IND VS ENG, 3RD Test: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య బీకర సిరీస్ జరుగుతోంది. విదేశీ గడ్డపై.. ఐదు టెస్టులు ఆడేందుకు రంగంలోకి దిగింది టీం ఇండియా. ఈ నేపథ్యంలో టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య… ఐదు టెస్టుల సిరీస్ ఇటీవల ప్రారంభమైంది. అయితే ఈ ఐదు టెస్టుల సిరీస్ నేపథ్యంలో ఇప్పటికే రెండు మ్యాచ్లు పూర్తికాగా… మరో టెస్ట్ కోసం టీం ఇండియా రంగం సిద్ధం చేసుకుంటోంది. రెండు మ్యాచ్లు జరగక అందులో ఇంగ్లాండ్ మొదటి మ్యాచ్ గెలిచి.. సత్తా చాటగా, రెండో మ్యాచ్లో టీమిండియా దుమ్ము లేపింది. దీంతో ఈ రెండు జట్లకు మూడవ టెస్ట్ మ్యాచ్… అత్యంత ప్రాధాన్యతగా మారింది.
Also Read: MS Dhoni : ధోని ఫామ్ హౌస్ దగ్గర ఉద్రిక్తత.. సీరియస్ అయిన సాక్షి.. వీడియో చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే..!
లండన్ లోని లార్డ్స్ వేదికగా మూడవ టెస్ట్
టీమిడియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్ట్ లండన్ లోని లార్డ్స్ వేదికగా జరగబోతోంది. ఈ టెస్ట్ మ్యాచ్ కోసం ఇరుజట్లు ఇప్పటికే లండన్ చేరుకున్నాయి. ఎప్పటిలాగే పదో తేదీన…. మధ్యాహ్నం మూడున్నర గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇక… ఈ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ క్రీడాకారులందరూ హాజరయ్యే ఛాన్స్ ఉంది. విరాట్ కోహ్లీ దంపతులు కూడా ఈ మ్యాచ్కు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు చెబుతున్నారు.
బుమ్రా మళ్లీ వచ్చేస్తున్నాడు
టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరగబోయే మూడవ టెస్ట్ మ్యాచ్ కోసం డేంజర్ ఆటగాడు బుమ్రా మళ్లీ వచ్చేస్తున్నాడు. రెండో టెస్టు నేపథ్యంలో జట్టుకు దూరంగా ఉన్న బుమ్రా… మళ్లీ మూడవ టెస్ట్ మ్యాచ్ కోసం సిద్ధమవుతున్నాడు. వాస్తవానికి రేసుగుర్రం బుమ్రా లేకపోయినప్పటికీ ఆకాష్ దీప్ అలాగే మహమ్మద్ సిరాజ్ ఇద్దరు కలిసి జట్టును గెలిపించారు. ఇక ఇప్పుడు డేంజర్ ఆటగాడు బుమ్రా, అర్ష్ దీప్ కూడా తుది జట్టులోకి వస్తున్నారట. ఒకవేళ ఇదే జరిగితే… ఇంగ్లాండ్ ఆటగాళ్లకు యానిమల్ మూవీ ఫైరింగ్ సీన్ చూపించడం ఖాయమని అంటున్నారు. ఇది ఇలా ఉండగా… ఇంగ్లాండ్ గడ్డపై గిల్ కెప్టెన్సీలో టీమిండియా బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. దానికి తగ్గట్టుగానే గిల్ కేప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ఏమాత్రం గిల్… తడబడకుండా సెంచరీల మీద సెంచరీలు చేసుకుంటూ టీమిండియాను గెలిపించే ప్రయత్నం చేస్తున్నాడు. మరో మ్యాచ్ గెలిచి… తన సత్తా చాటాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.
Also Read: HBD MS Dhoni: బయటపడ్డ ధోని భాగోతం…హీరోయిన్ జీవితం నాశనం.. పిల్లలు పుడితే…. ?
లార్డ్స్‌లో ఇంగ్లండ్‌తో జరిగే 3వ టెస్టు కోసం భారత్ ఆడే అవకాశం ఉన్న XI: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్/సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (C), రిషబ్ పంత్ (wk), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్/అర్ష్‌దీప్ సింగ్, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా.
.