WWE on Indian Father : సాధారణంగా 1990లో పిల్లలంతా అప్పట్లో WWE ని ఎంతో ఆసక్తి గా చూసేవారు. ముఖ్యంగా అండర్ టేకర్, జాన్ సెనా, ది గ్రేట్ ఖలీల పోరాటాలు అద్భుతమనే చెప్పాలి. అప్పట్లో లైట్లు ఆరినప్పుడల్లా గుండెలు గుబులు గుబులు అనేవి. అండర్ టేకర్ కిల్ ఇట్ అనే వ్యక్తీ ఎంట్రీ ఇచ్చేవాడు. అతని పోరాటం గురించి ఎంత చెప్పినా వర్ణణాతీతం. ప్రస్తుతం ఒక భారతీయ తండ్రి తన కొడుకు కలను సాకారం చేసుకుని.. ప్రముఖ రెజ్లర్ అండర్ టేకర్ మాదిరిగా నడుచుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక వాస్తవానికి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ వీడియోలో భారతీయ యువకుడు తన ఇంట్లో అండర్ టేకర్ ప్రవేశాన్ని పున: సృష్టించాడు.
అచ్చం అండర్ టేకర్ మాదిరిగానే..
ఇందుకు అతని తండ్రి సంగీతాన్ని అందించాడు. అతని యొక్క కదలికలను రికార్డు చేసి వీడియో తీశాడు. మసక బారిన లైట్లు.. ఆ యువకుడి కదలికలు, ఆ తండ్రి హార్మోనియం పై ప్లే చేస్తున్న పురాణ థీమ్ మ్యూజిక్ తో ఆ యువకుడు అండర్ టేకర్ రూపాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపించాడు. ఇక చివరికీ అతని తండ్రి ఇలా చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. “ఓహ్ తేరే పాస్ క్యాప్ తో హై హాయ్ నహీ.” అండర్ టేకర్ లా ఆ యువకుడి నటనను అభిమానులు ఇష్టపడినప్పటికీ అది వైరల్ గా మారింది. దీనిపై స్పందించిన అండర్ టేకర్ సైతం. “Well done young man” అంటూ స్పందించాడు. ఇక వెంటనే అభిమానులు పొగడ్తలతో ముంచెత్తారు. ” ఒక తండ్రి తన బిడ్డ ద్వారా సొంత కలను నెరవేర్చుకుంటున్నాడని భావిస్తున్నాను” అని చెప్పడం విశేషం.
రెజ్లింగ్ లో అండర్ టేకర్ హిస్టరినే..
WWE లెజెండ్ అండర్ టేకర్ అమెరికన్ ప్రొఫెసర్ రెజ్లర్. WWE లో 1990 నుంచి 2020 వరకు ది అండర్ టేకర్ పాత్రలో పని చేశాడు. ప్రొఫెషనల్ రెజ్లింగ్‌లో చరిత్ర సృష్టించాడు. WWE వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్ షిప్ ను చాలా సార్లు గెలుచుకున్నాడు. అలాగే 2007లో రాయల్ రంబుల్ మ్యాచ్ ని కూడా గెలిచాడు. అండర్ టేకర్ 2020లో WWE నుంచి రిటైర్మెంట్ అయ్యాడు. అతను రిటైర్మెంట్ అయిన తరువాత కూడా అతని అభిమానులు అతని ఆటను, అతని కదలికలను ఎంతగానో ఇష్టపడుతున్నారు. ఇతను 1990లో ఆరంగేట్రం చేశాడు. 2020లో తన చివరి రెజ్లింగ్ మ్యాచ్ ఆడాడు. 2020లో రెజిల్మేనియా 36లో AJ స్టైల్స్ తో జరిగిన బోనియార్డ్ మ్యాచ్ తరువాత అండర్ టేకర్ రిటైర్డ్ అయ్యాడు. 2025లో WWE NXT ఎపిసోడ్ లో ఒకదాంట్లో కనిపించాడు. అతను LFG షో బ్యాక్ స్టేజ్ లో భాగంగా కనిపించాడు. అందులో ఒబా ఫెమికి హెచ్చరిక చేశాడు. అయితే తాను తిరిగి రింగ్ యాక్షన్ లోకి రానని మాత్రం స్పష్టం చేశాడు. ఇక అప్పుడప్పుడు తన అభిమానులను ఆశ్యర్యపరిచేందుకు WWE ప్రోగ్రామ్స్ కి మద్దతు ఇవ్వడానికి టీవీల్లో కనిపిస్తుంటాడు అండర్ టేకర్. అతను ముచ్చటగా మూడు పెళ్లిలు చేసుకున్నాడు. తొలుత పెళ్లి చేసుకున్న ఇద్దరికీ విడాకులు ఇచ్చాడు. ఇక 2010లో మిచెల్ మెక్ కూల్ ను పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరూ ఇప్పుడు సంతోషంగా ఉన్నారు.