E-Paper
Advertisement

ODI in Vizag : వైజాగ్ లో సౌతాఫ్రికాతో వన్డే..రోహిత్‌, కోహ్లీ వ‌స్తున్నారు..టికెట్లు ఎప్పుడంటే

ODI in Vizag : వైజాగ్ లో సౌతాఫ్రికాతో వన్డే..రోహిత్‌, కోహ్లీ వ‌స్తున్నారు..టికెట్లు ఎప్పుడంటే
Advertisement

ODI in Vizag : డిసెంబర్ 6న భారత్‌-సౌతాఫ్రికా వన్డే మ్యాచ్ విశాఖ వేదిక‌గా జ‌రుగుతోంది. అయితే ఈ మ్యాచ్ కోసం ఈ నెల 29 నుంచి ఆన్‌లైన్‌లో టికెట్ల విక్రయం జ‌రుగ‌నున్న‌ట్టు స‌మాచారం. ఆన్‌లైన్‌లో 22 వేల టికెట్లు అందుబాటులో ఉండ‌నున్నాయి. మ‌రోవైపు డిసెంబర్ 4న విశాఖకు చేరుకోనున్నాయి ఇరు జట్లు. భారత్ మరియు దక్షిణాఫ్రికా మధ్య జరగబోయే వన్డే సిరీస్‌లోని చివరి మ్యాచ్ (3వ వన్డే) డిసెంబర్ 6, 2025న విశాఖపట్నంలో జరగనుంది. డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి ACA-VDCA క్రికెట్ స్టేడియం, విశాఖపట్నం వేదిక‌గా జ‌రుగ‌నుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటలకు (IST) ప్రారంభమవుతుంది. ఇది దక్షిణాఫ్రికా భారత పర్యటన, 2025/26లో భాగమైన మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో ఇది చివరిది. ఈ సిరీస్ లో ఇత‌ర మ్యాచ్ ల‌ను ప‌రిశీలించిన‌ట్ట‌యితే.. తొలి వ‌న్డే మ్యాచ్ న‌వంబ‌ర్ 30న రాంచీలో జ‌రుగుతుంది. రెండో వ‌న్డే డిసెంబ‌ర్ 3న రాయ్ పూర్ లో జ‌రుగ‌నుంది.

Also Read : Aus vs Eng Ashes 2025-26 : సెంచరీతో రెచ్చిపోయిన హెడ్.. మొదటి టెస్ట్ లో ఆస్ట్రేలియా విజయం.. 2 రోజుల్లోనే మ్యాచ్ ఫినిష్

టెస్ట్ సిరీస్ పూర్తి కాగానే.. వ‌న్డే సిరీస్

Advertisement

భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య టెస్ట్ సిరీస్ పూర్తవ్వగానే వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. మొదటి వన్డే నవంబర్ 30న జరగనుండగా, 3వ వన్డే మ్యాచ్ విశాఖపట్నంలో జరగనుంది. ఈ నేపథ్యంలో విశాఖపట్నం క్రికెట్ అభిమానులకు అధికారులు శుభవార్తను అందించింది. డిసెంబర్ 6న జరిగే భారత్–సౌతాఫ్రికా వన్డే మ్యాచ్ కోసం ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఈ మ్యాచుకు సంబంధించి ఈ నెల 29వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో టికెట్ల విక్రయం ప్రారంభం కానుందని ఆంధ్ర క్రికెట్ సంఘం అధికారులు ప్రకటించారు. మొత్తం 22 వేల టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు డిసెంబర్ 4న ఇరు జట్లు విశాఖకు చేరుకోనున్నాయి. ఆ తర్వాత ప్రాక్టీస్ సెషన్లు, భద్రతా ఏర్పాట్లను అధికారులు సమీక్షించనున్నారు.

విరాట్, రోహిత్ శ‌ర్మ‌ను చూసేందుకు ఆస‌క్తిగా అభిమానులు

ముఖ్యంగా టీమిండియా (Team India) సీనియ‌ర్ క్రికెట‌ర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ వ‌న్డే మ్యాచ్ లు మాత్ర‌మే ఆడుతుండ‌టంతో వారికి ఉన్న క్రేజ్ వేరు. ప్ర‌స్తుతం ఇండియా క్రికెట్ లో వారిద్ద‌రికీ మామూలు క్రేజ్ ఉండ‌దు. వాళ్లు వ‌న్డే మ్యాచ్ లు ఆడుతున్నార‌నే విష‌యం తెలుసుకున్న అభిమానులు స్టేడియం వ‌ద్ద కుప్ప‌లు తెప్ప‌లుగా క‌దిలి వ‌స్తుంటారు. మ‌రోవైపు త‌మ అభిమాన క్రికెట‌ర్ ను చూసేందుకు అభిమానులు ఎంతో ఆస‌క్తిగా మ్యాచ్ ను వీక్షించేందుకు వెళ్తుంటారు. కానీ అక్క‌డికి వెల్లాక త‌మ పేవ‌రేట్ క్రికెట‌ర్ స‌రిగ్గా క‌నిపించ‌క‌పోవ‌డంతో ఇబ్బందులు ఎదుర్కొటుంటారు. కొంద‌రూ అభిమానులు అయితే ఏకంగా స్టేడియంలోకి దూసుకెళ్లి.. త‌మ అభిమాన క్రికెట‌ర్ తో ఫొటోలు, సెల్పీ దిగాల‌ని భావిస్తుంటారు. ఇలా ర‌క‌ర‌కాలుగా వ్య‌వ‌హరిస్తుంటారు.

Advertisement

Also Read : Natasha-Hardik Pandya: కొత్త కారు కొన్న నటాషా…హార్దిక్ పాండ్యా డ్రాయర్ విలువ కాదంటూ ట్రోలింగ్ !

Related News

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

Big Stories

Advertisement
×