Pallavi Prashanth : బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్.. రైతు బిడ్డగా హౌస్ లోకి వెళ్లి తన ఆట తీరుతో, మాట తీరుతో ప్రేక్షకులు మనసు దోచుకున్నాడు. ఆ తర్వాత బిగ్బాస్ నుంచి విన్నర్ సార్ బయటకు వచ్చిన తర్వాత అతనిపై పోలీస్ కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు. దాదాపు నాలుగు రోజులు అక్కడే గడిపి ఆ తర్వాత ఇంటికి వచ్చాడు. హౌస్ లో ఉన్నప్పుడు తనకు చిన్న డబ్బులను రైతులకు ఖర్చు చేస్తానని చెప్పాడు. కానీ పెద్దగా రైతులకు సాయం అందించినట్లు కనిపించలేదు. ఈమధ్య అప్పుడప్పుడు ఇంటర్వ్యూల ద్వారా కనిపిస్తున్న పల్లవి ప్రశాంత్ తాజాగా ఓ ఇంటర్వ్యూ ద్వారా సంచలన నిజాలను బయట పెట్టాడు…
బౌన్సర్స్ ఎందుకు..?
ఈమధ్య పల్లవి ప్రశాంత్ ఎక్కడ బయట కనిపించినా కూడా ఆయనతోపాటు బౌన్సర్లు కూడా కనిపిస్తుంటారు. ఈ విషయం పై ఇంటర్వ్యూ లో అడగ్గా.. “నాకెందు బౌన్సర్లు.. నేను ఏదైనా షాప్ ఓపెనింగ్‌కి వెళ్తుంటే వాళ్లే బౌన్సర్లను పెడుతున్నారు. దానికి నేనేం చేయాలి. బౌన్సర్లను అడిగితే తెలుస్తుందని అన్నాడు. పండ్లు ఉన్న చెట్టుకే రాళ్ల దెబ్బలు. పండ్లు లేకపోతే కొట్టరు కదా. నాతో ఉండి నాతో జర్నీ చేసిన వాళ్లు కూడా నా గురించి నెగిటివ్‌గా వీడియోలు పెడుతున్నారు.
నన్ను కావాలనే ఇరికించారు..
పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ నుంచి బయటకు రాగానే తొక్కిసలాట జరిగిందని అతని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన ప్రస్తావిస్తూ.. జైలు కి హాస్పిటల్ కి అస్సలు వెళ్ళకూడదు అంటూ చెప్పాడు. నా తప్పేమీ లేకపోయినా నన్ను కావాలని ఇరికించారు. జైల్లో నాలుగు రోజులు ఉంటే రెండు రోజులు భోజనం చేయలేదు మిగతా రెండు రోజులు తప్పని పరిస్థితిలో చేయాల్సి వచ్చింది. దేవుడని వాడుంటే అన్ని చూసుకుంటాడు అని పల్లవి ప్రశాంత్ అంటున్నాడు.
రాజకీయాల్లోకి రైతు బిడ్డ..
నేను దొంగపని చేయడం లేదు భయపడానికి. నేనేం చేస్తున్నానో నాకు తెలుసు. ఎవరేమన్నా పట్టించుకోను. చేయని తప్పుకి నేను జైలుకిపోయాను. ఎవరి వల్ల వెళ్లానో ఆ దేవుడికి తెలుసు. వాళ్ల పేరు చెప్పడం ఇష్టం లేదు.. హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత నా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నన్ను పొగిడిన వారే తర్వాత విమర్శలు గుప్పించారు. బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత సినిమాలు సీరియల్స్లలో బిజీ అవుతానని నేను అనుకున్నాను. కానీ నాకు ఎక్కడా ఒక్క ఆఫర్ కూడా రాలేదు. రాజకీయాల్లోకి వస్తానని శివాజీ అన్న లాంటి వాళ్లు ఆశీర్వదిస్తున్నారు. అంతా దేవుడి దయ. ఒక్కటే రైతులకి సపోర్ట్ చేయండి.. రైతు కొడుకుల్ని గౌరవించండి.. ప్రస్తుతం సీజన్ 9 జరుగుతుంది ఇందులో సామాన్యులకు ఎక్కువగా ప్రాధాన్యత ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ట్రై చేసి బిగ్ బాస్ లోకి వెళ్లే ఛాన్స్ ని తీసుకోండి అని పల్లవి ప్రశాంత్ చివరగా చెప్పారు..