BigTV English

Bigg Boss 8 Telugu : నిఖిల్ కు నాగార్జున క్లాస్.. ఇదేంటి సడెన్ ట్విస్ట్.. ప్రేరణకు కౌంటర్..

Bigg Boss 8 Telugu : నిఖిల్ కు నాగార్జున క్లాస్.. ఇదేంటి సడెన్ ట్విస్ట్.. ప్రేరణకు కౌంటర్..

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు షోకు మరో వారంలో శుభం కార్డు పడబోతుంది.. 12 వారాలు పూర్తి చేసుకున్న ఈ షో 13 వ వారం ఎలిమినేషన్ ఆసక్తిగా మారింది. ఈ వారం నామినేషన్స్ కూడా నువ్వా నేనా అని సాగాయి. ఇక వీకెండ్ వచ్చిందంటే నాగార్జున ఎపిసోడ్ ప్రోమో కోసం అంతా ఎదురుచూస్తుంటారు. అయితే గత కొన్నివారాలుగా కంటెస్టెంట్స్‌లో ఫైర్ లేనట్టే.. హోస్ట్ నాగార్జునలో కూడా ఫైర్ కనిపించడం లేదు. ఒకరకంగా చెప్పాలంటే.. నాగార్జున హోస్టింగ్ కంటే.. కంటెంస్టెంట్ ఆట తీరే కాస్త మెరుగు. వారం మొత్తం జరిగిన ఆట చూసి.. అందులో బాగా ఎవరు ఆడారు. ఎవరు బాగా ఆడలేదు. తప్పు ఎవరిది ఒప్పు ఎవరిది అనేది హోస్ట్ చెప్పాల్సి ఉంటుంది. అది కూడా ఆయన పర్సనల్ ఒపీనియన్‌లో కాకుండా ఆడియన్స్ కోణంలో ఆలోచించి ఓటింగ్ ఎవరికీ ఎక్కువగా వచ్చింది వాళ్ళు చేస్తున్న తప్పులు చేస్తే నాగార్జున వీకెండ్ ఎపిసోడ్ లో ఫుల్ ఫైర్ అవుతాడు. అదే విధంగా ఈ వారం కూడా జరిగింది. నాగార్జున చేతిలో ఈ వారం ఎవరికీ క్లాస్ పడింది అనేది క్లారిటీగా ఒకసారి తెలుసుకుందాం..


శనివారం ఎపిసోడ్ అంటే ఆడియన్స్ కు చాలా ఇష్టం ఉంటుంది. అందుకే ప్రతి వీకెండ్ నాగార్జున్ ఫుల్ జోష్ తో వచ్చేసాడు. అలాగే ఈ వారం. కూడా స్టైలిష్ లుక్ లో ఆకట్టుకున్నాడు. నాగార్జున వచ్చి డబుల్ ఎలిమినేషన్ అంటూ బాంబ్ పేల్చారు. ఆ తరువాత టికెట్ టు ఫినాలే గెలిచిన అవినాష్‌కి బంపరాఫర్ ఇచ్చారు నాగార్జున. ఆ తర్వాత అంతేకాదు.. ప్రైజ్ మనీని 54,30,000 అంటూ ఈ సీజన్ ప్రైజ్ మనీని సైతం ప్రకటించారు. అయితే ఈ ప్రైజ్ మనీలో కోత విధించవచ్చని మెలికపెట్టారు నాగార్జున. ఆ తరువాత.. హౌస్‌లో ఉన్న వాళ్లలో కొంతమందికి గోల్డెన్ టికెట్స్.. మరికొంతమందికి బ్లాక్ టికెట్స్ ఇస్తాం అంటూ టికెట్ల ఆట మొదలుపెట్టారు నాగార్జున..

ఇక నిఖిల్ తో మాట్లాడుతూ.. బ్లాక్ టికెట్ ఎవరికి వస్తుందో గెస్ చేయి’ అని అడిగారు. దానికి మనోడు చాలా సేఫ్‌గా.. ‘తెలియదు సార్’ అని అన్నాడు. దాంతో కౌంటర్ వేసిన నాగార్జున.. ‘ఇందుకే నీకు చెప్తుంటా.. సేఫ్ ఆడొద్దని’ అంటూ పంచ్ వేశారు. ఆ తరువాత నాగార్జునకి వీకెండ్ వస్తే.. ఒకే వ్యక్తిని టార్గెట్ చేయడం మొదటి నుంచి అలవాటు.అయ్యింది.. గ్రూపుజం చెయ్యడం మానెయి అంటూ షాక్ ఇచ్చాడు. ఈవారం కూడా గౌతమ్‌ని కెలికారు. రోహిణి.. పృథ్వీకి బ్లాక్ టికెట్ ఇస్తుంటే.. గౌతమ్‌కి కూడా నాలుగు ఛాన్స్‌లు వచ్చాయి కదా.. మరి గౌతమ్‌కి ఎందుకు ఇవ్వవు.. పృథ్వీకే ఎందుకు ఇస్తున్నావ్ అని గుచ్చి గుచ్చి అడిగారు. ఇక ఆ తర్వాత ప్రేరణనాకు బుద్ది మార్చుకో అని సీరియస్ అయ్యాడు. ఇక ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉందన్న సంగతి తెలిసిందే.. నిన్న తేజా ఎలిమినేట్ అయ్యాడు. ఇవాళ ఎవరు వెళ్తారో చూడాలి..


Tags

Related News

Bigg Boss 9 Promo: హిప్పో ఆకలి తీరేనా.. కంటెస్టెంట్స్ మధ్య భీకర యుద్ధం!

Bigg Boss Thanuja: ఫస్ట్ లవ్ రివీల్ చేసిన తనూజ, మరీ ఇంత ముదురా?

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బిగ్ బాస్ ప్రియా శెట్టి.. కానీ?

Bigg Boss 9 Promo: గోల్డెన్ ఆపర్చునిటీ.. పాపం ఆ కంటెస్టెంట్ బలి!

Bigg Boss 9: నామినేషన్ లో 6గురు..గురి వారి మీదే!

Bigg Boss Promo: దివ్య ను టార్గెట్ చేశారా? ఆ కామనర్ దగ్గర హౌస్ మేట్స్ నిజంగానే తోలుబొమ్మలా?

Bigg Boss 9 Promo: మళ్లీ నోరు జారిన హరిత హరీష్.. ఈసారి బ్యాండ్ బాగానే!

Bigg Boss 9 Promo: నామినేషన్ రచ్చ షురూ.. వ్యాలీడ్ పాయింట్స్ చెప్పండమ్మా!

Big Stories

×