Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ 8లో 16 మంది కంటెస్టెంట్స్‌గా ఎంటర్ అయ్యారు. అందులో కొందరు సీరియల్ ఆర్టిస్టులు, ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్లు ఉన్నారు. ఆ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ కేటగిరిలో మణికంఠ కూడా ఒకడు. కానీ తన గురించి ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. అందుకే మొదటి రోజే తను ఎలిమినేట్ అయిపోయినా పర్వాలేదని ఇతర కంటెస్టెంట్స్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. దానిని కసిగా తీసుకున్న మణి.. గట్టిగా ఆట మొదలుపెట్టాడు. మొదటివారమే నిజాయితీగా ఉండడం కోసం తన విగ్ తీసి చూపించి అందరికీ షాకిచ్చాడు. అప్పటినుండి ఫేమస్ అయిన మణి తాజాగా బిగ్ బాస్ తనవల్ల కాదంటూ నవ్వూతూ బయటికొచ్చాడు.
టైమ్ ఇచ్చినా అంతే
తాజాగా జరిగిన ఎలిమినేషన్‌లో గౌతమ్, మణికంఠ ఇద్దరూ డేంజర్ జోన్‌లో ఉన్నారని, వారిని యాక్షన్ రూమ్‌కు రమ్మన్నారు నాగార్జున. వాళ్లిద్దరూ అక్కడికి వెళ్లగానే మిగతా కంటెస్టెంట్స్‌కు ఒక వీడియో చూపించారు. అందులో మణికంఠ ఒంటరిగా కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు. ‘‘నా వల్ల కావడం లేదు బిగ్ బాస్. గుండెలో గుబులుగా ఉంది. ఈ షో నాకు చాలా నేర్పించింది. దాంతో నేను బయటికి వెళ్లాలనుకుంటున్నాను’’ అని చెప్తున్నాడు. అది కూడా కంటెస్టెంట్స్ కూడా బిగ్ బాస్ నుండి మణి వెళ్లిపోతూనే బెటర్ అని అనుకున్నారు. దీంతో యాక్షన్ రూమ్‌లో వెయిట్ చేస్తున్న మణితో మాట్లాడారు నాగ్. తనకు అయిదు సెకండ్లు టైమ్ ఇచ్చి ఉండాలో వెళ్లాలో డిసైడ్ అవ్వమన్నారు. అయినా తను వెళ్లిపోతా అనే అన్నాడు.
Also Read: బిగ్ బాస్ హిస్టరీలో తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న కంటెస్టెంట్ ఇతనే..!
మనసులో ఏదో ఉంది
చివరిగా గౌతమ్, మణికంఠ డేంజర్ జోన్‌లో ఉన్నారు కాబట్టి మణి తనంతట తానుగా వెళ్లిపోతాను అనకపోయింటే గౌతమ్ ఎలిమినేట్ అయ్యేవాడని, ఎందుకంటే తనకే ఓటింగ్ తక్కువ వచ్చిందని నాగార్జున రివీల్ చేశారు. దీంతో గౌతమ్ షాకయ్యాడు. మణికంఠ ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడని చాలామంది ఊహించలేదు. అందుకే నయని పావని ఏడ్చేసింది. తన మనసులో ఏదో ఉంది కాబట్టే మణి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని నిఖిల్ అనుకున్నాడు. బయటికి వెళ్లిన తర్వాత నీ భార్యతో ఫోన్‌లో మాట్లాడు అని గంగవ్వ చెప్పగానే నా భార్యతో ఉండాలంటే నా ఆరోగ్యమే ముఖ్యం అని స్టేట్‌మెంట్ ఇచ్చి వెళ్లాడు మణికంఠ. కానీ తాను మాత్రం తృప్తిగానే హౌస్ నుండి వెళ్తున్నానంటూ నవ్వుతూ వెళ్లిపోయాడు.
ఓపిక అయిపోయింది
ఎలిమినేట్ అయ్యి స్టేజ్‌పైకి వచ్చిన తర్వాత కూడా తాను ఆరోగ్యమే ముఖ్యం అనుకొని బయటికి వచ్చేశానని, అయినా ప్రేక్షకులను ఏదో ఒకవిధంగా ఎంటర్‌టైన్ చేస్తానని మాటిచ్చాడు మణి. తన ఓపిక అయిపోయింది కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నానంటూ క్లారిటీ ఇచ్చాడు. ఇక వెళ్లేముందు నిఖిల్ మళ్లీ ఆటలో పుంజుకోవాలని, గౌతమ్ అనవసరమైన సందర్భాల్లో మాట్లాడొద్దు అని సలహా ఇచ్చాడు. ప్రేరణ కూడా అనవసరమైన సందర్భాల్లో తన పాయింట్ చెప్పాలనుకుంటుందని, ఆ అలవాటు మానుకోవాలని అన్నాడు. పృథ్విని కోపం తగ్గించుకోమన్నాడు. హరితేజ, అవినాష్, రోహిణికి ఎంటర్‌టైనర్స్ అంటూ ట్యాగ్ ఇచ్చాడు మణికంఠ.