Employee Dies: ఈ మధ్యకాలంలో గుండెపోటు వ్యాధి విపరీతంగా పెరుగుతోంది. అందుకు కారణాలు చాలానే ఉన్నాయి. నగర జీవితం అంటే చెప్పాల్సిన అవసరం లేదు. క్షణం సమయం దొరకని పరిస్థితి. వేగవంతమైన జీవనశైలితోపాటు పని ఒత్తిడి, ఫ్యామిలీ సమస్యలు ఎదుర్కొంటున్నాడు సామాన్యుడు. ఫలితంగా గుండెపోటు ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరుగుతున్నాయి. యువకుల నుంచి ముసలివారి ఈ సమస్య వెంటాడుతోంది. తాజాగా బాస్.. తన ఉద్యోగి గురించి పోస్ట్ చాలామందిని కంటతడి పెట్టించింది. మేటరేంటి అనుకుంటున్నారా? అక్కడికే వచ్చేద్దాం.
40 ఏళ్ల శంకర్ ఓ కంపెనీలో పని చేస్తున్నాడు. తన పైఅధికారి కేవీ అయ్యర్‌కు శనివారం ఉదయం 8. 37 గంటలకు ఫోన్‌లో ఓ మెసేజ్ పెట్టాడు. సార్.. తనకు తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నానని, ఇవాళ అనగా శనివారం ఆఫీస్‌కు రాలేనని పెట్టాడు. దయచేసి తనకు సెలవు మంజూరు చేయాలని అందులో కోరాడు. ఇది ఉద్యోగి వెర్షన్ మాత్రమే. అందుకు బాస్ ఏ విధంగా రిప్లై ఇచ్చాడంటే.. సాధారణంగా వెన్నునొప్పి అందరికీ వస్తుందని భావించి, సరే లీవ్ తీసుకో అని బాస్ అయ్యర్ రిప్లై ఇచ్చారు.
ఉద్యోగికి మెసేజ్ పంపిన పది నిమిషాలకు అంటే ఉదయం 8. 47 గంటలకు శంకర్ గుండెపోటుతో ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. ఈ విషయం శనివారం ఉదయం 11 గంటలకు బాస్ కేవీ అయ్యర్‌కు తెలిసి షాకయ్యారు. సహోద్యోగి లేరని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఉదయం తనతో మాట్లాడిన వ్యక్తి లేడన్న వార్తను జీర్ణించుకోలేకపోయారు. బాస్‌కి- ఉద్యోగికి మధ్య జరిగిన విషయాలను ఎక్స్ వేదకిగా అయ్యర్ పంచుకున్నారు.
ధూమపానం, మద్యపానం చెడు అలవాట్లు లేని శంకర్ అకస్మాత్తుగా గుండెపోటుతో చనిపోవడం నమ్మలేకపోతున్నానని రాసుకొచ్చారు. లైఫ్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం అసాధ్యమంటూ తన మనసులోని ఆవేదనను బయటపెట్టారు. ఈ పోస్ట్ సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఆరేళ్లుగా శంకర్.. అయ్యర్ వద్ద పని చేస్తున్నారు. క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని గడిపేవాడు. కొన్నాళ్ల కింద వివాహం చేసుకున్నాడు, అతడికి ఓ కొడుకు ఉన్నాడు.
ALSO READ: ఒక్కసారిగా నిద్రలేపితే మెదడు ఏమవుతుందో తెలుసా?
ఆరోగ్యం గురించి ఆన్‌లైన్‌లో రకరకాల చర్చలకు దారితీసింది. వెన్నునొప్పి, అలసట, చెమట, వికారం వంటివి గుండెపోటు ప్రారంభానికి లక్షణాలు చెబుతున్నారు నెటిజన్స్. ఇలాంటి విషయాల్లో ఏ మాత్రం అశ్రద్ధ చూపవద్దని చెబుతున్నారు. జీవితం నిజంగా అనూహ్యమైనది, చిన్న చిన్న కారణాలకే పోరాడుతున్నామని అన్నాడు మరొక నెటిజన్. మరణించిన శంకర్ ఆత్మకు శాంతి చేకూరాలని రాసుకొచ్చాడు. జీవితం ఎలాంటిది అని చెప్పడానికి నిదర్శనం ఈ ఘటన. ఈ హృదయ విదారక ఘటన ప్రతి ఒక్కరినీ కలచి వేస్తోంది.
DEVASTATING INCIDENT WHICH HAPPENED TODAY MORNING :-
One of my colleague, Shankar texted me today morning at 8.37 am with a message
"Sir, due to heavy backpain I am unable to come today. So please grant me leave." Such type of leave requests, being usual, I replied "Ok take…— KV Iyyer – BHARAT 🇮🇳🇮🇱 (@BanCheneProduct) September 13, 2025