Bigg Boss 9:ప్రపంచవ్యాప్తంగా భారీ పాపులారిటీ సంపాదించుకున్న రియాల్టీ షోలలో బిగ్ బాస్ ప్రథమ స్థానంలో ఉంటుంది. పాశ్చాత్య దేశాలలో ‘బిగ్ బ్రదర్’ గా ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని హిందీలో ‘బిగ్ బాస్’ పేరిట ప్రారంభించారు. క్రమంగా ఇది అన్ని రాష్ట్రాలకు పాకింది. అలా ఇప్పుడు ప్రతి భాష ఇండస్ట్రీలో కూడా ఈ రియాల్టీ షో నడుస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే వివిధ భాషలలో ప్రసారమవుతూ అన్ని భాషల ప్రేక్షకులను అలరిస్తున్న ఈ షో ఇప్పుడు తెలుగులో 9వ సీజన్ కి సిద్ధం అవుతోంది. ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోలో భారీ ఎత్తున సెట్ ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాదు ఊహించని రీతిలో ఈ సీజన్ ఉంటుందని చెప్పుకొచ్చారు కూడా.
సామాన్యులకు బంపర్ ఆఫర్..
దీనికి తోడు “ఈసారి చదరంగం కాదు రణరంగం” అంటూ హోస్ట్ నాగార్జున (Nagarjuna)పంచ్ డైలాగ్ కొత్త సీజన్ పై అంచనాలు పెంచేసారు. అటు కంటెస్టెంట్ ఎంపిక ప్రక్రియ కూడా శరవేగంగా జరుగుతోంది. సాధారణంగా బిగ్ బాస్ షో అంటేనే సెలబ్రిటీల షో అనే టాక్ నడుస్తోంది. బుల్లితెర ప్రముఖులు, యూట్యూబర్ లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అలాగే కాస్తో కూస్తో పేరున్న సినిమా సెలబ్రిటీలనే ఇందులోకి కంటెస్టెంట్స్ గా తీసుకుంటున్నారు. గతంలో కొన్నిసార్లు సామాన్యులను తీసుకువచ్చినా.. పెద్దగా వర్కౌట్ కాలేదు. అయితే ఇప్పుడు బిగ్ బాస్ టీం మరోసారి సామాన్య ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. అందుకే చాలామంది సోషల్ మీడియా ద్వారా బిగ్ బాస్ లోకి వెళ్లడానికి సామాన్యులు కూడా ప్రయత్నం చేస్తున్నారు.
ఒక్క ఛాన్స్ ఇస్తే గుండెల్లో పెట్టుకుంటా – ఎంట్రీ కోసం మహిళ తంటాలు..
అందులో భాగంగానే కొంతమంది నిరాహార దీక్షలు చేస్తుంటే.. మరికొంతమంది సోషల్ మీడియా ద్వారా చిత్ర విచిత్రమైన వీడియోలతో రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇంకొంతమంది సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు కూడా పెడుతున్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఒక మహిళ తనను బిగ్ బాస్ హౌస్ లోకి పంపాలి అంటూ వేడుకుంటున్న ఇన్స్టాగ్రామ్ వీడియో ఒకటి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. “నాగార్జున గారు నన్ను బిగ్ బాస్ హౌస్ లోకి పంపండి. ఒక్క ఛాన్స్ ఇస్తే మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను. అద్భుతమైన టీ, కాఫీ ఇస్తాను. మీకే కాదు అందరికీ మంచి ఛాయ్ పెట్టి, రోటి పచ్చళ్లతో మంచి భోజనం చేసి పెడతాను. ఒక్క అవకాశం ఇస్తే జీవితాంతం రుణపడి ఉంటాను” అంటూ ఆ వీడియో షేర్ చేసింది మహిళ.
సదరు మహిళా వీడియోపై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్..
ఇక ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. ఇక వంట వండడానికి హౌస్ కి వెళ్లడం ఎందుకు.. నువ్వే ఒక హోటల్ పెట్టుకో.. గౌరవంతో పాటు డబ్బులు కూడా వస్తాయంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది నీ ప్రయత్నం బాగుంది.. మరి ఈ వీడియో నాగ్ వరకూ వెళ్తుందా.. వెళ్తే నీ మాటలకు ఆయన కరుణిస్తారా అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు.
ALSO READ:HHVM: హరిహర వీరమల్లు చిత్రంలో కనిపించని సెలబ్రిటీస్ వీరే..!