Bigg Boss Nikhil Journey : బిగ్ బాస్ సీజన్ 8 ఒక్కరోజులో ముగుస్తుంది.. ఇక విన్నర్ ఎవరు అవుతారో అన్న క్యూరియాసిటి జనాల్లో మొదలైంది. ఈ సీజన్ ఎటువంటి హంగామాలు లేకుండా ముగింపు పలికేస్తున్నారు. కీలకమైన చివరి వారంలో అయితే బిగ్ బాస్ షో ఏ మాత్రం ఇంట్రస్ట్ లేకుండా.. కేవలం స్టార్ మా సీరియల్స్ ప్రమోషన్స్‌తో సరిపెట్టేశారు. అయితే లైవ్ ఎపిసోడ్‌లో నిన్నటి నుంచి అంటే ఫైనలిస్ట్‌ల బిగ్ బాస్ జర్నీ వీడియోలను చూపిస్తారు. ఎవరు హౌస్ లో ఎలా కొనసాగారో అన్నది వారికి సంబందించిన av లతో చూపించాడు.. అందులో భాగంగా నిఖిల్ జర్నీ గురించి ఇవాళ ఎపిసోడ్ లో చూపించారు. ఆయన జర్నీ వీడియో ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం..
బిగ్ బాస్ జర్నీలో మొదట చూపించారు బిగ్ బాస్.. ఇద్దరితో పోల్చితే నిఖిల్ జర్నీ వీడియో తేలిపోయింది.. అంతగా విజువల్స్ కట్ చెయ్యలేదు. నిఖిల్ గురించి బిగ్ బాస్ మాట్లాడిన మాటలైతే చాలా ఆసక్తికరంగా అనిపించాయి. నిఖిల్ జర్నీ వీడియో కంటే.. బిగ్ బాస్ మాట్లాడిన మాటలే బాగున్నాయి. ఇందులో నిఖిల్ ఆట గురించి.. అతనికి తగిలిన దెబ్బలు గురించి.. మనసు పడిన ఆవేదన, తపన గురించి చెప్పారు బిగ్ బాస్. అలాగే సోనియా, యష్మీల ప్రస్తావన కూడా తీసుకుని వచ్చారు. దాంతో పాటు.. నిఖిల్ పర్సనల్ లైఫ్ ఇష్యూస్‌ని ప్రస్తావించారు బిగ్ బాస్. నిఖిల్ నువ్వు మనసులో దేని గురించి అయితే కోరుకుంటున్నావో అది తప్పక నేరవేరుతుంది. అదే నీకు సంతోషాన్ని ఇస్తుందని బిగ్ బాస్ అంటాడు.. ఆ మాటలకు నిఖిల్ ఎమోషనల్ అవుతాడు.ఆ తర్వాత మాట్లాడుతూ.. నది పుట్టుక.. ఒక్కో బొట్టుగా నెమ్మదిగానే మొదలౌతుంది. కానీ ప్రయాణం ద్వారా ప్రవాహం పెరిగి మహానదిలా మారుతుంది. మీ ఆట తీరులో కూడా అదే ప్రతిబించింది. ఫలితం లభించినా లభించకపోయినా.. ఓపికతో ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఒక్కో గెలుపుకోసం ఎంతో శ్రమించారు. నిందలు ఎన్ని పడ్డా కూడా ఏకాగ్రతని కోల్పోలేదు.
అసలైన ఆటగాడికి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం అదే. మీరు ఎక్కడ పట్టు వదలకుండా ఆటలో మీ సత్తాను చూపించారు. అదే ఇక్కడికి వరకు తీసుకొచ్చింది. ఫైనల్ వరకు వచ్చేలా చేసింది. నువ్వు ఇలానే కొనసాగితే విన్నర్ పక్కా అవుతావు అని బిగ్ బాస్ అనడం విశేషం.. ప్రత్యర్థులతో తలపడ్డారు. గ్రూప్ గేమ్ అని మీ ఆటని వేలెత్తి చూపించినప్పుడు మీ మనసు అందుకు ఒప్పుకోలేదు. ఎందుకంటే మీరు.. గ్రూప్ కోసం మీ స్నేహం కోసం ఆడారు. కానీ మీ ఆట పూర్తిగా మీ వ్యక్తిగతం. మీరు నమ్మిన స్నేహితులందరూ మీ నమ్మకాన్ని నిలబెట్టుకోలేదు. మీ మనుసు ఎక్కడో ఉంది.. తప్పకుండ కోరిక నెరవేరుతుందని హామీ ఇచ్చారు. ఇక శనివారం ఎపిసోడ్ హైలెట్ గా నిలిచింది. మొత్తానికి ఒక్కొక్కరికి తమ జ్ఞాపకాలను చూపించడం పై జనాలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక తర్వాత ఎవరి ఏవి లను చూపిస్తారో చూడాలి..