E-Paper
Advertisement

Bigg Boss 9 : నాగబాబు చెప్పిన భరణి ఫ్లాష్ ప్యాక్, షాక్ అయిన హోస్ట్ నాగ్ 

Bigg Boss 9 : నాగబాబు చెప్పిన భరణి ఫ్లాష్ ప్యాక్, షాక్ అయిన హోస్ట్ నాగ్ 
Advertisement

Bigg Boss 9 : బిగ్ బాస్ హౌస్ లో భరణి కంటెస్టెంట్ గా ఉన్న సంగతి తెలిసిందే. భరణి మొదటి రెండు వారాలు గేమ్ చాలా బాగా ఆడారు. ఆ తర్వాత కొన్ని బంధాలు బాంధవ్యాల్లో చిక్కుకు పోవడం వలన తన గేమ్ పక్కకెళ్ళిపోయింది. అతనికి హౌస్ నుంచి బయటికి వెళ్లిపోవలసిన పరిస్థితి కూడా వచ్చేసింది.

ఈ సీజన్ చదరంగం కాదు రణరంగం అని చెప్పినట్లు హౌస్ నుంచి బయటికి వెళ్లిపోయిన వాళ్లు కూడా లోపలికి వచ్చే అవకాశం కలిగింది. ఇందులో భాగంగా భరణి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. దాదాపు 11 వారాలు పూర్తి చేసుకుంటున్న ఈ షో ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది.

నాగబాబు చెప్పిన ఫ్లాష్ బ్యాక్ 

Advertisement

ఇది ఫ్యామిలీ వీక్ అని ముందు నుంచి చెబుతున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా భరణి మదర్ మరియు నాగబాబు హౌస్ కి ఎంట్రీ ఇచ్చారు. స్టేజ్ పై నాగబాబు మాట్లాడుతూ భరణి ఫ్లాష్ బ్యాక్ చెప్పారు.

నాగబాబు మాట్లాడుతూ భరణి అప్పట్లో చాలా లావుగా ఉండేవాడు. బాక్సింగ్ ప్రాక్టీస్ అది చేసేవాడు. బహుశా అలా బాక్సింగ్ ప్రాక్టీస్ చేయటం వలన కావచ్చు. ఏదైనా ముందు కొట్టి మాట్లాడుతాడు. అప్పట్లో ఏదైనా ఒక గొడవ వచ్చినా కూడా ముందు మొహం మీద ఒక షాట్ కొట్టి తర్వాత మాట్లాడేవాడు అంటూ నాగబాబు దానిని రివిల్ చేశారు. ఇది చెప్పగానే నాగార్జున షాక్ అయిపోయారు.

ఇలా ఉండటం నచ్చట్లేదు 

Advertisement

భరణి చాలా అగ్రిసివ్ గా ఉండేవాడు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మరి సౌమ్యంగా తయారైపోయాడు. భరణి ముఖ్యంగా చిరంజీవి మెగాస్టార్ కి విపరీతమైన అభిమాని నన్ను కూడా బాగా ఇష్టపడేవాడు మొత్తంగా మెగా ఫ్యాన్ అని అనుకోండి. ఆ విధంగా నేను భరణికి గురూజీ అయ్యాను అంటూ ఆసక్తికర విషయాలు బయటకు చెప్పారు నాగబాబు.

నాగబాబు మరియు భరణి మదర్ హౌస్ కి రావడంతో భరణి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నా జీవితంలో ఇది నేను మర్చిపోలేను. ఇప్పటివరకు నాకు జరిగిన హ్యాపీెస్ట్ మూమెంట్స్ లో ఇది బెస్ట్ అంటూ భరణి కూడా ఎమోషనల్ అయిపోయాడు.

అయితే ఇంత ఫ్లాష్ బ్యాక్ ఉంచుకొని కూడా హౌస్ లో చాలా పద్ధతిగా రేలంగి మామయ్య లాగా కనిపిస్తున్నారు భరణి. ఇక గేమ్ ముందు ముందు ఎలా ఉండబోతుందో అనే క్యూరియాసిటీ చాలామందికి ఇప్పుడు మొదలైంది. భరణి టాప్ ఫైవ్ లో ఉంటారు అనే నమ్మకం చాలా మందికి ఉంది.

Also Read: Andhra King Taluka : ఆంధ్ర కింగ్ తాలూకా ఆ రేంజ్ లో ఉందా? ఉపేంద్ర మాటలు వెనక ఆంతర్యం ఏంటి?

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×