్రమే బాక్స్ ఆఫీస్ వద్ద రిలీజ్ అయ్యాయి. ఈ మూడు సినిమాలు విషయంలో త్రివిక్రమ్ ఇన్వాల్వ్మెంట్ ఉండటం వల్లనే ఇవన్నీ త్వరగా బయటకు వచ్చాయి. లేకుంటే పవన్ కళ్యాణ్ అన్నీ సగం సగం పనులే. ఇప్పటికీ చాలా సినిమాలు మధ్యలో అలానే ఉండిపోయాయి. పవన్ కళ్యాణ్ కున్న బిజీ షెడ్యూల్ అన్న అవి ఎప్పుడు మొదలవుతాయో తెలియని పరిస్థితికి వచ్చేసాయి. ఓజి సినిమా మాత్రం త్వరలో ప్రేక్షకులు ముందుకు రానుంది. ఓజి సినిమా విషయంలో కూడా త్రివిక్రమ్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చాలామందికి తెలిసిన విషయమే.
Also Read : RAPO22 Movie : అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది, పూజా కార్యక్రమం అప్పుడే
ఇకపోతే పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాకు దర్శకత్వం వహించాడు సాగర్ కే చంద్ర. ఈ సినిమాతో అద్భుతమైన గుర్తింపును సాధించుకున్నాడు. వాస్తవానికి సాగర కే చంద్ర కంటే భీమ్లా నాయక్ సినిమా విషయంలో ఎక్కువ పేరు త్రివిక్రమ్ కి వచ్చింది. దీనికి కారణం త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే మరియు డైలాగ్స్ అందించడం. ఇకపోతే అయ్యారే సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు సాగర్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత నారా రోహిత్ శ్రీ విష్ణు ప్రధాన పాత్రలో నటించిన అప్పట్లో ఒకడు ఉండేవాడు సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయం సాధించింది. ఇప్పటికి చూసినా కూడా ఈ సినిమా మంచి ఫీల్ క్రియేట్ చేస్తుంది. ఇక ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ సాయి హీరోగా సినిమాను చేస్తున్నాడు సాగర్.
Also Read : Vishwak Sen on Allu Arjun: విశ్వక్సేన్ అల్లు అర్జున్ ను ఉద్దేశిస్తూ ఆ మాటలు మాట్లాడాడా.?
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం విశ్వక్సేన్ సాగర కే చంద్ర సినిమా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా పూర్తిగా తెలంగాణ నేపథ్యంలో జరగనున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాను సైన్ సినిమాస్ నిర్మించబోతున్నట్లు సమాచారం. అయితే దీని గురించి అధికారకు ప్రకటన త్వరలో రావాల్సి ఉంది. ఒక బెల్లంకొండ శ్రీనివాస్ సాయి హీరోగా చేస్తున్న సినిమా మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ లాంటి హీరోని కూడా చాలా సక్సెస్ఫుల్ గా డీల్ చేశాడు సాగర్. బాక్సాఫీస్ వద్ద భీమ్లా నాయక్ సినిమా అద్భుతమైన ఘనవిజయం సాధించింది. అప్పుడు టికెట్స్ రేట్స్ వలన సినిమా వర్కౌట్ కాలేదు కాని మామూలుగా అయితే మంచి కలెక్షన్స్ రాబట్టేది. తనకు ప్రభుత్వం అనుకూలంలో లేనప్పుడు వరుసగా సినిమాలు రిలీజ్ చేసిన పవన్ కళ్యాణ్, తన అనుకూల ప్రభుత్వంలో మాత్రం ఇప్పటివరకు ఒక సినిమా కూడా రిలీజ్ చేయలేదు.