Bigg Boss Teja Remuneration: టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు 13 వారాలు పూర్తి చేసుకుంది. 12 వ వారం యష్మీ ఎలిమినేట్ అయ్యిన విషయం తెలిసిందే. ఇక 13 వ వారం నామినేషన్స్ లో ఐదుగురు ఉన్నారు. నామినేషన్స్ లో ఉన్న అందరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కావడంతో ఎవరు ఎలిమినేట్ అవుతారా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. వీకెండ్ ఎపిసోడ్ ఎప్పుడు ఆసక్తిగా ఉంటుంది. నాగార్జున వేసే స్టెప్పులతో పాటుగా, ఆయన స్టేజ్ మీదకు రాగానే వేసే డ్యాన్స్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది. అలాగే ఎలిమినేట్ అయ్యేది ఎవరన్న సస్పెన్స్ కు తెర పడుతుంది. మరి ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అనే వార్తలు నెట్టింట వినిపిస్తున్నాయి. శనివారం ఎపిసోడ్ లో తేజా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చాడు. వైల్డ్ కార్డు ద్వారా బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇచ్చిన తేజా ఎంత సంపాదించాడో తెలుసుకోవాలని ఆడియన్స్ ఆశ పడుతున్నారు. మరి ఆలస్యం ఎందుకు అసలు తేజా ఎంత వసూల్ చేసాడో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఈ వారం హౌజ్ కంటెస్టెంట్స్ మధ్య టికెట్ టు ఫినాలే టాస్క్ పెట్టడమే కాకుండా బిగ్ బాస్ తెలుగు 8 పదమూడో వారం డబుల్ ఎలిమినేషన్ ప్రక్రియను తీసుకొచ్చారు. గత వారం ఇద్దరు వెళ్ళే ఛాన్స్ ఉందని నెట్టింట తెగ ప్రచారం జరిగింది. కానీ కన్నడ బ్యూటీ యష్మీ ఒకటే బయటకు వచ్చేసింది. ఈ వారం మాత్రం ఇద్దరు పక్కా అని తెలుస్తుంది. బిగ్ బాస్ తెలుగు 8కు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అడుగుపెట్టిన వారంలో ఒకసారి డబుల్ ఎలిమినేషన్ జరిగింది. ఇప్పుడు 8 వారాల తర్వాత రెండోసారి డబుల్ ఎలిమినేషన్ నిర్వహించనున్నారు. అయితే, బిగ్ బాస్ 8 తెలుగు నుంచి ఇవాళ టేస్టీ తేజ ఎలిమినేట్ అయి హౌజ్‌ను వీడి వెళ్లిపోయాడు. హౌస్ లోకి వచ్చిన మొదట్లో బాగానే పేర్ఫామ్ చేశారు. కానీ గత రెండు వారాల నుంచి తేజా గేమ్ డల్ అయ్యిందని తెలుస్తుంది. దాంతో తక్కువ ఓటింగ్ ను అందుకొని హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు.
ఫ్యామిలీ వీక్‌లో తన తల్లిని బిగ్ బాస్ హౌజ్‌లో చూడాలనే కోరికను కూడా నెరవేర్చుకున్నాడు. అయితే, టికెట్ టు ఫినాలే సాధించి బిగ్ బాస్ ఫైనల్స్‌లోకి వెళ్లేందుకు బాగానే ట్రై చేసిన టేస్టీ తేజ సక్సెస్ కాలేకపోయాడు.. బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లో అక్టోబర్ 6 హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన టేస్టీ తేజ 8 వారాల పాటు ఉన్నాడు… దాదాపు నెలల పైగానే హౌస్ లో ఉన్నారు. ఇక బిగ్ బాస్ తెలుగు 8లో పాల్గొన్నందుకు టేస్టీ తేజ వారానికి రూ. లక్ష యాభైవేలు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. దీంతో బిగ్ బాస్ 8 తెలుగు ద్వారా టేస్టీ తేజ రెండు నెలల్లో రూ. 12 లక్షల పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది.. అదే నాలుగు లక్షలు వారానికి తీసుకుంటే 30 లక్షలకు పైగా అందుకున్నాడు.. ఏది ఏమైనా తేజా తన కామెడితో బాగానే నవ్వించాడు. ఇక డబుల్ ఎలిమినేషన్ పక్కా అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. రేపు పృథ్వీ వెళ్లే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది చూడాలి ఏం జరుగుతుంది అనేది సండే ఎపిసోడ్ లో చూడాలి…