BigTV English
Advertisement

Bigg Boss 8 Telugu: మెహబూబ్ ‘కమ్యూనిటీ’ కామెంట్స్.. ఎట్టకేలకు స్పందించిన నాగార్జున

Bigg Boss 8 Telugu: మెహబూబ్ ‘కమ్యూనిటీ’ కామెంట్స్.. ఎట్టకేలకు స్పందించిన నాగార్జున

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ రియాలిటీ షో అనేది దేశవ్యాప్తంగా ఎంతోమంది చూస్తారు. భాష రాకపోయినా ఈ షోను ఫాలో అవ్వాలనుకునేవారు కూడా ఉన్నారు. అందుకే ఈ షోలో కంటెస్టెంట్స్‌గా వచ్చేవాళ్లు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. బయట సెన్సిటివ్‌గా ఉండే విషయాల గురించి మాట్లాడకుండా ఉండడమే మంచిది. కానీ బిగ్ బాస్ 4లో కంటెస్టెంట్‌గా వచ్చి మధ్యలోనే ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోయాడు మెహబూబ్. ఇప్పుడు బిగ్ బాస్ 8లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అవకాశం రావడంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ హౌస్‌లో అడుగుపెట్టిన మొదట్లోనే నబీల్‌తో కలిసి కమ్యూనిటీ కామెంట్స్ చేశాడు. దానిపై నాగార్జున ఎట్టకేలకు స్పందించారు.


వీకెండ్ ఎపిసోడ్‌కు ఎదురుచూపు

మెహబూబ్, నబీల్ ఒకే కమ్యూనిటీకి చెందినవారు. అందుకే వారి కమ్యూనిటీ ఓట్లు వారికే పడతాయి అంటూ మెహబూబ్ కామెంట్స్ చేశాడు. దీనికి ప్రేక్షకులకు చాలా కోపం వచ్చింది. గతవారం తను మెగా చీఫ్ కావడంతో నామినేషన్స్ నుండి తప్పించుకున్నాడు మెహబూబ్. లేకపోతే తనను ఇంటి నుండి బయటికి పంపించేవాళ్లం అంటూ కొందరు ప్రేక్షకులు ఓపెన్‌గానే కామెంట్స్ చేశారు. అయితే కనీసం వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జున వచ్చినప్పుడు అయినా మెహబూబ్‌ను ఏదో ఒకటి అంటారని ఆడియన్స్ కోరుకున్నారు. కానీ అలా జరగలేదు. అసలు మెహబూబ్ చేసిన కామెంట్స్ గురించి ఇతర కంటెస్టెంట్స్‌కు తెలియదు. ఈ విషయం అందరికీ తెలిసేలా చేసి వార్నింగ్ ఇస్తారని అనుకున్నారు. కానీ శనివారం ఎపిసోడ్ అంతా మామూలుగానే గడిచిపోయింది.


Also Read: బిగ్ బాస్ హిస్టరీలో తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న కంటెస్టెంట్ ఇతనే..!

కూల్ రియాక్షన్

మెహబూబ్ చేసిన కమ్యూనిటీ కామెంట్స్‌కు నాగార్జున స్పందిస్తారు, రెడ్ కార్డ్ ఇస్తారు, ఎలిమినేట్ చేస్తారు అని అనుకున్న ఆడియన్స్‌కు శనివారం ఎపిసోడ్ చూసిన తర్వాత నిరాశే మిగిలింది. ఫైనల్‌గా ఆదివారం ఎపిసోడ్‌లో దీని గురించి స్పందించారు నాగార్జున. ‘‘ఇది బిగ్ బాస్. ఇక్కడ అందరూ సమానమే. కమ్యూనిటీలు లాంటివి ఉండవు’’ అని క్లారిటీ ఇచ్చారు. అయితే ఇది ఎందుకు చెప్తున్నారు, ఎవరి గురించి చెప్తున్నారు అని మాత్రం ఎవ్వరికీ చెప్పలేదు. దీంతో అసలు మెహబూబ్ చేసిన కామెంట్స్ కంటెస్టెంట్స్‌కు తెలియకుండా తప్పించుకున్నాడు. కానీ అలాంటి కామెంట్స్‌కు నాగార్జున ఇంత కూల్‌గా రియాక్ట్ అవ్వడం ఎవ్వరికీ నచ్చలేదు.

వెళ్లిపోతే బాగుంటుంది

నాగార్జున చెప్పింది తన గురించేనేమో అని మెహబూబ్‌కు కూడా అనుమానం వచ్చిందేమో అని ప్రేక్షకులకు అనిపించింది. కానీ ఇంత కూల్ రియాక్షన్ మాత్రం వారు ఊహించలేదు. మొత్తానికి దానివల్ల మెహబూబ్‌కు ప్రేక్షకుల్లో నెగిటివిటీ మాత్రం ఏర్పడింది. బిగ్ బాస్‌లో కంటెస్టెంట్స్‌గా వచ్చినవారు ఏ క్యాస్ట్, ఏ కమ్యూనిటీ అని పట్టించుకోకుండా వారి ఆటతీరు మాత్రమే చూసి ఓట్లు వేసేవాళ్లు చాలామంది ఉంటారు. కానీ మెహబూబ్ మాత్రం తన కమ్యూనిటీ ఓట్లు తనకే పడతాయి అనుకోవడం చాలా తప్పు అని ఆడియన్స్ ఫీలవుతున్నారు. వచ్చేవారం మెహబూబ్ నామినేషన్స్‌లో ఉండి ఎలిమినేట్ అయిపోతే బాగుంటుంది అని కూడా కొందరు అనుకుంటున్నారు.

Related News

Bigg Boss 9 Telugu : ఇమ్మూ ఫ్యాన్స్ కు రక్తకన్నీరు… ముద్దుబిడ్డకు అడ్డు తొలగించడానికే ఈ బిగ్ ప్లానా ?

Bigg Boss 9 : పోకిరి లెవెల్ ట్విస్ట్, దివ్య కు ఇచ్చి పడేసిన భరణి, అసలైన విలనిజం

Bigg Boss 9 Telugu Day 64 : దివ్యను దులిపేసిన రీతూ… భరణి భయ్యా ఇదస్సలు ఊహించలే… కెప్టెన్ ఇమ్మూకు క్రేజీ షాక్

Bigg Boss 9: ఈవారం నామినేషన్స్ లోకి వచ్చింది ఎవరంటే?

Bigg Boss 9 Promo : ఫుడ్‌పై ఉన్న ఫోకస్ గేమ్‌పై లేదు… గౌరవ్‌ను గజగజ వణికించారు.!

Bigg Boss 9 Promo: ఇదెక్కడి గోలరా.. ఆమె మాట వింటారంటున్న రీతూ!

Bigg Boss : బిగ్ బాస్ ఫైనల్ విజేత ఆమె.. ప్రైజ్ మనీ భారీగా కట్.. ఎందుకంటే?

Bigg Boss 9 Telugu: జాక్ పాట్ కొట్టేసాడే.. అందరికంటే ఎక్కువ రెమ్యూనరేషన్..?

Big Stories

×